Author: Shivaganesh

  • ఇందిరమ్మ ఇళ్లలో మోసం.. అధికారులు ఏం చేశారంటే

    ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు వెలుగుచూసిన ఘటన కూసుమంచి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఇల్లు ఉన్నప్పటికీ లబ్ధిదారుల జాబితాలో చేరిన ఏనుగుల సుహాసిని, ఆమె భర్త భాస్కర్‌ల పేరును అర్హుల జాబితా నుంచి తొలగించినట్లు ఎంపీడీవో ఎం.రామచంద్రరావు తెలిపారు. ఇంటికి సంబంధించి రూ.లక్ష బిల్లు డ్రాచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు అందేలా వ్యవహరిస్తామని వెల్లడించారు.

  • కేంద్రం పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

    మెదక్: రామాయంపేట మండలం అక్కన్నపేట్‌లో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పాల్గొని ప్రజలకు కేంద్రం ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నవీన్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • ‘100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి’

    మెదక్: శంకరంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీని పరిశీలించి మాట్లాడుతూ.. 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌కు సన్మానం

    మంచిర్యాల: బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్‌ను వారి ఛాంబర్‌లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. అనంతరం సబ్ కలెక్టర్ మనోజ్‌ మాట్లాడుతూ.. సంఘం సభ్యులందరూ మంచిగా పని చేస్తూ ప్రభుత్వం, ప్రజల దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు రామ్మోహన్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

  • గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి

    మహబూబాబాద్: కొత్తగూడ మండలం కొత్తపెళ్లి గ్రామంలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడి చేసి బెల్లం పానకాన్ని నిర్వీర్యం చేశారు. అనంతరం సరైన పత్రాలు లేని బైస్‌లను అదుపులోకి తీసుకున్నట్లు గూడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సూర్యప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు గిరిధర్‌రెడ్డి, రాజ్‌కుమార్, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

  • స్కూల్ బస్‌కు తప్పిన పెను ప్రమాదం..

    సిద్దిపేట: స్కూల్ బస్‌కు పెను ప్రమాదం తప్పిన ఘటన శుక్రవారం సిద్దిపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ములుగులో ఉదయం సుమారు 30 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న స్కూల్ బస్‌ను, ఓఆటో ఢీకొనింది. బస్ డ్రైవర్ చాకచక్యంతో పెనుప్రమాదం తప్పింది. ఆటో డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  • ప్రమాదంలో సింగూరు రిజర్వాయర్

    మెదక్: సింగూరు రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సాగునీటిని, హైదరాబాద్‌కు తాగునీటిని అందించే డ్యామ్ పిట్టా గోడలో పగుళ్లు ఏర్పడి, ఎగువన ఉన్న రివిట్మెంట్ దెబ్బతినడంతో ఏక్షణంలోనైనా కట్టతెగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వం డ్యామ్ మరమ్మతులకు రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పి, నిధులు విడుదల చేయలేదు. మరమ్మతులు జరగకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • ఉమ్మడి వరంగల్‌లో దంచికొట్టిన వర్షం..

    వరంగల్: ఉమ్మడి జిల్లాలో గురువారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వానతో అర్ధరాత్రి కాలనీల్లోకి వర్షం నీళ్లు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. హన్మకొండ నగరంలోని గోకుల్‌నగర్, టీజంక్షన్, అంబేద్కర్ భవన్ పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. అత్యధికంగా జనగామ జిల్లాలోని దేవరుప్పులలో 11 సెంటీమీటర్ల, వరంగల్ జిల్లాలోని గీసుగొండలో 10.9 సెంటీమీటర్లు, హన్మకొండ జిల్లాలోని మడికొండలో 10.4 సెంటీమీటర్లు నమోదైంది.

  • చోరీ కేసులో నిందితుడి అరెస్ట్..

    ఆదిలాబాద్‌: గతనెల 30న జరిగిన చోరీకేసులో నిందితుడిని గురువారం పోలీసులు ఎన్టీఆర్ చౌక్ వద్ద అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ నిందితుడి వివరాలు తెలిపారు. గతనెల 30న ఆర్ఆర్‌నగర్‌లో సోమగంగాధర్ బైక్, అదే రోజు రాత్రి మూడు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన సాయినాథ్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు సాయినాథ్‌ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని తెలిపారు.

  • తల్లిపాలపై అవగాహన కార్యక్రమం

    మెదక్‌: జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా బాలల వైద్యశాఖ, MCH, GMC సంయుక్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. కొత్తగా తల్లులైన వారికి, నర్సింగ్ సిబ్బందికి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. మాతృమూర్తులకు తల్లిపాలపై అవగాహన పెంచి, శిశువులకు మెరుగైన సంరక్షణ అందించడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.