భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసానిలో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. ఈసందర్భంగా కిన్నెరసానికి శనివారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 383 మంది పర్యాటకులు ద్వారా రూ.19,855 , 150 మంది బోటు షికారు చేయగా రూ.6వేలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Author: Shivaganesh
-
తల్లి మృతి.. గంటల వ్యవధిలోనే తనయుడు
ఖమ్మం: తల్లి చనిపోయిన గంటల వ్యవధిలోనే కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వేంసూరు మండలంలో వెలుగుచూసింది. అడసర్లపాడుకు చెందిన మారోజు కరుణాకర్ (33) HYDలో ఉంటున్నాడు. ఆయన తల్లి పులమ్మ (70) శుక్రవారం అనారోగ్యంతో చనిపోయింది. విషయం తెలుసుకొని ఆయన రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తనభార్య ఫోనుకు ‘కుమార్తెను బాగాచూసుకో’ అని మెసేజ్‌పంపాడు. తల్లీకొడుకుల మృతితో గ్రామంలో విషాధం నెలకొంది.
-
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై ఆరోపణలు..
ఖమ్మం: ఖమ్మం నగరంలోని వైఎస్సార్ కాలనీ 8వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈసందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ.. అనర్హులకు ఇళ్లు కేటాయించారని వాపోయారు. తమకు ఇళ్లు లేకున్నా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అర్హులకే ఇళ్లు ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు. సొంతిళ్లు ఉన్న వారికి ఇళ్లు కేటాయిస్తే ఆందోళన చేస్తామన్నారు.
-
రూ.155 కోట్లతో ఖమ్మంలో మిర్చి మోడల్ మార్కెట్
ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిజం చేశారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా రూ.153 కోట్లతో ఖమ్మంలో చేపట్టిన మోడల్ మిర్చి మార్కెట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 7 ప్రత్యేక షెడ్లు.. 2 లక్షల పైచిలుకు బస్తాలు పట్టేలా ఏసీ మిర్చి గోదాం షెడ్‌ను నిర్మిస్తున్నారు. పనులు సంక్రాంతి లోపు పూర్తి చేసేలా కొనసాగుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
-
పాపం.. రాఖీ కడుతూ చనిపోయింది
ఖమ్మం: రాఖీ కడుతూ ఓచెల్లి గుండెపోటుతో మృతిచెందిన ఘటన వైరా మండలం శనివారం చోటుచేసుకుంది. తన సోదరులకు రాఖీ కట్టేందుకు మధిర మండలం ఆత్కూరుకు చెందిన హుస్సేన్ బి(52) రాఖీ పండుగ సందర్భంగా కలకోడం గ్రామానికి వచ్చింది. అనంతరం ఆమె రాఖీ కడుతుండగానే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
-
ఘోరం.. భవనం పైనుంచి పడి రోగి మృతి
మహబూబాబాద్: ప్రమాదవశాత్తు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి భవనం పైనుంచి కిందపడి రోగి మృతి చెందిన ఘటన ఆదివారం మహబూబాబాద్‌లో వెలుగుచూసింది. ఇనుగుర్తి మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన ఐలయ్య (50) అనే వ్యక్తి 3 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రమాదవశాత్తు ఆయన ఆస్పత్రి మూడో ఫ్లోర్ నుంచి కిందపడి మృతి చెందారు.
-
అనారోగ్యంతో ఉద్యమ నాయకురాలు మృతి..
భద్రాద్రి కొత్తగూడెం: గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమ నాయకురాలు తూత నాగమణి ఆదివారం ఉదయం మరణించారు. దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా ఉన్నారు. ఆమె మరణంపై పార్టీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో ఆమెతో ఉన్న అనుబంధాన్ని కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.
-
సాగర్ కాల్వకు గండి.. పోటెత్తిన వరద నీరు
ఖమ్మం: సాగర్ కాల్వకు భారీ గండి పడిన ఘటన ఆదివారం వేంసూరు మండలంలో వెలుగుచూసింది. వేంసూరు మండలంలో సాగర్ కాల్వకు భారీ గండి పడి వరద నీళ్లు పంటపొలాల్లోకి వచ్చాయని రైతులు వాపోయారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. ఆంధ్రబోర్డర్‌లోని అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కాల్వకు గండిపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదనీటి కారణంగా చెరువులు తెగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
-
అడవి పందుల దాడిలో..
మెదక్: అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట నేలవాలిన ఘటన రామాయంపేట మండలంలో వెలుగుచూసింది. దంతపల్లి రామ్‌చందర్ నాయక్ తండాకు చెందిన మాలోతు రమేష్ మొక్కజొన్న పంటపై అడవి పందులు దాడి చేశాయి. ఈక్రమంలో పెద్దమొత్తంలో మొక్కజొన్న పంట విరిగిపోయి నష్ట పోయామని రైతు కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మంచిర్యాల: భీమారం మండల కేంద్రానికి చెందిన సెగ్యం బొందయ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందున్నారు. ఈక్రమంలో బాధిత కుటుంబ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. స్పందించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్ఓసీ చెక్కును మంజూరు చేయించారు. ఆదివారం బాధితుడి భార్య సెగ్యం లక్ష్మికి స్థానిక నాయకులు చెక్కును అందజేశారు.