మెదక్: మనోహరాబాద్ మండలంలోని కల్లాకల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో శుక్రవారం నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. మానవులకు ప్రాణవాయువునిచ్చే మొక్కలను పెంచే బాధ్యత అందరిదని అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మొదటి విడతలో 2000, రెండో విడతలో 3000 మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ, అటవీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
పోలీసులకు ఫిర్యాదు.. దేని గురించంటే
మెదక్: బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన శుక్రవారం రామాయంపేటలో వెలుగుచూసింది. యూట్యూబ్ ఛానల్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ అనే లైసెన్సుడ్ సర్వేయర్ రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన నుంచి రూ.10 వేలు నగదు, బంగారు ఉంగరం తీసుకున్నారని బాధితుడు తెలిపారు. దర్యాప్తు జరిపి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
-
ఈనెల 12న జాబ్ మేళా..
హన్మకొండ: వరంగల్, హన్మకొండ జిల్లాల ఆర్యవైశ్య మహా సభ ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగ మేళాకు సుమారు 40 కంపెనీలు హాజరవుతాయని పేర్కొన్నారు. నగరంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్హత ప్రామాణికంగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు వివరించారు.
-
గుడ్ న్యూస్.. వెంటనే దరఖాస్తులు చేయండి
వరంగల్: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ప్రొఫెషనల్ పీజీ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ విద్యార్థులకు యూజీసీ ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌ను అందజేస్తుంది. సెంట్రల్, స్టేట్, డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెషనల్ పీజీ కోర్సులలో ప్రవేశాలు పొంది గేట్, జీప్యాట్ అర్హతతో మొదటి సెమిస్టర్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఆసక్తిగలవారు ఆన్‌లైన్లో యూజీసీ స్కాలర్షిప్స్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
-
‘ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలి’
ఆదిలాబాద్: కలెక్టరేట్‌లో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ రాజర్షిషా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేయించాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
-
బాధిత కుటుంబానికి కూనంనేని పరామర్శ
ఖమ్మం: కొణిజర్లలో శుక్రవారం గుండెపోటుతో మరణించిన రైతు కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
-
పేకాటరాయుళ్లు అరెస్ట్.. ఎక్కడంటే
మహబూబాబాద్: పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసిన ఘటన బ్రాహ్మణపల్లిలో వెలుగుచూసింది. గ్రామంలో కొంతమంది పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు గూడూరు పోలీసులు దాడి చేశారు. ఈసందర్భంగా ఎస్సై గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పస్తం రాంబాబు, అంజన్న, చిన్న లచ్చిరా, రమేష్‌లను అరెస్ట్ చేసి రూ. 2 వేలు నగదు, 2 ఫోన్లు, 2 బైక్‌లు సీజ్ చేసినట్లు తెలిపారు.
-
శివంపేటలో సఫారీ సలాం కార్యక్రమం
మెదక్: శివంపేటలోని రైతు వేదికలో శుక్రవారం 110 మంది సఫాయి కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సఫారీ సలాం కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
-
‘యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి’
ఖమ్మం: కూసుమంచి మండలంలోని పాలేరు వద్ద ఎడమ కాల్వకు నిర్మించిన యూటీ (అండర్ టన్నెల్)ను శుక్రవారం
జలవనరులశాఖ సీఈ రమేష్ బాబు పరిశీలించారు. ఈసందర్భంగా సీఈ మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు సరఫరా చేయాలని అన్నారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు, డీఈ రమేష్‌రెడ్డి, ఏఈ నరేష్ పాల్గొన్నారు.
-
తగ్గిన మిర్చి ధరలు
వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు తగ్గాయి. తేజ ఏసీ మిర్చి క్వింటాకు గురువారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు తగ్గాయి. నిన్న రూ. 13,800 ధర వస్తే, శుక్రవారం రూ.13,300కి పడిపోయింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి నిన్నటిలాగే ఈరోజు కూడా రూ.14 వేలు పలికింది. వండర్ హాట్ మిర్చికి గురువారం రూ.15,400 వస్తే, నేడు రూ.14,200 పతనమైంది.