సిద్దిపేట: ఇల్లు రాలేదని ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేసిన ఘటన పాలమాకులలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వర్దోలు శ్రీకాంత్ ఇందిరమ్మ ఇల్లు రాలేదని పెట్రోలు తాగి, ఒంటిపై పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేశాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మార్వో సరిత అక్కడికి చేరుకొని ఇంటి ప్రొసీడింగ్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Author: Shivaganesh
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం..
మంచిర్యాల: నీల్వాయి 33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మామడ, కల్మలపేట, కేతనపల్లి, ముల్కలపేట, రాచర్ల, గొర్లపల్లి, కొత్తపల్లి, దస్నాపూర్, మంగనపల్లి, వేమనపల్లితో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో విద్యుత్తు సరఫరా ఉండన్నారు. ప్రజలు గమనించి సిబ్బందికి సహకరించాలన్నారు.
-
విద్యుత్తు వినియోగదారులకు అలర్ట్..!
మంచిర్యాల : చెన్నూరు మండలం కిష్టంపేట్ నుంచి కోటపల్లికి వెళ్లే విద్యుత్తు లైన్ మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కోటపల్లి విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలని సూచించారు.
-
పవర్ కట్..
మంచిర్యాల: కుందారం ఉపకేంద్రంలో వీసీబీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో గురువారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్తు ఏఈ మనోహర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుందారం, శేట్పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, మద్దులపల్లి, కిష్టాపూర్, రొమ్మిపూర్ గ్రామాలకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.
-
ఎట్టకేలకు చిక్కిన నిందితుడు..
ఖమ్మం: గంజాయి కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఖమ్మం మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మోహన్ బాబు తెలిపారు. ఈనెల 3న రంగనాయకులగుట్ట వద్ద తనిఖీల సందర్భంగా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న బుర్రి మల్లిఖార్జున్‌రావు గంజాయి అమ్ముతుండగా గుర్తించారు. నిందితుడు పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. కొనుగోలు చేసేందుకు వచ్చిన వచ్చిన ఇద్దరిని, కిలో గంజాయి సీజ్ చేశారు.
-
దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మం: ఈనెల 31 వరకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు కస్తాల సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ఎస్సీ పట్టభద్రుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అర్హులకు రూ.20 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆన్లైన్ https://telanganaepass.cgg.gov.in దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
-
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
వరంగల్: రైలు కిందపడి ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కాజీపేట దర్గా పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన బర్లమధు(27) మంగళవారం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. అదేరోజు రాత్రివేళ ఇంట్లో నుంచి బయటికి వెళ్లి కాజీపేట దర్గా రైల్వేగేట్ సమీపంలో బుధవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
సైబర్ టోకరా.. రూ.2.50 లక్షలు స్వాహా
ఆదిలాబాద్: వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను నమ్మి ఓయువకుడు రూ.2.50 లక్షలు నష్టపోయిన ఘటన బుధవారం పట్టణంలోని మోచీగల్లిలో వెలుగుచూసింది. మోచీగల్లికి చెందిన వ్యక్తికి వాట్సాప్‌లో పెట్టుబడికి రెండింతలు లాభం వస్తుందని సైబర్‌నేరగాళ్లు నమ్మించారు. బాధితుడు మొత్తం రూ.2.50 లక్షలు పెట్టుబడి పెట్టినతర్వాత వాళ్లు ఆ ఏపీకే ఫైల్‌ను మూసేయడంతో మోసపోయినట్లు గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసు తెలిపారు.
-
అంబులెన్స్‌లో పురుడు.. తల్లీబిడ్డా క్షేమం..
సంగారెడ్డి: అంబులెన్స్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఘటన బుధవారం సదాశివపేట మండలంలో చోటుచేసుకుంది. ఇష్రత్తాబాద్‌కు చెందిన రేష్మబేగంకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పైలట్ ఈటెల రాజేందర్, ఈఎంటీ కిరణ్‌కుమార్ వెంటనే స్పందించి ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
-
ఐక్యాంప్ నిర్వహించి.. మొక్కలు నాటారు
మెదక్: లయన్స్ క్లబ్ రామాయంపేట స్నేహబందు ఆధ్వర్యంలో మెదక్ రోడ్డులోని ఉత్తమబీడి కంపనీ ప్రాంగణంలో కార్మికుల కోసం ఐక్యాంప్ నిర్వహించారు. ఈసందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. మొత్తం 75 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, మందులు అందజేసినట్లు తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో కంపనీ యజమాని Ln పిట్ట శ్రీనివాస్, క్లబ్ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.