Author: Shivaganesh

  • పోచమ్మ తల్లికి బోనాలు

    జనగామ: శ్రావణ మాసం మూడవ ఆదివారం సందర్భంగా జనగామ పట్టణంలోని పోచమ్మ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  మహిళలు అమ్మవారికి బోనాలు, చీర సారెలు, ఒడి బియ్యం సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ.. ఏటా శ్రావణ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • ఆలయ నిర్మాణానికి భూమి పూజ

    ఖమ్మం: కారేపల్లి మండలం లింగంబంజర గ్రామంలో ఆదివారం గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి యాదవ సంఘం పెద్దలు భూమి పూజ చేశారు. తుమ్మలకుంట ప్రాంతంలో దాత రేళ్ల సత్యనారాయణ అందజేసిన స్థలంలో యాదవకుల సంఘం ఆధ్వర్యంలో పూజ నిర్వహించారు. అనంతరం కుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంఘంసభ్యులు శ్రీనివాస్, రామరాజు, లింగయ్య, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

  • ముత్యాలమ్మ తల్లికి మొక్కులు

    ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని పెరిక వీధిలో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసం ఆదివారం కావటంతో గ్రామస్థులు ముత్యాలమ్మ తల్లికి భక్తి శ్రద్దలతో బోనం వండుకోని ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు. పలువురు భక్తులు మాట్లాడుతూ.. పాడిపంటలు, పిల్లపాపలను చల్లగాచూడాలని అమ్మను మొక్కుకున్నట్లు తెలిపారు.

  • నిర్లక్ష్యం.. కటకటాల వెనక్కి నెట్టింది

    మంచిర్యాల: వాహన ప్రమాదానికి కారణమైన ఆవు యజమానిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై మజారోద్దీన్ తెలిపారు. ఆగస్టు 8న కరీంనగర్‌కు చెందిన చిట్టిబాబు కుటుంబంతో కలిసి కారులో మంచిర్యాలకు వస్తుండగా, రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆవును ఢీకొట్టారు. ప్రమాదంలో వాహనంలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆవు యజమాని కార్తీక్‌పై కేసు నమోదు అవ్వడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

  • పెళ్లికి నో.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య 

    కుమ్రుంభీం: యువతి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. సిర్పూర్(యూ) మండలం పవర్ గూడకు చెందిన పగ్గుబాయి, ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ తనను పెళ్లి చేసుకోనని చెప్పడంతో పగ్గుబాయి మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

     

  • ‘ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించాలి’

    మంచిర్యాల: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మంచిర్యాల పట్టణంలోని వైశ్య భవన్లో వేడుకలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని, ఎంతో గొప్పతనం కలిగిన సంస్కృతిని కాపాడి భావితరాలకు అందించాలని జిల్లా అన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ఏకగ్రీవంగా ఉద్యోగుల సంఘం ఎన్నిక

    మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మంచిర్యాల డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. సమావేశానికి జిల్లా నాయకులు రాజేశం, శ్రీనివాస్ హాజరయ్యారు. సంఘం నూతన అధ్యక్షుడిగా సిహెచ్ లక్ష్మణ్, కార్యదర్శిగా పులిశ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

  • అలర్ట్.. రేపే లాస్ట్ డేట్.. అప్లై చేసుకున్నారా.!

    మంచిర్యాల: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో SDLCE ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11వ తేదీతో 2025-26 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ దరఖాస్తుల గడువు ముగుస్తుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు www.sdlceku.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • 13 తులాల బంగారం చోరీ..

    మంచిర్యాల: ఓ ఇంట్లో 13 తులాల బంగారం చోరీ ఘటన రామకృష్ణాపూర్ ఠాణా పరిధిలో వెలుగుచూసింది. గద్దెరాగడిలోని పద్మావతి కాలనీలో సింగరేణి ఉద్యోగి మేకల రాజయ్యకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. వరలక్ష్మి వ్రతం నిర్వహించి రాత్రి నిద్రపోయి, ఉదయం లేచేసరికి బ్యాగ్లో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలు కనించకపోవడంతో బాధిత  కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     

  • ‘ఉన్నత లక్ష్యాలను సాధించాలి’

    భద్రాద్రి కొత్తగూడెం: ఆదివాసీ గిరిజన భవనంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ITDA PO రాహుల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  భద్రాచలం ప్రాంతం నుంచి ఆరుగురు విద్యార్థులు డాక్టర్ సీట్లు సాధించారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించాలని అన్నారు. విద్యార్థులు బాగా శ్రమించి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరారు. గిరిజన గ్రామాల్లో వైద్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు.