మంచిర్యాల: హాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. పండుగ సందర్భంగా మహిళా కానిస్టేబుళ్లు ప్రియాంక, అమ్రీన్బోగంలు ఎస్సై స్వరూప్ రాజ్, ఏఎస్సై చాంద్ పాషా, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ.. రాఖీ పండుగ తోబుట్టువుల ఆత్మీయ బంధానికి ప్రతీకని అన్నారు.
Author: Shivaganesh
-
ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
మహబూబాబాద్: గూడూరు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లికొండ మధు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టె వెంకన్న, జిల్లా కార్యదర్శి వాంకుడోత్ కొమ్మలు, తదితరులు పాల్గొన్నారు.
-
ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట..
ఖమ్మం: జిల్లాలోని బస్టాండ్లు శనివారం రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు, చిన్నారులు, యువతులు అత్తవారింటి నుంచి స్వగ్రామాలకు బయలుదేరారు. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం బస్టాండ్లలో బస్సులు, ఆటోలు ప్రయాణికులతో నిండిపోయాయి.
-
‘ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి’
ఆదిలాబాద్: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఘనంగా నిర్వహించారు. మండంలోని నిషాన్‌ఘాట్ గ్రామంలో CPI ML మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ జెండా ఎగరవేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ మాట్లాడుతూ.. ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 49ను పూర్తిగా రద్దు చేయాలన్నారు.
-
దమ్మపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు గిరిజన పోరాటయోధులు కొమరం భీమ్, సోయం గంగులు, మద్ది రామచందర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ పి.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
-
ఘనంగా ఆదివాసీ దినోత్సవ సంబరాలు
భద్రాద్రి కొత్తగూడెం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇల్లెందు మండలం రాగబోయిన గూడెంలో శనివారం ఆదివాసీ యూత్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా యూత్ సభ్యులు జెండాని ఆవిష్కరించి మాట్లాడారు. ఆదివాసీలను ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని, ఆగష్టు 9న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు.
-
విభిన్నంగా రాఖీ..
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి రాఖీ పండుగను విభిన్నంగా నిర్వహించారు. స్థానికంగా ఉండే దైద వెంకన్న అనే వ్యక్తి రాఖీ పండుగను పురస్కరించుకుని పాత కలెక్టర్ కార్యాలయ విధిలోని వృక్షాలకు రాఖీలు కట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు లేకుంటే మానవ మనుగడ లేదని, ఆక్సిజన్ దొరకదని.. నమూనా ఆక్సిజన్ సిలెండర్‌ను ధరించి మొక్కలు పెంచాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
-
కలకలం రేపుతున్న పులి సంచారం..?
మహబూబాబాద్: కొత్తగూడ మండల ఏజెన్సీలో పులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. రాంపూర్ శివారు అటవీ ప్రాంతంలో పులి ఆనవాళ్లను, పులి దాడిలో మృతి చెందిన ఆవు కళేబరాన్ని FRO వజ్రహత్ అలీ గుర్తించారు. అడవిలో మగపులి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే రేంజ్ పరిధిలో సంచరించిన మగ పులి.. ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
టీఎన్‌జీవోస్ ఉద్యోగుల నిరసన.. కారణం ఇదే
మెదక్: కలెక్టరేట్‌లో టీఎన్‌జీవోస్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సంఘం నాయకులు మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ అధికారులు విధులను చిత్తశుద్ధి, అంకితభావంతో చేస్తారని తెలిపారు. నిరసనలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
-
ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం..
మెదక్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఆగస్టు 2025 సెషన్‌కు సంబంధించిన ప్రవేశాలకు వాక్-ఇన్ అడ్మిషన్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జి. శ్రీనివాసులు తెలిపారు. ఆసక్తి గలవారు https://ititelangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. దరఖాస్తులకు పదో తరగతి ఉత్తీర్ణులై, 14 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్లు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.