Author: Shivaganesh

  • చింతనెక్కొండలో చైన్ స్నాచింగ్ కలకలం 

    వరంగల్: చింతనెక్కొండలో చైన్ స్నాచింగ్ కలకలం రేపిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వృద్ధురాలు బండిమల్లమ్మ మంగళవారం ఇంటి వద్ద కూర్చుంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికి వచ్చి మాటలుకలిపి ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారుగొలుసు లాక్కొని పారిపోయాడు. ఘటనపై వృద్ధురాలి మనుమడు బండి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

     

  • మద్యంమత్తులో యువరైతు ఆత్మహత్య

    ఆదిలాబాద్: ఉరేసుకొని యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మావల మండలంలోని వాఘాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతల నరేష్ పంట పెట్టుబడికి చేసిన అప్పులు తీరుతాయో లేదోనన్న బెంగతో మద్యానికి బానిసగా మారాడు. ఈక్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యంమత్తులో ఉరేసుకున్నాడు. అనంతరం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • దరఖాస్తుల ఆహ్వానం.. ఎక్కడంటే

    ఆదిలాబాద్: అసిస్టెంట్ కుక్ కోసం మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో సోమయ్య తెలిపారు. ఆదిలాబాద్ అర్బన్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో అసిస్టెంట్ కుక్ కోసం ఈనెల 7వ తేదీలోగా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. దరఖాస్తుదారులు ఏడో తరగతి పాసై 18-45 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. స్థానికులై ఉండాలని, మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థినులను ఎంపిక ఉంటుందన్నారు.

  • మహాధర్నా స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు

    మెదక్: కలెక్టరేట్ ముందు ఈనెల 7న నిర్వహించనున్న మహాధర్నా స్థలాన్ని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్‌రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ హేమలత పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాధర్నాకు మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. సుమారు 3000 మందికి పైగా రైతులు ధర్నాలో పాల్గొంటారన్నారు.

  • ‘అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి’

    మెదక్: రామాయంపేట మండలంలోని తహసీల్దార్ రజని కుమారికి, సీడీపీఓ స్వరూప రాథోడ్‌లకు మంగళవారం అంగన్‌వాడీ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. అనంతరం పలువురు అంగన్‌వాడీ సిబ్బంది మాట్లాడుతూ.. ఫ్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యను ఐసిడిఎఫ్ అంగన్వాడి కేంద్రంలోని నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

    వరంగల్: గవిచర్లరోడ్, ఉర్సు విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో బుధవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ ఎస్.మల్లికార్జున్ ఒక ప్రకటనలో తెలిపారు. యాదవవాడ, శివాలయం, ద్వారకా అపార్ట్మెంట్, ఆర్టీఓ కార్యాలయం, నాయుడు పెట్రోల్ పంపు, చెట్లోళ్లగడ్డ, కామునిపెంట, ఉర్సు బొడ్రాయి, కాముని పెంట, జన్మభూమి కూడలి ఏరియాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్తు వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.

     

  • ఈనెల 7నుంచి సదరం శిబిరాలు

    ఖమ్మం: ఈనెల 7, 12, 14, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు సర్వ జనాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మెతుకు నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగ ధ్రువపత్రాల కోసం ఆయా తేదీల్లో శిబిరాలకు హాజరయ్యే వారు స్లాట్ బుకింగ్ రసీదు, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, మెడికల్ రిపోర్ట్‌లతో ఖమ్మం సర్వజనాసుపత్రికి రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

     

  • ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు..

    ఆదిలాబాద్: ఓ ఉపాధ్యాయుడిపై తాంసి పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. తాంసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జితేష్ కొన్ని రోజులుగా కొంత మంది విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయమై బాధితులు మంగళవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై జీవన్‌రెడ్డి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసునమోదు చేసి, ఉపాధ్యాయుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

     

  • కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి

    సిద్దిపేట: కరెంట్ షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్ మదిర గ్రామం పోసానిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆబ్రమైన పున్నమ్మ (51)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్లో ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున లేచి బల్బ్ స్వీచ్ వేస్తున్న క్రమంలో కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.

  • 2500 ఏళ్ల నాటి కంకణ శిల.. ఎక్కడ లభ్యమైందంటే

    సిద్దిపేట: 2500 ఏళ్ల నాటి కొత్త రాతి యుగం పరికరాలు నంగునూరు మండలం నర్మెటలోని పాటిగడ్డలో లభ్యమైనట్లు ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. పాటిగడ్డ వద్ద పరిశోధిస్తున్న సమయంలో 7 సెం.మీ. ఎత్తు, 5 సెం.మీ. వెడల్పు, 4 సెం.మీ. మందంతో గుండ్రంగా ఉండి మధ్యలో రంధ్రం కలిగిన పరికరం లభించిందని చెప్పారు. దీనిని కంకణ శిల అంటారని, రంద్రం మధ్యలో కర్ర అమర్చి అప్పటి మనుషులు వాడుకునేవారని తెలిపారు.