Author: Shivaganesh

  • ‘ప్రభుత్వం ప్రజలను నిండా ముంచింది’

    మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలో మంగళవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిండా ముంచిందని విమర్శించారు. రైతులను మోసం చేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘కాజీపేటను అన్నివిధాల అభివృద్ది చేయాలి’

    హన్మకొండ: కాజీపేట సీపీఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం తొట్టె మల్లేశం యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా  చుక్కయ హాజరై మాట్లాడుతూ… కాజీపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వంపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని మండల కమిటీకి పిలుపునిచ్చారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని, రైల్వేకోచ్ పరిశ్రమలో స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

  • ‘విద్యతోనే అసమానతలు తొలగిపోతాయి’ 

    నిర్మల్: కుభీర్ మండలంలోని ధార్ కుభీర్‌లో రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందినప్పుడే అసమానతలు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.

  • రేషన్‌ కార్డులు పంపిణీ చేసిన అధికారులు

    ఆదిలాబాద్: జైనథ్ మండల కేంద్రంలో మంగళవారం ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షిషా పాల్గొని జైనథ్, బేల, సాత్నాల, బోరజ్ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు కట్టే పన్నులతోనే అమలవుతున్నాయని అన్నారు.

     

  • ‘ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలి’

    ఆదిలాబాద్: నార్నూర్ మండలం చోర్‌గావ్ గ్రామంలో కొలువుదీరిన శివాలయంలో మంగళవారం నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో జడ్పీ మాజీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని అన్నారు. జిల్లా నలుమూల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడింది.

  • నీళ్ల కోసం రోడ్డెక్కిన గిరిజనలు

    జనగామ: గిరిజనులు రోడ్డెక్కిన ఘటన మంగళవారం పాలకుర్తిలో చోటుచేసుకుంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు దుబ్బ తండా వాసులు ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో 15 రోజులుగా తాగునీరు రావట్లేదని వారు వాపోయారు. బావుల వద్దకు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నామని, కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని కన్నీటిపర్యంతం అయ్యారు. సరఫరా అయ్యేలా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.

  • వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు

    మంచిర్యాల: కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నిఘా పెంచినట్లు తెలిపారు. ఈసందర్భంగా సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్న వాహనలను తనిఖీలు చేసిన తర్వాతనే అనుమతిస్తున్నట్లు తెలిపారు. తనిఖీలో ఎస్సై రాజేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘చర్యలు తప్పవు’

    వరంగల్: నెక్కొండ మండలంలో మంగళవారం కలెక్టర్ సత్యశారద పర్యటించారు. ఈసందర్భంగా ఆమె నెక్కొండ హైస్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మధ్యాహ్న భోజన నిర్వాహకులు విద్యార్థులకు సరైన భోజనం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిర్వహకులను మార్చాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పని తీరు సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

    ఆదిలాబాద్: నార్నూర్, గాదిగూడ మండలాల్లో మంగళవారం నాగుల పంచమి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాము పుట్టలలో పాలు పోసి పేలాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామీణ పల్లెల్లో చెట్ల కొమ్మలకు ఊయల కట్టి సాంస్కృతిక పాటలు పాడుతూ సందడి చేశారు. అనంతరం పలువురు భక్తులు మాట్లాడుతూ.. ప్రజలందరిని చల్లగా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు.

     

  • మూలమర్రిలో ఉచిత వైద్య శిబిరం

    మహబూబాబాద్: మరిపెడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మంగళవారం మూలమర్రి తండాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. వైద్య శిబిరంలో మొత్తం 60 మందికి పరీక్షలు చేసి, మందులు అందజేసినట్లు తెలిపారు. వర్ష కాలం నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఝాన్సీ, కృష్ణ, లక్ష్మికుమారి, తదితరులు పాల్గొన్నారు.