మంచిర్యాల: చెన్నూరు మండలం శివలింగాపూర్‌కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ కాటేల కృష్ణస్వామి 2019లో పదోతరగతి విద్యార్థినిని బెదిరించి, బలవంతంగా స్కూటీపై తీసుకెళ్లాడు. ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేశారు. నేరంరుజువు కావడంతో పోక్సోకేసులో నేరస్థుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.1500 జరిమానాతో పాటు బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి ఎల్. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు.