Author: Shivaganesh

  • శునకానికి రాఖీ.. ఎక్కడంటే..!

    సంగారెడ్డి: దేశమంతా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో శనివారం ఓ సోదరి తనకు మూగజీవిపై ఉన్న ప్రేమను గొప్పగా చాటుకున్నారు. జిల్లాకు చెందిన  స్వర్ణలత అనే మహిళ ఓ గ్రామ సింహానికి రాఖీ కట్టి ప్రేమను చాటారు. విశేషం ఏమిటంటే ఆ శునకం ఆమె రాఖీ కట్టినంత సేపు ఆ శునకం ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఆమె తెలిపారు.

  • మంత్రికి రాఖీ కట్టిన నాయకురాలు..

    మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో శనివారం కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ మహిళా నాయకురాలు మల్లక్కరాఖీ కట్టి, దీవెనలు తీసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లకు, అక్కాతమ్ముల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని కొనియాడారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మంత్రికి రాఖీ కట్టడం సంతోషంగా ఉందన్నారు.

     

  • బావిలో మృతదేహం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

    మహబూబాబాద్: బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన శనివారం గూడూరు మండలం సీతానగారం శివారు ఆకులబండ తండాలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పెయింటర్‌గా పనిచేసే రాకేష్ బావిలో పడి మృతి చెందారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • ‘ఆదివాసీ సమాజం ప్రత్యేకం’

    ఆదిలాబాద్: నార్నూర్ మండల కేంద్రంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ అనుబంధ సంఘం నాయకుడు పెందోర్ దీపక్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీ సమాజం ప్రత్యేకతను ఆయన కొనియాడారు. ఆదివాసీల అన్ని చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగోరావ్, హనుమంతరావు, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

  • వైద్యం చేయమని.. పామును తెచ్చాడు..!

    వరంగల్: సాధారణంగా పామును చూస్తేనే చాలామంది భయపడిపోతుంటారు. అలాంటిది ఓవ్యక్తి ఆస్పత్రికి చంపిన పామును తీసుకెళ్లి తనకు వైద్యంచేయమన్న ఘటన శనివారం వర్ధన్నపేటప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఐనవోలు మండలం నందనానికి చెందిన రాజు కాలుపై పాము వెళ్లడంతో కరిచిందని భావించి, దానిని చంపేశాడు. పాము ఏదో తెలియకపోతే వైద్యం ఎలా చేస్తారోననే ఉద్దేశ్యంతో, దానిని కవర్లో ఆసుపత్రికి తీసుకురావడంతో వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.

  • అక్కాచెల్లెళ్లకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే

    జనగామ: స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య నివాసంలో శనివారం రాఖీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈసందర్భంగా ఆయనకు వారి చెల్లెల్లు రాఖీ కట్టి, దీవెనలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్కాచెల్లెళ్లకు అన్నయ్యగా ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భార్య ఫాతిమా మేరీ, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

  • రాఖీ కట్టిన మాజీ ఎంపీ..

    మహబూబాబాద్: బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత తన క్యాంపు కార్యాలయంలో రాఖీ పండుగ సందర్భంగా పలువురికి రాఖీలు కట్టారు. ఈసందర్భంగా పలువురు ముస్లిం సోదరులు ఆమెను గజ మాలతో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాఖీ అనేది ఒక మతానికి చెందిన పండుగ కాదని, ఇది పరస్పర విశ్వాసం, ప్రేమ, రక్షణకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.

     

  • కాలభైరవుడికి ప్రత్యేక పూజలు..

    సంగారెడ్డి: సదాశివపేట మండలం అరూర్ గ్రామ శివారులో కొలువైన శ్రీ లక్ష్మీ, కాలభైరవ స్వామి, కుబేర స్వామి ఆలయంలో శ్రావణమాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు  నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మడుపతి సంతోష్ స్వామి మాట్లాడుతూ.. స్వామివారికి ప్రత్యేక అభిషేకలు నిర్వహించి, మహా మంగళహారతీ ఇచ్చినట్లు తెలిపారు. స్వామివారి దర్శించుకున్న తర్వాత భక్తులకు అన్నదాన వితరణ చేశారు.

     

  • ఇండ్లలోకి నీళ్లు.. సమస్యను పట్టించుకోవడం లేదు

    మెదక్: నర్సాపూర్‌లో శనివారం కురిసిన వర్షానికి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు అతలాకుతలం అయ్యింది. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. వర్షం ఉద్ధృతికి వరద నీళ్లు ఇండ్లలోకి వచ్చాయని వాపోయారు. రోడ్లపై మొఖాలు వరకు నీళ్లు నిలిచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.  ఇప్పటికే పలుమార్లు  సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.

  • ‘ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా భారత్’

    మంచిర్యాల: బెల్లంపల్లిలో శనివారం బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాములు ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపిందని అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.