ఆదిలాబాద్: ఆదిలాబాద్ అర్బన్ మండల NHRC ఛైర్మన్‌గా నవీన్ రెడ్డిని నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ యాసిన్, రాష్ట్ర NHRC ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఆయనకు జిల్లా ఛైర్మన్ పురుషోత్తం రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈసందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతానన్నారు.
Author: Shivaganesh
-
ఘోరం.. గుండెపోటుతో ఎమ్మార్వో మృతి
మంచిర్యాల: నెన్నెల మండల తహసీల్దార్ జ్యోతి ప్రియదర్శిని బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం నస్పూర్ నివాసంలో గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. జ్యోతి ప్రియదర్శిని గతంలో బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో కార్యనిర్వాహక అధికారి (ఏవో)గా సేవలందించారు. ఇటీవల పదోన్నతితో నేన్నెల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు.
-
ఆచార్య జయశంకర్ సర్ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందులో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగల్ రాజేందర్ పాల్గొని జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సర్ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
-
పరస్పర అవగాహన ఒప్పందం
వరంగల్: థాయిలాండ్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నిట్ మధ్య గ్లోబల్ అకాడమిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. వర్చ్యువల్ మీటింగ్లో నిట్ డైరెక్టర్ ప్రో.బిద్యాధర్ సుబుధి MOUపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వంద్వ మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాం, ఉమ్మడి పరిశోధన, విద్యార్థులు, బోధన సిబ్బంది మార్పిడి అంశాలకు దోహదపడుతుందని సుబుధి తెలిపారు.
-
గుబులు రేపుతున్న వరుస చోరీలు
మహబూబాబాద్: జిల్లాలో వరుస చోరీలు ప్రజల్లో గుబులు రేపుతున్నాయి. డోర్నకల్ మండలం చిలుకోడు, బయ్యారం మండలం గంధంపల్లిలో, మహబూబాబాద్ రైల్వే ఉద్యోగి ఇంట్లో దొంగతనాలు జరిగాయి. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. వరుస దొంగతనాలకు పోలీసులు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. పోలీసులు మాట్లాడుతూ.. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
-
ఎనుమాముల మార్కెట్లో నేటి పత్తి ధరలు
వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులతో పోలిస్తే బుధవారం పత్తి ధర పెరిగింది. సోమ, మంగళవారాల్లో రూ.7,690 పలికిన క్వింటా పత్తి ధర నేడు రూ.30 పెరిగి, రూ.7,720 అయిందని వ్యాపారులు చెప్పారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. తేమ లేని, నాణ్యమైన పత్తిని రైతులు మార్కెట్‌కు తీసుకొని రావాలని సూచించారు.
-
‘కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు’
మహబూబాబాద్: యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మరిపెడ డివిజన్ ADA విజయచంద్ర హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వానాకాలంలో 9 మండలాలకు 18 వేల మెట్రిక్ టన్నుల యూరియా సాగుకు అంచనా వేశాం. 14,500 మెట్రిక్ టన్నుల రైతులకు సరఫరా చేశాం. ఇంకా 3,500 టన్నులు అవసరమని పేర్కొన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు సమాచారం వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని అన్నారు.
-
గిరిజన కుటుంబాలకు గుడ్ న్యూస్..
వరంగల్: కేంద్ర ప్రభుత్వం ప్రతి గిరిజన కుటుంబానికి ఉచితంగా కరెంటు మీటరు బిగించడానికి గాను ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ (PM JUGA) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా జిల్లాలో ఉచితంగా మీటర్ బిగించడంతో పాటు ఇంటి వరకు ఉచితంగా విద్యుత్ లైన్ పూర్తిగా ఏర్పాటు చేయడానికి కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. 200 యూనిట్ల వరకు సబ్సిడీ లభిస్తుంది.
-
‘మహనీయుడు జయశంకర్ సార్’
హన్మకొండ: ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జయశంకర్
సార్ అని అన్నారు. ఆయనను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
హన్మకొండ: ఓ యువకుడి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అర్థరాత్రి కాజీపేటలో వెలుగుచూసింది. కాజీపేట మండలం దర్గా ఫోర్ లైన్స్ రైల్వే గేట్ సమీపంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. మృతుడు పసుపు కలర్ టీ షర్టు, జిన్స్ పాయింట్ ధరించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.