Author: Shivaganesh

  • దరఖాస్తుల ఆహ్వానం.. ఎందుకంటే

    వరంగల్: హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించనున్న క్రీడా పాఠశాలకు అవసరమైన పరికరాల కోసం సీల్డ్ కొటేషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి అశోకుమార్ తెలిపారు. ఈనెల 8 లోపు సీల్డ్ కొటేషన్లను జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో అందించాలన్నారు. వసతి గృహం, ఇండోర్ స్టేడియంలో క్రీడాపరికరాలు, ఫర్నిచర్స్, పరుపులు, ఇతర సామగ్రి సరఫరాకు కొటేషన్లు కోరుతున్నామన్నారు.

  • ‘తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి’

    కుమ్రంభీం: కాగజ్‌నగర్ ఓల్డ్ కాలనీలోని అంగన్‌వాడీ సెంటర్‌లో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్ మంజుల ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ రెబెక, సూపర్వైజర్ రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిపాలు బిడ్డకు దేవుడిచ్చిన అమృతం లాంటివని అన్నారు. బిడ్డకు పాలు పట్టడం ప్రతి తల్లి బాధ్యత అని తెలిపారు.

  • విద్యార్థులకు ఉచితంగా డైరీలు పంపిణీ 

    జనగామ: పాలకుర్తి ZPHS స్కూల్‌లో మంగళవారం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు Ln.చారగొండ్ల ప్రసాద్ సౌజన్యంతో 300 మంది విద్యార్థులకు ఉచిత డైరీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ డా.చంద్రశేఖర్ ఆర్య పాల్గొని మాట్లాడుతూ.. విజయానికి ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలు కీలకమని, ఉపాధ్యాయులు సృజనాత్మకతను ప్రోత్సహించాలన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • సీఐ కుమారస్వామిని సన్మానించిన అధికారులు

    మంచిర్యాల: తాండూరు సీఐ కుమారస్వామి కాగజ్‌నగర్‌కు బదిలీ అయ్యారు. ఈసందర్భంగా ఆయనకు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు తాండూరు సీఐగా కుమారస్వామి అందించి సేవలను కొనియాడారు. నూతనంగా తాండూర్ సీఐగా బదిలీపై వచ్చిన దేవయ్యను సన్మానించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • ఏకగ్రీవంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నిక

    మహబాబూబాద్: బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఆదివాసీల సమావేశం నిర్వహించారు. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించడం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్‌గా వర్స ప్రకాష్, వైస్ ఛైర్మన్‌గా అలేం కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్స ప్రకాష్ మాట్లాడుతూ.. బయ్యారం మండలంలోని ఆదివాసీలందరూ ఏకమై జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • ‘కాంగ్రెస్ హామీలతో ప్రజలు మోసపోయారు’

    జనగామ: కొడకండ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంగళవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోగస్ 420 హామీల వల్ల ప్రజలు మోసపోయారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • ఇసుక ట్రాక్టర్లు సీజ్.. కేసు నమోదు

    జనగామ: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు  ఎస్సై సృజన్ కుమార్ తెలిపారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని దాదా సాహెబ్ కాలనీ పరిధిలోని వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఎస్కే కరీం, ఎస్కే సాల ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  • ఉచిత కంటి వైద్య శిబిరం

    కుమ్రంభీం: కాగజ్ నగర్ ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రజాలైఫ్ కేర్ ఆస్పత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ఉచిత కంటి వైద్యశిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు. 16 మందికి ఆపరేషన్ అవసరం కాగా వారికి విడతల వారిగా ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ప్రతిమంగళవారం కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.

     

  • పురుగుల మందుతాగి యువకుడి ఆత్మహత్య

    నిర్మల్: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కుభీర్ మండలం రంజని గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన జాదవ్ సచిన్ (24) అనే గిరిజన యువకుడు గత కొంతకాలంగా నిత్యం మద్యం తాగుతూ ఇంట్లో వారితో గొడవ పడుతున్నాడు. ఈక్రమంలో ఆయన పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

     

  • బ్యాటరీ దొంగలకు దేహశుద్ధి

    ములుగు: లారీల బ్యాటరీలను దొంగలించి పారిపోతున్న వారిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన మంగళవారం మల్లంపల్లి మండల కేంద్రంలో వెలుగుచూసింది. మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద ఆగి ఉన్న లారీల బ్యాటరీలను దొంగలించి పారిపోతున్న వారిని స్థానికులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.