Author: Shivaganesh

  • ‘వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి’

    మెదక్: నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా చెరువులు, కాల్వల వద్దకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దని, పిల్లలను వాగులువంకల వద్దకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100 కు డయల్ చేయాలని తెలిపారు.

     

  • ‘హాస్టల్స్‌లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి’

    మెదక్: నార్సింగి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను శనివారం యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాతావరణంలో మార్పులు కారణంగా మోస్తారు వర్షలు కురవడంతో హాస్టల్‌లో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.  జిల్లాల్లోని ప్రతీ హాస్టల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని అన్నారు.

     

  • స్వామివారికి తులసి దళాలతో అలంకరణ

    మెదక్: రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి గోదా సమేత స్వామి దేవాలయంలో శనివారం శ్రావణమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. స్వామివారికి తులసి దళాలతో ప్రత్యేక అలంకరణ చేసినట్లు తెలిపారు. పద్మావతి గోదా సమేత శ్రీనివాస సన్నిధికి, చిగుళ్లపల్లి వెంకటేశం రూ.11 వేలు కానుక సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

     

  • కాలభైరవుడికి ప్రత్యేక పూజలు

    సంగారెడ్డి: సదాశివపేట మండలం అరూర్ శివారులో కొలువైన శ్రీలక్ష్మీ, కాలభైరవ, కుబేరస్వామికి శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మడుపతు సంతోష్ స్వామి మాట్లాడుతూ.. ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేకలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు మహామంగల హారతి, తీర్థప్రసాదాలు, అన్నదాన వితరణ చేశారు.

     

  • నర్సాపూర్‌లో భారీ వర్షం

    మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీలో వర్షం నీళ్లు ఇళ్ల మధ్యలో చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు వార్డుల్లోని ప్రధాన రహదారిపై మురుగనీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం పడిన ప్రతిసారి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

  • జుడిషియల్ రిమాండ్‌కు నిందితులు

    సంగారెడ్డి: మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద శుక్రవారం 1,250 కిలోల ఎండు గంజాయితో పట్టుబడిన నిందితులను పోలీసులు శనివారం జుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ కేసును దర్యాప్తు చేశారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్ఐ బక్కన్న, కానిస్టేబుళ్లు హనీఫ్, పాండు, డ్రైవర్ సునీల్‌లను కొండాపూర్ సీఐ సుమన్ కుమార్ అభినందించారు.

  • ‘అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దు’

    సంగారెడ్డి: వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ మండల ప్రజలకు సూచించారు. మండలంలోని ప్రజలు ఎవరూ కూడా చెరువుల వద్దకు, కుంటల వద్దకు వెళ్లకూడదని అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దని, పిల్లలను తల్లిదండ్రులు వాగుల, వంకాల వద్దకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.

  • కాళేశ్వరం వద్ద ఉధృత ప్రవాహం

    జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ల వద్ద నీటిమట్టం 8.700 మీటర్ల ఎత్తుకు చేరిందని అధికారులు తెలిపారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద వస్తుండటంతో 85 గేట్లు ఎత్తి 3,41,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలని పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సమానంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

  • ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

    మెదక్: శివంపేట మండలం సాకర్ మెట్లలో సాగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణమాసం శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ పురోహితులు ఆంజనేయ శర్మ మాట్లాడుతూ.. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం  సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • గజ్వేల్‌లో చోరీల కలకలం

    సిద్దిపేట: గజ్వేల్‌లో వరుస చోరీలు కలకలం రేపాయి. శుక్రవారం రాత్రి గజ్వేల్‌లోని మూడు కాలనీల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.