మహబాబూబాద్: గార్ల మండలం ముల్కనూరు పరిధిలో సోమవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు నూతన రేషన్ కార్డుల పంపిణీ నిర్వహించారు. ఈసందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అందనాల రాజీవ్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. పేదలకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
‘నమస్తే నర్సాపూర్’లో పాల్గొన్న రాజిరెడ్డి..
మెదక్: నర్సాపూర్‌లో సోమవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి నమస్తే నర్సాపూర్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు వార్డుల్లో సీసీరోడ్లు మధ్యలో ఆగిపోయినట్లు తెలిసిందన్నారు. పనుల గురించి ప్రభుత్వంతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
-
పోచమ్మతల్లికి ఎమ్మెల్యే పూజలు..
సంగారెడ్డి: రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఐదుగుళ్ల పోచమ్మతల్లి బోనాల పండుగలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
-
స్వామివార్లకు ప్రత్యేక పూజలు..
మెదక్: నర్సాపూర్‌లో శ్రావణమాసం సోమవారం పురస్కరించుకొని ధర్మశాల వీరభద్ర స్వామి ఆలయం, శ్రీరాజరాజేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. స్వామివారికి రుద్ర నమక చమకాలతో ఉదయం నుంచి అభిషేకాలు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
-
‘కోతి’ చేష్టలు.. ఆగిన రైలు
ఖమ్మం: కోతుల గుంపు కారణంగా రైలు నిలిచిపోయిన ఘటన సోమవారం కారేపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. కారేపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో కోతుల గుంపు రైల్వే విద్యుత్ లైన్‌కు తగలడంతో కరెంట్ తీగ తెగింది. అదే సమయంలో కారేపల్లి రైల్వేస్టేషన్‌కు సమీపంలో వస్తున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్ సరఫరా లేకపోవడంతో కాసేపు నిలిచిపోయింది. వెంటనే రైల్వేసిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రైలు సర్వీసులను పునరుద్ధరించారు.
-
ఘోరం: ప్రియుడి చేష్టలకు యువతి ఆత్మహత్య
మంచిర్యాల: ప్రేమించానని నమ్మించిన ప్రియుడు డబ్బు కోసం వ్యక్తిగత ఫొటోలతో వేధింపులకు దిగడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన రంగుల శ్రీకాంత్ భగవంతునివాడకు చెందిన యువతి(23) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే కట్నం ఇవ్వాలని షరతు విధించాడు. అలా కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు. దీంతో ఆమె ఉరివేసుకొని ప్రాణాలు విడిచింది.
-
పట్టింపు ఏది సారూ..?
వరంగల్: తొర్రూరు మండలంలోని వెలికట్ట గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలపై పట్టింపు కరవు అయ్యిందని స్థానికులు వాపోయారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రీడా ప్రాంగణంలో పిచ్చి మొక్కలు నిండిపోయి, పశువుల మేత స్థలంగా మారిందని అన్నారు. అధికారులు స్పందించి శుభ్రం చేసి, వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
-
సారూ.. కొంచెం పట్టించుకోండి..
భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండల కేంద్రం సరిహద్దులోని నెమలిపేట బ్రిడ్జి ప్రధాన రహదారిపై గుంతపడి ప్రమాదకరంగా మారింది. ఈసందర్భంగా పలువురు వాహనదారులు మాట్లాడుతూ.. ఇటీవల ఇదే రహదారిపై ఈ గుంతకు సరిగ్గా 100మీటర్ల దూరంలో ఉన్న మరో గుంతను పూడ్చాలని వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు, దీనిని మాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరారు.
-
రేషన్ కార్డుల పంపిణీ..
మెదక్: రామాయంపేట మండలం గోల్‌పర్తి గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, మళ్లీ ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్‌ల గురించి పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
కరెంట్ షాక్‌తో మహిళ మృతి..
ఖమ్మం: కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం మధిర పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన పగిడిపల్లి నీలమ్మ అనే మహిళ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో తో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.