Author: Shivaganesh

  • శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

    హన్మకొండ: భారతీయ స్టేట్ బ్యాంక్-గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల యువకులకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ బాసరవి తెలిపారు. ఈనెల 15వ తేదీ లోపు హసన్‌పర్తిలోని సంస్కృతి విహార్‌లో లేదా 9704056522, 9849307873 నంబర్లకు వివరాలు పంపించాలన్నారు. ఏసీ, రిఫ్రిజిరేటర్, సెల్‌ఫోన్ రిపేర్, సీసీటీవీ మరమ్మతులు, హౌస్ వైరింగ్‌లో శిక్షణ ఉంటుందన్నారు.

  • ఈనెల 13 వరకు ఫీజు గడువు.. దేనికంటే!

    ఖమ్మం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ దూరవిద్యను అభ్యసించేందుకు ఈనెల 13 వరకు ఫీజు గడువు ఉందని మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అధ్యయనకేంద్రం బాధ్యులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  దరఖాస్తుతోపాటు పేమెంట్ రిసిప్ట్, ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

     

  • రహదారిపై భారీ కొండచిలువ ప్రత్యక్షం..

    మెదక్: రామాయంపేటలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్స్‌లో మంగళవారం రాత్రి స్థానిక రహదారిపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఈక్రమంలో కొందరు వ్యక్తులు కొండచిలువను చూసి సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. ఈసందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ.. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో అలాంటి కొండచిలు కనిపించాయని, ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షం అయ్యాయని భయాందోళనకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కొండచిలువను బంధించాలని కోరుతున్నారు.

     

  • ‘మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి’

    మెదక్: జిల్లాలో మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పశువైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మెదక్, శంకరంపేట పశువైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన ఆస్పత్రిలోని మందుల నిల్వలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, రికార్డులను పరిశీలించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

     

  • మంచి మనసు చాటుకున్న బెటాలియన్ పోలీసులు

    ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని షిర్డీసాయి వృద్ధాశ్రమానికి బుధవారం 2వ స్పెషల్ బెటాలియన్ తెలంగాణ యాపల్‌గూడ కమాండెంట్ నీతికపంత్ ఆధ్వర్యంలో సిబ్బంది నెలకు సరిపడా సామగ్రిని అందజేశారు. పలువురు అధికారులు మాట్లాడుతూ..  జన్మనిచ్చిన అమ్మానాన్నలను చివరిదశలో అనాథలుగా వదిలి వేయడం అనేది మానవత్వానికి మాయని మచ్చని అన్నారు. తమ వంతు బాధ్యతగా వారిని సాయం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

    మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం గూడూరు మండలం భూపతిపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. భూపతిపేట గ్రామ శివారులో ప్రమాదవశాత్తు లారీ- కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నర్సంపేటకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • రోడ్డు ప్రమాదంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు మృతి

    భద్రాద్రి కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకుడు మృతి చెందిన ఘటన బుధవారం సూర్యాపేట ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. మణుగూరుకు చెందిన అయోధ్య బుధవారం సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ స్లో కావడంతో వెనకవస్తున్న వారికారు ఢీకొనింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

  • ‘పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం’

    మెదక్: జిల్లాలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నాలుగు రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టర్ మెదక్ మున్సిపాలిటీని పరిశీలించారు. పాతటైర్లు, నీరునిల్వ ఉన్న ప్రదేశాలను దగ్గరుండి శుభ్రం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దోమలవల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలను నివారించాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

  • ‘విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీ పడవద్దు’

    మెదక్: కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం విద్యాశాఖ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులపై వ్యక్తిగత పర్యవేక్షణ పెట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీపడవద్దని స్పష్టం చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులపై నివేదికలు సమర్పించాలన్నారు.

  • మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

    ఖమ్మం: తెలంగాణ గురుకుల విద్యాలయం (బాలికలు) వైరాలో ఖాళీగా ఉన్న బయోసైన్స్ ఉపాధ్యాయ (గెస్ట్) పోస్టుకు మహిళా అభ్యర్థుల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  పాఠశాలల జిల్లా సమన్వయకర్త టి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 9న ఏన్కూరు గురుకులంలో డెమో తరగతుల ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. ఆసక్తిగల వారు ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.