Author: Shivaganesh

  • ‘పనులు వేగంగా పూర్తి చేయాలి’

    సిద్దిపేట: కోహెడ మండలం తంగలపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్థల పరిశీలన చేశారు. ఈసందర్భంగా ఆయన స్థలాన్ని చదును చేస్తున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ కె.హైమావతికి సూచించారు. కార్యక్రమంలో కోహెడ మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • బ్రిడ్జిని సందర్శించిన డీఈ

    మెదక్: మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లోని ధూప్ సింగ్ తండా వద్ద రాకపోకలు నిలిచిపోయేలా ప్రవహిస్తున్న బ్రిడ్జిని మెదక్ సర్కిల్ పంచాయతీరాజ్ ఎస్ఈ జగదీశ్వర్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హవేలీ ఘన్పూర్ తహసీల్దార్‌కు సూచించారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ పాండు రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • రోడ్లకు మరమ్మతులు చేయించిన నాయకులు

    వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పరకాల పట్టణంలో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఈసందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారము, పరకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆదివారం ఉదయం మరమ్మతులు చేయించారు.  కూరగాయల మార్కెట్ జంక్షన్ వద్ద, పలు చోట్ల రోడ్డు మరమ్మతులు చేయించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  • జలకళ సంతరించుకున్న ప్రాజెక్టు..

    మెదక్: వర్షాలతో జిల్లాలోని వన దుర్గా ప్రాజెక్టుకు జలకళ సంతరించుతుంది. 135MCFT ల సామర్ధ్యం గల ప్రాజెక్టు వర్షపు నీటితో నిండటంతో పంటలు సాగు చేసే అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి స్వల్పంగా నీరు వనదుర్గమ్మ ఆలయం ముందు ఉన్న బ్రిడ్జి నుంచి దిగువకు ప్రవహిస్తుంది. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • 20% రాయితీ కల్పించిన ఆర్టీసీ

    సంగారెడ్డి: జహీరాబాద్ డిపో నుంచి బెంగళూరుకు నడిచే బస్సు సర్వీసు (1956/1957)పై 20 శాతం రాయితీ లభిస్తుందని డిపో మేనేజర్ టి.స్వామి తెలిపారు. రాయితీతో ఛార్జీ రూ. 728గా నిర్ణయించబడిందని పేర్కొన్నారు. జహీరాబాద్ నుంచి బస్సు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు బెంగళూరు చేరుకుంటుదని, తిరిగి బెంగళూరు నుంచి సాయంత్రం 7 గంటలకు బయలుదేరి ఉదయం 9:30 గంటలకు జహీరాబాద్ చేరుకుంటుందన్నారు.

  • ‘ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ తరగతులు’

    మెదక్: జిల్లాలోని 26 ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఎంపికైన పాఠశాలలో తక్షణమే తరగతులు ప్రారంభించేలా సంబంధిత ఎంఈఓలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు.

  • ‘అంకితభావంతో పని చేయాలి’

    మెదక్: టేక్మాల్ పోలీస్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ.. విధుల్లో నిబద్ధత పాటించాలని అన్నారు. అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • ‘ఉపాధ్యాయుల పాత్ర కీలకం’

    మెదక్: మనోహరాబాద్ మండలం జడ్పీహెచ్ఎస్ స్కూల్‌ను శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పాఠశాల రిజిస్టర్లను పరిశీలించి, పాఠశాల నిర్వాహణ తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం FLN శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ విద్యాబోధన ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.

  • ‘అప్రమత్తంగా ఉండాలి’

    మెదక్: జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలుల దృష్ట్యా విద్యుత్తు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్తు శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ కోరారు. తడిచేతులతో విద్యుత్తు పరికరాలు, పోల్స్ తాకవద్దని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

  • ‘వర్షాలు తగ్గాక నాట్లు వేయాలి’

    మెదక్: గత నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలు, ఇంకా నాలుగు రోజులు కురిసే అవకాశం ఉందని, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.దేవ్ కుమార్ రైతులను అప్రమత్తం చేశారు. రామాయంపేటలో ఆయన మాట్లాడుతూ.. పొలాల్లో నిలిచిన నీటిని త్వరగా బయటకు పంపాలని సూచించారు. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వర్షాలు తగ్గాక నాట్లు వేయడానికి రైతులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.