సంగారెడ్డి: మున్సిపల్ అధికారులు 100 రోజుల ప్రణాళిక అంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తూ ఊదరగొట్టడమే గాని క్షేత్రస్థాయిలో వారి ప్రచారానికి తగ్గట్లు ఉండటం లేదని స్థానికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు స్థానికులు మాట్లాడుతూ.. రామచంద్రాపురం మండలం ఈఎస్ఐ నుంచి విద్యుత్‌నగర్‌కు వెళ్లే రహదారిపైన 365 రోజులు చెత్తే దర్శనమిస్తోందని వాపోయారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
Author: Shivaganesh
-
సిద్ధివినాయకుడికి ఎమ్మెల్యే పూజలు..
సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం రుద్రారం పరిధిలోని గణేష్‌గడ్డ సిద్ధివినాయక దేవాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
-
ఇసుక లారీలు ఎంత పని చేశాయంటే..
భద్రాద్రి కొత్తగూడెం: ఇసుక లారీల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటన ఆదివారం రాత్రి భద్రాచలం చోటుచేసుకుంది. భద్రాచలం సమీపంలో ఏటపాక-పిచుకలపాడు మధ్య ఇసుక లారీలను నిలిపి వేయడంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రుల్లోనే ఇసుకను జిల్లాలు, రాష్ట్రాలు దాటిస్తున్నారని, అధికారులకు ముడుపులు చెల్లిస్తూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతోందని స్థానికులు అంటున్నారు.
-
నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి..
భద్రాద్రి కొత్తగూడెం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని సమస్యలపై అర్జీలు అందజేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఉదయం 10.30 గంటల వరకు కలెక్టరేట్లో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
-
కారు- స్కూల్ బస్సు ఢీ.. విద్యార్థుల పరిస్థితి ఇలా..
మెదక్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయలైన ఘటన సోమవారం హవేలీ ఘన్‌పూర్ మండలం షామ్నాపూర్ వద్ద చోటుచేసుకుంది. రామాయంపేట నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓప్రైవేట్ స్కూల్ బస్సు, ఎదురుగా వస్తున్న కారు, బైక్ ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులకు పేను ప్రమాదం తప్పింది.
-
రైస్ మిల్లులో చోరీ.. ఎంత దోచుకెళ్లారంటే..!
మెదక్: రైస్‌లో చోరీ జరిగిన ఘటన కొల్చారం మండలం రంగంపేట శివారులో వెలుగుచూసింది. రంగంపేట శివారులోని తిరుమల రైస్ మిల్లులో చోరీ జరిగిందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా బాధిత యజమాని మాట్లాడుతూ.. రైస్‌లోని బీరువా తాళాలు ధ్వంసం చేసి రూ.4 లక్షలు చోరీ చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
చెన్నూరులో ‘రెడ్డి ఆత్మీయ సమ్మేళనం’
మంచిర్యాల: చెన్నూరు మండలం కిష్టంపేట బి.ఎం.ఆర్ ఫంక్షన్ హాల్లో రెడ్డి కులస్థుల ఆధ్వర్యంలో రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్డి జాగృతి వ్యవస్థాపకుడు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రెడ్డి లేని రాజ్యం లేదని, రానున్న రోజుల్లో రెడ్డిల ఐక్యతను ప్రతిఒక్కరికి తెలిసేలా చాటుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రెడ్డి కులస్థులు పాల్గొన్నారు.
-
సిద్దిపేటలో కార్మికుల సమ్మె
సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో బైఠాయించి ఆందోళన చేశారు. ఈసందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. సిద్దిపేట మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులుగా పని చేస్తున్న తమకు వెంటనే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మృతి చెందిన రాములు కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. ఆందోళనలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
-
పొంచి ఉన్న ప్రమాదం.. ఎక్కడంటే..
సంగారెడ్డి: అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్‌గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్‌క్లేవ్ ప్రధాన రహదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అవస్థలు అవుతున్నాయని వాహనదారులు వాపోయారు. పలువురు వాహనదారులు మాట్లాడుతూ.. బీటీ రోడ్డు వేసిన కొద్ది రోజులకే పైపులైన్ల కోసం ఇష్టారీతిగా తవ్వకాలు చేపట్టి, నామమాత్రంగా పూడ్చివేయడంతో రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.
-
ఘోరం.. ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు
ములుగు: అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఓ ఆటో ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అనంతరం పలువురిని మెరుగైన చికిత్స కోసం ములుగుఏరియా ఆసుపత్రికి తరలించారు.