హన్మకొండ: హన్మకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కాలేజీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి సినారె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సినారె దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఎన్నో అవార్డులు, సత్కారాలు, పొందడం తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
డిగ్రీ విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకం
హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగం పాఠ్యప్రణాళిక అధ్యక్షురాలు పి.నిర్మల ఆధ్వర్యంలో మంగళవారం బోర్డు ఆఫ్ స్టడీస్(బీవోఎస్) సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేయూ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి 20 క్రెడిట్లతో ‘ఇంగ్లీష్ ఫర్ బ్రిలియన్స్’ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
-
నాటకాన్ని ప్రదర్శించిన విద్యార్థులు
హన్మకొండ: హన్మకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల విద్యార్థులు కుమార్‌పల్లి వీధిలో ర్యాలీ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘పొగాకు వాడొద్దు- తొందరగా సావద్దు’ అనే వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా నాటకాన్ని రచించి, దర్శకత్వం వహించిన తెలుగు ఉపాధ్యాయుడు వలస పైడి మాట్లాడుతూ.. పొగాకు తినడం, ధూమపానంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
‘వారికి సరైన శిక్ష విధించాలి’
హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీలో పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పాల్గొని మాట్లాడుతూ.. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తుందని అన్నారు. ఘటనపై న్యాయవిచారణ చేపట్టి నేరస్తులకు సరైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
-
బచ్చన్నపేటలో నాగుల పంచమి వేడుకలు
జనగామ: బచ్చన్నపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం నాగుల పంచమి వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుటుంబ సమేతంగా పాములపుట్టల దగ్గరకి వెళ్లి పసుపు, కుంకుమ చల్లి కొబ్బరికాయలు కొట్టి నాగదేవతకు పూజలు చేశారు. అనంతరం పలువురు భక్తులు మాట్లాడుతూ.. పాడిపంటలు సమృద్ధిగా పండేలా, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా దీవించమని వేడుకున్నట్లు తెలిపారు.
-
టీపీసీసీ ఛీప్‌ను కలిసిన రాకేశ్
మంచిర్యాల: హైదరాబాద్‌లో మంగళవారం టీపీసీసీ ఛీప్ మహేష్ కుమార్ గౌడ్‌ను చెన్నూర్ నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బొడ్డు రాకేశ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన మహేష్ కుమార్ గౌడ్‌తో నియోజకవర్గంలోని పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని సూచించనట్లు తెలిపారు.
-
ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు..
మంచిర్యాల: కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో మంగళవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఫారెస్ట్ అధికారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్ధులకు బెల్లంపల్లి రేంజర్ సీహెచ్ పూర్ణచందర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
-
ప్రిన్సిపాల్‌ను కలిసిన డీఎంహెచ్ఓ
ములుగు: ములుగు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ స్వర్ణకుమారిని మంగళవారం డీఎంహెచ్ఓ గోపాల్‌రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలవాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు సమన్వయంతో అందించేలా ప్రణాళికలపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కీటక జనిత నియంత్రణ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.
-
10 లీటర్ల గుడుంబా పట్టివేత
మంచిర్యాల: గుడుంబాను పోలీసులు పట్టుకున్న ఘటన మంగళవారం భీమారం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. భీమారం ఎస్సై k.శ్వేత మాట్లాడుతూ.. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ఆటోలో రవాణా చేస్తున్న ప్రభుత్వ నిషేధిత 10 లీటర్ల గుడుంబాను పట్టుకున్నట్లు తెలిపారు. గుడుంబా తయారు చేసిన, దాన్ని రవాణా చేసిన చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
-
పోలీసు స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
మహబూబాబాద్: సిరోలు, మరిపెడ పోలీస్ స్టేషన్లను మంగళవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన నామినల్ రోల్, ప్రాపర్టీ రూమ్, స్టేషన్ పరిసరాలను పరిశీలించి, శుభ్రత, భద్రతాపరమైన సూచనలు చేశారు. ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో మొక్కను నాటారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.