Author: Shivaganesh

  • అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ…

    సిద్దిపేట: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట పట్టణంలో సంబరాల సందడి మొదలైంది. సిద్దిపేట పట్టణంలో ఎక్కడ చూసినా ఆడపడుచులతో రోడ్లన్నీ రద్దీగా నిండిపోయాయి. రాఖి దుకాణాలు, మిఠాయి దుకాణాలు, పండ్ల దుకాణాలతో పాటు బస్టాండ్‌ ప్రాంగణాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పలువురు నాయకులు సామాజిక మధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

  • ప్రసన్నాంజనేయుడికి ప్రత్యేక పూజలు

    మెదక్: నర్సాపూర్ బస్టాండ్ పరిధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణమాసం శనివారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. గణపతి పూజ, నవగ్రహ పూజ, స్వామివారికి సింధూర లేపనం, సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

  • రామాయంపేటలో వర్షం..

    మెదక్: రామాయంపేట మండల కేంద్రంలో భారీ వర్షం కురుస్తుంది. శనివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. నేడు రాఖీ పౌర్ణమి కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు , భారీవర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు.. వర్షం రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

     

  • కాల్వలో కొట్టుకొచ్చిన మృతదేహం..

    ఖమ్మం: నాగార్జునసాగర్ ఎడమ కాలువ గేట్ల దగ్గరకు మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన శనివారం కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో వెలుగుచూశాయి.  మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు మిర్యాలగూడలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడని, మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలుజారి కాల్వలోకి కొట్టుకుపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

  • ఘోరం.. తాడే యమపాశం అయ్యింది

    భద్రాద్రి కొత్తగూడెం: తల్లిదండ్రులు కొడుకును హత్య చేసిన ఘటన మణుగూరు చేపల మార్కెట్‌లో కలకలం రేపింది. మద్యం మత్తులో కుమారుడు మోహన కృష్ణ తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఈక్రమంలో ఆ తల్లిదండ్రులు కుమారుడి వేధింపులు భరించలేక మోహనకృషను తాడుతో కట్టేశారు. అది పొరపాటున మెడకు బిగుసుకోవడంతో  మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

     

  • ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్లు సీజ్

    మంచిర్యాల: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట సమీపంలోని ప్రాణహిత నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఎస్సై రాజేందర్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అట్టేల వెంకటేష్ , గగ్గురి జగన్, గొనే సత్యనారాయణ, మనిశెట్టి ప్రశాంత్‌లపై కేసునమోదు చేసినట్లు వివరించారు.

  • హాస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే..

    జయశంకర్ భూపాలపల్లి: శాయంపేట మండలంలోని కస్తూర్బా బాలికల హాస్టల్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన తరగతి గదులు, కిచెన్, డైనింగ్ రూమ్ లను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి అక్కడ వారికి అందుతున్న భోజనం, వసతి, విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • 12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్.. ఎక్కడంటే

    మెదక్: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన ఘటన కుచ్చన్‌పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ..  గ్రామ శివారులో జూదశిబిరం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో 12 మందిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.17,209 నగదు, 11 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

    మెదక్: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన హవేలీ ఘన్‌పూర్ మండలంలోని దూప్ సింగ్ తండాలో నిర్మాణంలో ఉన్న కాజ్‌వే పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని అన్నారు.

     

  • రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..

    మెదక్: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా ప్రజాలందరికీ ఎస్పీ శ్రీనివాసరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అక్కతమ్ములు, అన్నాచెల్లెల మధ్య అనుబంధాన్ని, రక్షణను, ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబానికి సంతోషం, ఐక్యత ఆనందం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.