ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైనథ్ మండలం ఆనంద్పూర్, సాత్నాల మండలం సాంగ్వి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోదీ ఆధ్వర్యంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Author: Shivaganesh
-
‘మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకోం’
హన్మకొండ: వర్ధన్నపేట నియోజక వర్గ పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సోమవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని గౌరవం లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు సంబోధిస్తున్నారని అన్నారు. సీఎం గురించి మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వారికి ప్రజలు బుద్ధిచెప్పినా తీరు మార్చుకోవడం లేదని విమర్శించారు.
-
భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
హన్మకొండ: టేకులగూడెం గ్రామంలో సోమవారం సుమారు రూ.30 లక్షలతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాగరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారుల ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల టేకులగూడెం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హన్మకొండ: గ్రేటర్ 56వ డివిజన్ పరిధిలోని పరిమళకాలనీ, సురేంద్రపూరి ప్రాంతాల్లో సోమవారం రూ.1 .10 కోట్లతో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
హన్మకొండ: హసన్పర్తి మండలం పరిధిలోని నాగారం యూత్ నాయకులు తోట భాస్కర్, సోదరుడు తోట రాజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. సోమవారం వారి ఇంటికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ముచ్చర్ల గ్రామానికి చెందిన కేయూ ఈసీ మెంబర్ చిర్ర రాజు తండ్రి చిర్ర సాయిలు, అనారోగ్యంతో మరణించగా ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
-
ఘోరం.. బావిలో ఆటో పడి
మహబూబాబాద్: బావిలో ఆటో పడి ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం నెల్లికుదురు మండలం మునిగలవేడులో చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో ఓ ఆటో అదుపుతప్పి బావిలో పడింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బావిలోంచి ఆటోని వెలికితీసి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
-
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో సోమవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్, జావెలిన్ త్రో ఎంపిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి హాజరై మాట్లాడారు. అథ్లెటిక్స్ అనేది వ్యక్తిగత క్రీడని, సత్తా చాటిన వారు పోటీలో రాణిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారులు శ్రీనివాస్, పార్థసారథి, అథ్లెటిక్స్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
-
సంగం ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటా: తిరుపతయ్య సాగర్
వనపర్తి: తెలంగాణ సగర(ఉప్పర) సంఘం అధ్యక్షుడిగా తిరుపతయ్య సాగర్ ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సగర సంగం ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లాలో ఉన్న సగర కుటుంబసభ్యులను కలుపుకొని పోతానని బేదాభిప్రాయాలు లేకుండా అందరితో కలిసి పోతానని ప్రమాణం చేశారు.
-
‘స్పోర్ట్స్ హబ్ దిశగా ముందడుగు’
హన్మకొండ: హన్మకొండ ఆఫీసర్స్ క్లబ్ వేదికగా జరిగిన 11వ రాష్ట్ర స్థాయి అండర్ 17 బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ – 2025 ముగింపు సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. వరంగల్‌లో స్పోర్ట్స్‌హబ్ దిశగా ముందడుగు పడిందన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఈత మొక్కలు నాటిన మంత్రి పొన్నం
సిద్దిపేట: కోహెడ మండలం బస్వాపూర్‌లో ఆదివారం వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలను మంత్రి పొన్నం ప్రభాకర్ నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవంలో 40 లక్షల ఈత, 5 లక్షల తాటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కూరగాయల, పండ్ల మొక్కలు నాటాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.