మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్‌లో దివ్యాంగ విద్యార్థుల కోసం బుధవారం ఫిజియోథెరపీ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ.. క్యాంప్‌ను 18 ఏళ్లలోపు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫిజియోథెరపీ అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, ప్రధానోపాధ్యాయులు మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
జాతీయ అవార్డుకు ఆదివాసీ ఫోటో..
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ ఫొటో గ్రాఫర్ ఎస్కే షరీఫు జాతీయస్థాయి అవార్డు సాధించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐఐపీసీ, పీఏఐ సహకారంతో ఏపీ ప్రభుత్వం నేషనల్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈఎగ్జిబిషన్‌లో షరీఫ్ చిత్రం ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డు-2025కు ఎంపికైంది. ఈనెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో అవార్డును అందుకోనున్నట్లు షరీఫ్ తెలిపారు.
-
ఎస్సీ విద్యార్థులకు గుడ్ న్యూస్..
ఖమ్మం: హైదరాబాద్ బేగంపేట, రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఖమ్మం జిల్లాకు రెండు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 8వ తేదీ లోపు తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
-
రేపు జాబ్ మేళా
భద్రాద్రికొత్తగూడెం: ఈనెల 7వ తేదీన చుంచుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిరుద్యోగులకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపా ది కల్పనా శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 -32 ఏళ్ల వయసు గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వివిధ పోస్టుల్లో పని చేయాల్సి ఉంటుందని వివరించారు.
-
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం: గ్రూప్స్, ఆర్ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. వారికి నాలుగు నెలల పాటు రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్ తెలిపారు. ఆసక్తి గల ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ అభ్యర్థులు ఈనెల 21లోగా దరఖాస్తులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
-
ఈనెల 11న ఐటీఐ స్పాట్ అడ్మిషన్‌లు
జనగామ: ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పోచయ్య ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు 10వ తేదీ చివరితేదీగా పేర్కొన్నారు. కాలేజీలో ఈనెల 11న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం 9010222168, 9492297524 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
-
ఎస్ఆర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్ (ఎస్ఆర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జీఎంసీ జనగామ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫార్మెట్‌ను డౌన్లోడ్ చేసుకుని అర్హత సర్టిఫికెట్లతో ఈనెల 12న ప్రిన్సిపాల్ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. అనంతరం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు.
-
కుక్‌పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేట: మిరుదొడ్డిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో రెండు సహాయ వంట మనుషుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎంఈఓ ప్రవీణ్‌బాబు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 6, 7 తేదీలల్లో సంబంధిత కేజీబీవీలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు. 7వ తరగతి కనీస విద్యార్హత కలిగిన మహిళలు దరఖాస్తులకు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
-
ఐటీఐలో వాక్ఇన్ అడ్మిషన్లు
ఆదిలాబాద్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం వాక్ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 6 నుంచి 28 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు దరఖాస్తు చేసిన కాపీలతో హాజరుకావా లని తెలిపారు. పూర్తి వివరాలకు 9493535378 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
-
అధికారికంగా నేడు జయశంకర్ జయంతి
ఆదిలాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి వేడుకలను బుధవారం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణులు, బీసీ సంఘాల నాయకులు, కులస్తులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.