నిర్మల్: జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆమె ఫిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి అధికారులకు బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.
Author: Shivaganesh
-
ప్రజావాణికి 283 వినతులు
హన్మకొండ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో 283 వినతులను స్వీకరించినట్లు తెలిపారు. ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అర్జీలను నిర్లక్ష్యం చేయకూడదని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఎల్లారిగూడెంలో ఉచిత వైద్య శిబిరం
మహబూబాబాద్: మరిపెడ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో సోమవారం ఎల్లారిగూడెంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ.. శిబిరంలో మొత్తం 40 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేసినట్లు తెలిపారు. వర్ష కాలం నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
కాంపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత
మహబూబాబాద్: సీరోలు మండలంలోని కాంపల్లి గ్రామంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీరోలు ఎస్సై సంతోష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢనమ్మకాలు, సైబర్ క్రైమ్‌పై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ చైతన్యవంతంగా ఉండి సైబర్ దాడికి గురికాకుండా, మూఢనమ్మకాల ఉచ్చులో పడకుండా అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
-
ఎన్‌ఐటీలో జియన్ శిక్షణ ప్రారంభం
హన్మకొండ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (ఎన్‌ఐటీ)లో “హైడ్రాలజిక్ ఎక్స్‌ట్రీమ్స్ విశ్లేషణ & నమూనాల అభివృద్ధిలో పురోగతులు” అనే అంశంపై జియన్ (గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకడెమిక్ నెట్‌వర్క్స్) శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయానికి చెందిన డా. వెంకటరమణ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం నేటి నుంచి ఆగస్టు 6, 2025 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
-
గంజాయి ముఠా అరెస్ట్..
నిర్మల్: ఇంజక్షన్ల రూపంలో మత్తు పదార్థాలు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. నిర్మల్ పట్టణంలోని బైల్ బజార్ ప్రాంతంలో మత్తు పదార్థాలు విక్రయించిన నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 100 గ్రాముల నిషేధిత గంజాయి, 3 మత్తు మందు ఇంజక్షన్లు, ఆటో, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ టీంను ఆయన అభినందించారు.
-
ఆగస్టు 10న ఫైలేరియా కార్యక్రమం
మహబాబూబాద్: గార్ల మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం ఫైలేరియా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎండీఏ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో మంగమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీహెచ్‌సీ ముల్కనూరు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ.. ఆగస్టు 10 నుంచి 23 వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
-
జైపూర్‌లో తనిఖీ బృందం పర్యటన
మంచిర్యాల: జైపూర్ మండలం జైపూర్, వేలాల గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ SSG టీం ఆధ్వర్యంలో తనిఖీ బృందం పర్యటించారు. రీజినల్ రిసోర్స్ పర్సన్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఆయా గ్రామల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్, ప్రభుత్వ పాఠశాలలను, సెగ్రేగేషన్ షెడ్ లను పరిశీలించారు. అనంతరం ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
-
అదనపు కలెక్టర్‌కు వినతి..
నిర్మల్: ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో MRI స్కానింగ్, న్యూరో డాక్టర్‌ను నియమించాలని అదనపు కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే స్పందించాలని అన్నారు.
-
‘నిస్వార్థంగా సేవలు అందించారు’
ఆదిలాబాద్: నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో సోమవారం నాందేవ్ కాంబ్లే 4వ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జనార్థన్ మాట్లాడుతూ.. నాందేవ్ సామాజికంగా, రాజకీయంగా నిస్వార్థంగా అందించిన సేవలను గుర్తు చేశారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.