మెదక్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి ప్రవేశానికి లక్కీ డ్రా ద్వారా ఒక విద్యార్థిని ఎంపిక చేశారు. నార్సింగి మండలం జప్తిశివ్నుర్‌కు చెందిన దొబ్బల రోసిన ఎంపికైనట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
విద్యుత్తు సరఫరాకు నేడు అంతరాయం
భద్రాద్రి కొత్తగూడెం: సారపాక విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో నూతన లైన్ల ఏర్పాటులో భాగంగా సారపాక ప్రధాన కూడలి సమీపంలో
మంగళవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ ఉపేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులందరూ సిబ్బందికి సహకరించాలని కోరారు. -
ఈనెల 13న జిల్లా స్థాయి వ్యాసరచన పోటీ
ఖమ్మం: ఈనెల 13న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం ఎస్ఆర్అండ్‌బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉమ్మడి జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మొహ్మద్ జాకిరుల్లా తెలిపారు. ‘భారతదేశ స్వాతంత్రోద్యమం-ప్రపంచానికి ఆదర్శం’ అనే అంశంపై బుధవారం ఉదయం 11 గంటలకు వ్యాసరచన పోటీ ఉంటుందని, తెలుగు, ఇంగ్లీష్‌లో రాయవచ్చన్నారు. పూర్తి వివరాలకు 7981952341 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
-
దంచి కొడుతున్న వర్షం..
వరంగల్: జిల్లాలో వర్షం దంచికొడుతుంది. వివేకానందకాలనీ, సాయిగణేష్‌కాలనీ, శివనగర్, ఎన్టీఆర్‌నగర్ కాలనీల్లోకి వరద నీరు భారీగా పోటెత్తింది. గోకుల్ నగర్, శాంతి నగర్, కాలనీలకు వరద నీటితో ముప్పుపొంచి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు చేశారు. అత్యవసర సహాయం కోసం వరంగల్ 1800 425 3434, 9154225936, హన్మకొండ 1800 425 1115, జిడబ్ల్యూఎంసీ 1800 425 1980, 9701999676, హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
-
విస్తృత తనిఖీలు ఎక్కడంటే..
మెదక్: మెదక్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఇన్‌స్పెక్టర్ మహేశ్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీలలో ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఇన్‌స్పెక్టర్ రామకృష్ణతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో భద్రతాపరంగా అప్రమత్తతను పెంచేందుకు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
ప్రవేశాల గడువు పొడిగింపు..
హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రంలో ప్రవేశాల గడువును పొడిగించినట్లు సంచాలకులు ఆచార్య బి. సురేష్ లాల్ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ ఓరియన్‌టేషన్ కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10 వరకు పొడగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
-
పవర్ కట్..
వరంగల్: శంభునిపేట, కరీమాబాద్ విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో మంగళవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈ ఎస్.మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. యాదవవాడ, శివాలయం, శంభునిపేట, ద్వారకా అపార్ట్మెంట్, ఆర్టీవో కార్యాలయం, నాయుడు పెట్రోల్ పంపు, నానే మియా తోట, తదితర ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం కలుగుతుందన్నారు. వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలన్నారు.
-
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి.. ఎక్కడంటే
ఆదిలాబాద్: ఈతకు వెళ్లిన ఒకరు మృతి చెందిన ఘటన ఉట్నూరు మండలకేంద్రంలో వెలుగుచూసింది. ఎన్టీఆర్‌నగర్‌లో చెందిన సురేష్-రజిత దంపతులకు కుమారుడు చందు ఆదివారం స్నేహితులతో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చందు చెరువులో మునిగి మృతి చెందాడు. స్నేహితులు విషయం ఎవరికీ చెప్పకుండా ఇళ్లకు వెళ్లిపోగా.. కుటుంబసభ్యులు చందు కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం మృతదేహం బయటపడటంతో పోలీసులు కేసునమోదు చేశారు.
-
ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు..
ఖమ్మం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన మేరకు.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలన్నారు.
-
విద్యుత్తు వినియోగదారులకు అలర్ట్..
మెదక్: మనోహరాబాద్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా తూప్రాన్, శివ్వంపేట మండలాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని ఏఈ వెంకటేశ్వర్లు, ఏఈ రాకేష్ వేరువేరు ప్రకటనల్లో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సికింద్రాపూర్, గోమారం, చండి, శభాష్పల్లి ఉప కేంద్రాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.