Author: Shivaganesh

  • చికిత్స పొందుతూ బాలుడి మృతి

    మహబూబాబాద్: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన ఘటన సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మర్రికుంటతండాకు చెందిన బానోత్ వెంకన్న, అనిత దంపతుల కుమారుడు వెంకటచైతన్య(15), తొర్రూరు పట్టణంలోని ఓప్రైవేటు స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం స్కూల్ హాస్టల్‌లో ఎలుకల మందుతాగగా, సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు.

  • సోయం బాపూరావును సన్మానించిన నాయకులు

    ఆదిలాబాద్: రాష్ట్ర రాజ్ గోండ్ సేవ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన, మాజీ ఎంపీ సోయం బాపూరావును మంగళవారం మాదిగ జేఏసీ నాయకులు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో మోతె భారీక్‌రావు, నక్క రాందాస్, మల్యాల మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

  • న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు

    నిర్మల్: నిర్మల్ మండలం సాకేర గ్రామానికి చెందిన ఆశన్న అనే రైతుకు చెందిన భూమిని కొంత మంది కబ్జా చేశారని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణం సోఫీనగర్ జాతీయ రహదారి పక్కన తనకు చెందిన భూమిని ఇతరులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

     

  • ‘ఉన్నత శిఖరాలను అధిరోహించాలి’

    నిర్మల్: లోకేశ్వరంలోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌ను సోమవారం మానవ హక్కుల జిల్లా కన్వీనర్ సరస్వతి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె వసతి గృహాన్ని తనిఖీ చేసి అక్కడి వసతులు ఏవిధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మానవహక్కులపై అవగాహన కల్పించారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు పేరు తేవాలని సూచించారు.

  • అదనపు కలెక్టర్‌ను కలిసిన ఎమ్మార్వోలు

    మహబూబాబాద్: అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్‌ను నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈక్రమంలో సోమవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో జిల్లాలోని తహసీల్దారులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విధులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మర్వోలు పాల్గొన్నారు.

  • గర్భిణి మృతి.. బంధువుల ఆందోళన

    మహబూబాబాద్: డెలివరీకి వచ్చిన గర్భిణి మృతి చెందిన ఘటన సోమవారం సిరోల్ మండలం కాంపల్లిలో వెలుగుచూసింది. ప్రైవేట్ హాస్పటల్‌లో డెలివరీకి వచ్చిన సిరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన బొడ పద్మ అనే గర్భిణి చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ సోమవారం హాస్పటల్ ముందు బంధువుల ఆందోళన చేశారు.

  • మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో తనిఖీలు

    మంచిర్యాల: వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామ శివారులో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ..  సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు వారం పాటు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

  • ఎమ్మెల్యేకు గ్రామస్థుల వినతి

    నిర్మల్: నిర్మల్ రూరల్ మండలంలోని మేడిపల్లి గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ సోమవారం భాగ్యనగర్ కొత్త పోచంపాడు గ్రామస్థులు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ వాహనాల సాకుతో ఆర్టీసీ అధికారులు గతంలో బస్సును నిలిపివేశారని తెలిపారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • ఉచిత కంప్యూటర్ శిక్షణ

    చిత్తూరు: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో DDU-GKY ద్వారా యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. 18-27 ఏళ్ల వయసులోని ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న యువతకు MS ఆఫీస్, ట్యాలీ, వెబ్ డెవలపర్, బ్రాడ్‌బ్యాండ్ టెక్నీషియన్ కోర్సుల్లో 90 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు.

  • ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై

    చిత్తూరు: పూతలపట్టు ఎమ్మెల్యే డా.కలికిరి మురళీమోహన్‌ను సోమవారం కాణిపాకం ఎస్సై నరసింహులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాణిపాకం ఎస్సైగా నరసింహులు భాధ్యతలు స్వీకరించిన తర్వాత సోమవారం సాయంత్రం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను మర్యాదగా కలిసి మొక్కను అందజేశారు. కాణిపాకం పుణ్యక్షేత్రంలో శాంతి భద్రతల నిర్వహణలో విఘాతం లేకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించినట్లు ఎస్సై తెలిపారు.