మెదక్: చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేషన్ కార్డులు పేదవారి పదేళ్ల నిరీక్షణకు ఫలితమని పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీతో ప్రతి పేదవాడు కడుపునిండా తినాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
చిన్నశంకరంపేటలో రేషన్ కార్డుల పంపిణీ
-
నగర ప్రజలకు అలర్ట్.. నేడు నీళ్లు బంద్
వరంగల్: నగరంలో అమ్మవారిపేట క్రాస్‌రోడ్ ప్రధాన పైపులైన్ మరమ్మతులు కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం అండర్ రైల్వేగేటు జోన్ పరిధిలో తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఈఈ సంతోష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కరీమాబాద్, బీరన్నకుంట, ఉర్సు, శంభునిపేట, రంగశాయిపేట, శివనగర్, ఖిలావరంగల్ సర్వీస్ రిజర్వాయర్ పరిధిలో నీళ్లు బంద్ కానున్నాయి. పండుగపూట నీళ్లుబంద్ చేయడంపై మహిళలు అసహనం వ్యక్తం చేశారు.
-
ఆదిలాబాద్ నుంచి అమరావతికి ఆర్టీసీ..
ఆదిలాబాద్: ఆదిలాబాద్ నుంచి యావత్‌మాల్ మీదుగా అమరావతికి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు అమరావతి చేరుకుంటుంది. తిరిగి అమరావతి నుంచి మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరి సాయంత్రం 7:15 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
జ్వరంతో మహిళ మృతి..
ములుగు: జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన గురువారం వెంకటాపురం మండలం కమ్మరిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పర్శిక అరుణ(31) అనే మహిళ నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. ఈక్రమంలో ఆమె పలు ఆస్పత్రిలకు వెళ్లి చికిత్స తీసుకుంది. గురువారం జ్వరం ఎక్కువ కావటంతో ఆమెను వెంకటాపురం పరభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
-
జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జడ్జి..
భద్రాద్రి కొత్తగూడెం: స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రజాకవి చాగంటి కృష్ణమూర్తి 90వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కీర్తిచంద్రికరెడ్డి హాజరయ్యారు. 90 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణమూర్తి జడ్జి కీర్తిచంద్రికరెడ్డితో కలిసి 90 మొక్కలను నాటారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో కుటుంబసభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
-
హాస్టల్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
మెదక్: చేగుంట వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర హాస్టల్‌ను గురువారం రాత్రి అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన హాస్టల్ ప్రాంగణాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న బోధన, ఆహారం, నీరు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉన్నత చదువులు చదివిన జీవితంలో స్థిరపడాలని అన్నారు.
-
నేడు వరంగల్‌కు రానున్న మంత్రి పొంగులేటి
హన్మకొండ: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం వరంగల్ నగరానికి రానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన వరంగల్ చేరుకుంటారు. అనంతరం అంబేడ్కర్ నగర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభిస్తారు. కాళోజీ కళాక్షేత్రంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తారని అధికారులు తెలిపారు.
-
ఘనంగా తీజ్ వేడుకలు
సిద్దిపేట: అక్కన్నపేట మండలం బోదరువాగుతండాలో గురువారం రాత్రి తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల
ముగింపు వేడుకలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకుడు డి.టి.నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. గిరిజనులందరికి తీజ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గిరిజన నాయకులు, తదితరులు మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
-
బీజేపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్..
సిద్దిపేట: హుస్నాబాద్ రూరల్ బీజేపీ అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం పోతారంఎస్, వంగరామయ్యపల్లె, మీర్జాపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష ” అనే నినాదంతో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
పిడుగుపాటుతో ఇద్దరికి గాయాలు..
కుమ్రంభీం: పిడుగుపాటుకు గురై ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన గురువారం కౌటాల మండలం బోదంపెల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులబోయిన మల్లేష్, అభిషేక్‌లు గురువారం అదే గ్రామంలో ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్లారు. ఈక్రమంలో వారు పని చేస్తున్న సమీపంలో పిడుగుపడింది. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కాగజ్‌నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.