Author: Shivaganesh

  • అదనపు కలెక్టర్‌ను కలిసిన ఎమ్మార్వో

    మహబూబాబాద్: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కుమార్‌ను సోమవారం కొత్తగూడ తహసీల్దార్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌కు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, ఏజెన్సీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని తహసీల్దార్‌కు సూచించారు.

  • ‘కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి’

    నిర్మల్: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులకు SFI జిల్లా కన్వీనర్ దిగంబర్ వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

     

  • వెయ్యేళ్ల చరిత్రలో అరుదైన ఘట్టం..

    చిత్తూరు: వెయ్యేళ్ల చరిత్రలో తొలిసారిగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.  బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అనిల్ కుమార్ 1,111 లీటర్ల పాలను స్వామివారి అభిషేకానికి సమర్పించారు. ముందుగా ఆయన కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి నిబంధనల ప్రకారం టిక్కెట్లు కొనుగోలు చేసి, ఈమహాభిషేకంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి ఆశీర్వచనం అందజేశారు.

  • ‘వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు’

    తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న జరగనున్న వరలక్ష్మీ వ్రతానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోందని జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం తెలిపారు. ఈసందర్భంగా ఆయన సిబ్బందితో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. భక్తులకు కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వ్రతం జరిపి, సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందని అన్నారు.

  • శ్రీనివాస కళ్యాణోత్సవాల నిర్వహణపై సమీక్ష

    తిరుపతి: తిరుపతిలో సోమవారం టీటీడీ ఈవో జె. శ్యామలరావు శ్రీనివాస కళ్యాణోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీనివాసుడి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి, టీటీడీ ప్రతిష్టను పెంచడానికి పటిష్టమైన విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. వ్యాపార దృక్పథం కాకుండా భక్తి భావంతో కళ్యాణోత్సవాలు నిర్వహించే సంస్థల ఎంపిక, ఎంవోయూలు, నియమావళి రూపకల్పనపై దృష్టి సారించాలని సూచించారు.

  • సిర్డ్స్ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ పంపిణీ

    తిరుపతి: కొటాల మోడల్ ప్రైమరీ పాఠశాలలో సోమవారం ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏకం యూఎస్‌ఏ ఆర్థిక సహకారంతో సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ (సిర్డ్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 80 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ మహిళా అధ్యక్షురాలు సింగు సుధా, సిర్డ్స్ కార్యదర్శి మరుపూరి హేమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

  • వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యం..

    తిరుపతి: వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం నాగలాపురం మండలం కృష్ణాపురం గ్రామం సమీపంలో వెలుగుచూసింది. కృష్ణాపురం గ్రామం సమీపంలోని వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • రేపు కోటరివేడులో ఎమ్మెల్యే పర్యటన

    చిత్తూరు: కార్వేటినగరం పట్టణం, కోటరివేడులో మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.థామస్ పర్యటించనున్నారు. అనంతరం ఆయన మధ్యాహ్నం 2:30 గంటలకు గంగాధర నెల్లూరు మండలం కోట్రకోన హరిజనవాడలో నిర్వహించనున్న “సుపరిపాలన తొలి అడుగు” ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

  • అభివృద్ధిపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

    తిరుపతి: పాకాల మండలం ఆదెనపల్లిలో సోమవారం ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై డీపీఓ సుశీలదేవితో కలిసి ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై వారితో చర్చించారు. భవన నిర్మాణ అనుమతులు, పన్నుల వసూలు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.

     

  • ‘ఆ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలి’

    నిర్మల్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో DEO రామారావుకు పీడీఎస్‌యూ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమయపాలన పాటించని స్కూల్లపై చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్‌లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తూ ఒత్తిడి గురి చేస్తున్నారని అన్నారు.