Author: Shivaganesh

  • కుంగిన వంతెన.. పొంచి ఉన్న ప్రమాదం

    ములుగు: మల్లంపల్లి మండలం సమీపంలోని 163 రహదారిపై ఉన్న వంతెనకు ప్రమాదం పొంచి ఉంది. బ్రిడ్జి కింద మట్టి కుంగడంతో ములుగు ఎస్సై వెంకటేశ్వరరావు వంతెన వద్దకు చేరుకొని భారీ గేట్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపి వేశారు. భారీ వాహనాలు పరకాల, రేగొండ మీదుగా మళ్లించగా, బైక్, తదితర చిన్న వాహనాలను పందికుంట, రామచంద్రాపూర్, శ్రీనగర్ వైపు మళ్లించారు.

  • ఘోరం.. చేప వేట ప్రాణం తీసింది

    భద్రాద్రి కొత్తగూడెం: చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన గురువారం అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కేశప్పగూడెంకు చెందిన సోడెం మహేష్(29) తన సోదరుడు ముత్యాలరావు, మరికొందరు గ్రామస్థుతో కలిసి ఊట్లపల్లి సమీపంలోని వెంకమ్మ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈక్రమంలో మహేష్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్..

    భద్రాద్రికొత్తగూడెం: ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గురువారం దమ్మపేటలో చోటుచేసుకుంది. దమ్మపేట మండలం గండుగులపల్లి బైపాస్ రోడ్డు శివారులో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడిచేశారు. దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ.2,800 నగదు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.

  • యథేచ్ఛగా అక్రమ మద్యం దందా..

    భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలంలో బెల్ట్ షాపుల దందా యథేచ్ఛగా జరుగుతోందని స్థానికులు వాపోయారు. గురువారం పలువురు స్థానికులు మాట్లాడుతూ.. మండలంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో యువత మద్యం వ్యసనాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మద్యం దందాపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

    ములుగు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయలైన ఘటన గురువారం జాకారం-ములుగు రహదారిపై చోటుచేసుకుంది. అబ్బాపూర్ గ్రామానికి చెందిన రుద్రబోయిన హనుమంతు జాకారం-ములుగు రహదారిపై రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాద స్థలంలో ఉన్న డాక్టర్ ప్రవీణ్ అంబులెన్స్ పిలిపించి, ప్రథమ చికిత్స చేసి, ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ సకాలంలో స్పందించి వైద్యం అందించడంతో క్షతగాత్రుడికి ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు.

     

  • లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ

    ఖమ్మం: ఖమ్మం 9వ డివిజన్ లబ్ధిదారులకు గురువారం స్థానిక కార్పొరేటర్ జానీబీ నాగుల్ మీరా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • సీఎంను కలవడానికి పాదయాత్రగా కదిలిన రైతులు

    కుమ్రంభీం: చింతలమానేపల్లి మండలం దీందా గ్రామస్థులు పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం గురువారం వారి గ్రామం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభించారు. తమ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్థులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్రోని శ్రీశైలం సంఘీభావం తెలిపారు. యాత్రలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • మహిళలపై దాడులను సహించం: మాజీ ఎమ్మెల్యే రాజయ్య

    జనగామ: వేలేరు మాజీ ఎంపీటీసీ బత్తుల జ్యోతిపై ఇటీవల జరిగిన దాడి ఘటనను స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య తీవ్రంగా ఖండించారు. గురువారం నిందితులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ హన్మకొండ డిప్యూటీ కమిషనర్ సలీమాను బాధితురాలితో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలపై ఇలాంటి దాడులు సహించబోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

  • గుంపులు గుంపులుగా కుక్కలు.. భయంభయంగా జనాలు

    జనగామ: పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వీధి కుక్కలు స్వెర విహారం చేస్తున్నాయని స్థానికులు వాపోయారు. గురువారం పలువురు స్థానికులు మాట్లాడుతూ.. గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, స్కూలు విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు వాటి నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

  • ఎంజీఎం వైద్యుడిపై విచారణ కమిటీ

    వరంగల్: ఎంజీఎం ఆసుపత్రి మానసిక విభాగంలో పనిచేస్తున్న వైద్యుడిపై కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విచారణ కమిటీని నియమించారు. ఎంజీఎం ఆస్పత్రి మానసిక విభాగంలో పనిచేస్తున్న ఈ సైకియాట్రీ వైద్యుడు పీజీలతో అనుచితంగా  మాట్లాడుతూ, అర్ధరాత్రి వేళలో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నట్లు సమాచారం. వైద్యుడితో తీరుపై పీజీలు ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రిన్సిపాల్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.