జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలోని 10 ఇళ్లల్లో దొంగలు చోరీ చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుమారు 30 తులాల బంగారు నగలు, నగదు చోరీ చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకొని ఆదివారం లక్ష్మీనగర్ కాలనీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పర్యటించారు. ఆయన బాధితులకు ధైర్యం చెప్పి, వీలైనంత త్వరలో దొంగలను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Author: Shivaganesh
-
అన్న విగ్రహానికి రాఖీ కట్టిన సోదరి.. ఎక్కడంటే..
మహబూబాబాద్: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భూక్య లక్ష్మణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆయన జ్ఞాపకార్థంగా గ్రామస్తులు విగ్రహం ఏర్పాటు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా లక్ష్మణ్ సోదరి బానోతు లింగమ్మ శనివారం తన సోదరుడి విగ్రహానికి రాఖీ కట్టి భావోద్వేగానికి గురయ్యారు. తన అన్నాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
-
రైతులకు అలర్ట్.. 13 లోగా దరఖాస్తు చేసుకోవాలి
మెదక్: రామాయంపేట మండల వ్యాప్తంగా కొత్తగా పట్టాపాస్ పుస్తకం వచ్చిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాజునారాయణ ఒక ప్రకటనలో సూచించారు. రైతులు ఈనెల 13 లోగా తమ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ పత్రాలతో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలని సూచించారు.
-
ఈనెల 11న అల్బెండజోల్ మాత్రల పంపిణీ..
మెదక్: ఈనెల 11న జిల్లాలోని 2,11,964 మంది 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో భోజనం తర్వాత ఈ మాత్రలు వేయాలని, ప్రైవేటు పాఠశాలలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ఎవరైనా పిల్లలు మిగిలిపోతే, వారికి 18వ తేదీన మాత్రలు ఇస్తారని అన్నారు.
-
‘అంతరాయాలు లేకుండా చూడాలి’
మెదక్: విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్తు సరఫరా అందేలా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. పాపన్నపేట మండల కేంద్రంలో మిన్పూర్ 220/132/33 kvస సబ్ స్టేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విద్యుత్తు సరఫరాకు సంబంధించిన పరికరాలు, నిర్వహణ ఏర్పాట్లు, భద్రతా చర్యలు మొదలైన వాటిని పరిశీలించి, పలు సూచనలు చేశారు.
-
ప్రకృతి సోయగం.. కనువిందు చేస్తున్న జలపాతం
కుమ్రంభీం: కాగజ్‌నగర్ మండలం ఉట్పల్లి, రేగులగూడ గ్రామపంచాయతీకి కూత వేట దూరంలో ట్విన్స్ జలపాతం ఉంది. ఈ జలపాతం పర్యటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాలను వర్షాకాలం సీజన్‌లో సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. జలపాతాన్ని చేరుకోడానికి సరైన రహదారి, మౌలిక వసతులు కల్పించాలని పలువురు పర్యాటకులు అధికారులను కోరారు.
-
ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్.. ఒకరికి తీవ్ర గాయాలు
కుమ్రంభీం: ఎడ్లబండిని ఓబైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయలైన ఘటన శనివారం రాత్రి సిర్పూర్(టి) మండలం పారిగాం సమీపంలో చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఎడ్లబండికి ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. మద్యంతాగి వాహనం నడపడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
-
భూపాలపల్లిలో దొంగల హల్‌చల్.. 10 ఇళ్లలో చోరీలు
జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో దొంగల హల్చల్ చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. లక్ష్మీ నగర్ కాలనీలో రాఖీ పండగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరు వెళ్లిన 10 ఇళ్లల్లో చోరీకి పాల్పడినట్లు బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. సుమారు 30 తులాల బంగారం, నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
వరుస ఇండ్లలో చోరీ.. కేసు నమోదు
ఖమ్మం: వరుసగా ఉన్న ఇండ్లలో చోరీ జరిగిన ఘటన కలకలం సృష్టించాయి. సత్తుపల్లి పట్టణ శివారులోని సింగరేణి క్వార్టర్స్‌లో వరుసగా ఉన్న నాలుగు ఇండ్లలో చోరీలు జరిగిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద మొత్తంలో బంగారం, నగదు చోరీకి గురైనట్లు బాధితులు వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
మధిరలో పర్యటించనున్న ముగ్గురు మంత్రులు..
ఖమ్మం: మధిరలో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. ఈసందర్భంగా వారు మధిర మండలం వంగవీడు వద్ద జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని వైరా నదిపై రూ. 630.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ పథకం ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల భూములకు సాగునీరు అందనుంది.