Author: Shivaganesh

  • నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

    మెదక్: మనోహరాబాద్-132 కేవీ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుంది కాళ్లకల్ ఏఈ రాజ్‌కుమార్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మనోహరాబాద్ మండల పరిధిలోని ఆయా ఉపకేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందన్నారు. వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలన్నారు.

     

  • అలర్ట్.. జాబ్ మేళా వేదికలో మార్పు 

    వరంగల్: వరంగల్ చౌరస్తాలోని రాధాకృష్ణ వేడుకల మందిరంలో మంగళవారం నిర్వహించాల్సిన ఆర్యవైశ్య మహాసభ ఉద్యోగ మేళాను ఎల్బీనగర్‌లోని అబ్‌నూస్ వేడుకల మందిరానికి మార్చినట్లు మహాసభ వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షుడు తెలిపారు. క్యూఆర్ కోడ్ లింకుతో పేర్లు నమోదు చేసుకున్నవారు మాత్రమే ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని నిర్వాహకులు తెలిపారు.

  • విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా డిగ్రీ విద్య

    వరంగల్: గిరిజన విద్యార్థులకు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉచితంగా డిగ్రీ విద్యనందిస్తుందని ప్రభుత్వ అటానమస్ నర్సంపేట డిగ్రీ  కాలేజీ ప్రిన్సిపాల్ నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కోర్సు రుసుం రూ. 3200 లు కాగా గిరిజన తెగల విద్యార్థులకు రుసుం భారం కావద్దని రూ.500ల నామమాత్రం రుసుముతో ప్రవేశం ఇస్తున్నట్లు చెప్పారు. ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తివివరాలకు 7382929577 నంబరులో సంప్రదించాలన్నారు.

     

  • ‘పిల్లల ఆరోగ్య రక్షణ కోసం కార్యక్రమం’

    భద్రాద్రి కొత్తగూడెం: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని దమ్మపేట మండలంలోని పలు పాఠశాలలో సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల పిల్లలందరూ తప్పకుండా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • ‘రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి’

    మెదక్: 2025 జూన్ 5 తర్వాత కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా పథకానికి తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని రామాయంపేట వ్యవసాయ సంచాలకులు రాజునారాయణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 18-59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు, పాస్‌బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డుతో తమ క్లస్టర్ AEOలను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులకు ఈనెల 13 వరకు గడువు ఉందని వెల్లడించారు.

  • ‘రైతు బీమా కోసం దరఖాస్తులు చేసుకోవాలి’

    మెదక్: కొత్తగా పాస్‌బుక్‌లు పొందిన రైతులు, గతేడాది రైతు బీమా నమోదు చేసుకోని రైతులు ఈనెల 13లోగా రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం నర్సాపూర్ వ్యవసాయ శాఖ అధికారులు సంధ్యారాణి, దీపిక తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన రైతులు అవసరమైన పత్రాలతో తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  • మెదక్‌లో అత్యధిక వర్షపాతం ఎక్కడంటే..

    మెదక్: జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను సోమవారం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కౌడిపల్లి 25.0 మి.మి, చిల్పుచేడు 19.5 మి.మి, చెప్పల్దుర్తి నర్సాపూర్ 12.5 మి.మి, రామన్నపేట 8.5 మి.మి, కౌడిపల్లి 8.3 మి.మి, వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కౌడిపల్లిలో అత్యధిక శాతం వర్షం నమోదు అయినట్లు తెలిపారు. వర్షం  రాకపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

  • కోర్టుకు ఎమ్మెల్యే దంపతులు.. ఎందుకంటే..!

    మహబూబాబాద్: జిల్లా కోర్టుకు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ దంపతులు హాజరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్‌కు, జిల్లాను అభివృద్ధి చేయాలని శాంతియుత నిరసన తెలిపిన కారణంగా అక్రమ కేసులు పెట్టరాని అన్నారు. సుమారుగా 50 మంది కాంగ్రెస్ శ్రేణులపై కేసులపెట్టి భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైనట్లు తెలిపారు.

  • ‘చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి’

    ఖమ్మం: ఎమ్మెల్యే మట్టా రాగమయి జన్మదిన వేడుకలను సోమవారం సత్తుపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టిసారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ఆమెకు జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎస్సై ప్రదీప్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

  • ‘సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలి’

    భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు మండలం చల్లసముద్రం గ్రామంలో సోమవారం నూతన ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్యఅతిథి హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కోసం రైతుల రద్దీ దృష్ట్యా మండలంలో మూడవ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు సేంద్రియ వ్వవసాయంపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం రైతులందరికీ సరిపడే యూరియా అందుబాటులో ఉందని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరారు.