మెదక్: హవేలీ ఘన్‌పూర్ ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా మ్యాపింగ్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల వారీగా, వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారు చేయాలన్నారు. ఒకే కుటుంబసభ్యులందరిని ఒకే వార్డులో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య
కుమ్రంభీం: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రెబ్బెన మండలం నంబాలలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రత్నం నారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు ఆయనను రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
-
తండ్రిని హత్య చేసిన కొడుకు.. ఎక్కడంటే
జనగామ: తండ్రిపై కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన పెద్దపహాడ్ గ్రామంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయిని సిద్ధులు (53) మద్యానికి బానిసై, కుటుంబ సభ్యులను హింసించేవాడు. ఈక్రమంలో ఆయన పెద్ద కుమారుడు బాలరాజు.. గురువారం రాత్రి తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలైన సిద్ధులు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
మధిరలో రోడ్డు ప్రమాదం..
ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలైన ఘటన శనివారం మధిర మండలం దెందుకూరు-నిదానపురం క్రాస్ రోడ్‌లో చోటుచేసుకుంది. మధిర నుంచి విజయవాడకు వెళ్తున్న కారు అదుపుతప్పి దెందుకూరు-నిదానపురం క్రాస్ రోడ్‌లోని ఎల్లమ్మతల్లి ఆలయం రోడ్డు పక్కన ఉన్న తుమ్మ చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
-
వేస్ట్ డీకంపోజర్ తయారీపై రైతులకు అవగాహన
మెదక్: రామాయంపేటలో పట్టణ శివారులోని ఒక రైతు పొలంలో వేస్ట్ డీకంపోజర్ తయారీపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇన్‌ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ పాల్గొని రైతులకు దాని ప్రయోజనాలను వివరించారు. వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చడం, ఖర్చులు తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి లాభాలు దీనివల్ల కలుగుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
-
రైతులకు విజ్ఞప్తి.. వెంటనే ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి
మెదక్: రైతులకు వ్యవసాయ సమాచారం అందించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఒక వాట్సాప్ ఛానెల్‌ను ఏర్పాటు చేశాయి. ఈసందర్భంగా రామాయంపేట డివిజన్ వ్యవసాయ అధికారి రాజు నారాయణ మాట్లాడుతూ.. ఈ ఛానల్ ద్వారా రైతులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని ఆయన కోరారు.
-
చికిత్స పొందుతూ ఒకరి మృతి
మహబూబాబాద్: చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన గూడూరు మండలం రాములు తండాలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నునావత్ రాధ భర్త నూనవత్ వీరు నాయక్ JDA అగ్రికల్చర్ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన గుండె సంబంధ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఆయన శుక్రవారం చికిత్స పొందుతూ మృతిచెందారు.
-
‘కృత్రిమ కొరత సృష్టించవద్దు’
మెదక్: హవేలీ ఘన్‌పూర్ మండలంలోని తెలంగాణ ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుత సీజన్‌కు సరిపడా ఎరువులు, విత్తనాలు ఉన్నాయని వెల్లడించారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ విత్తనాలపై చర్యలు తప్పవని అన్నారు.
-
దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం
ఆదిలాబాద్: అత్యంత దారుణమైన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగుచూసింది. గురువారం రాత్రి పట్టణంలోని శివాజీ చౌక్ సమీపంలోని ఒక సందులో ఓయువకుడు యాచిస్తూ రహదారి పక్కన నిద్రించే వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను శుక్రవారం రిమ్స్‌కు తరలించారు. హత్య చేస్తానని బెదిరించి అత్యాచారం చేశాడని పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
కేంద్రానికి వరంగల్ ఎంపీ ప్రశ్నలు..
వరంగల్: లోక్‌సభలో శుక్రవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలంగాణ తరుఫున తన గళాన్ని వినిపించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ మెడికల్ కళాశాలలకు కేంద్రం కేటాయించే నిధులపై ప్రశ్నలు సంధించారు. గ్రామీణ కాలేజీల్లో మెరుగైన సదుపాయాలు, సిబ్బంది కొరత నివారణకు మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె కేంద్రాన్ని కోరారు.