Author: Shivaganesh

  • విద్యార్థులకు మరొక అవకాశం..

    సంగారెడ్డి: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీలో జాయిన్ కాడానికి విద్యార్థులకు మరొక అవకాశం కల్పించడం జరిగిందని ప్రిన్సిపాల్ బంగ్లా భారతి తెలిపారు. ఈనెల 25 నుంచి జూలై 31 వరకు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ స్పెషల్ పేస్ ద్వారా వివిధ కోర్సులలో జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.

     

  • సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు

    మహబూబాబాద్: బయ్యారం మండలం గంధంపల్లి కొత్తపేటలోని నాయక్ పోడు కాలనీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలమయమైంది. శుక్రవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి కాలనీవాసులు సమస్యను తీసుకెళ్లారు. ఆయన సమస్యను పరిష్కరించాలని స్థానిక నాయకులకు సూచించారు. శనివారం కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రవీణ్‌నాయక్, సొసైటీ డైరెక్టర్ జూలకంటి సీతారాంరెడ్డి సహకారంతో నీటిని మళ్లించే ఏర్పాట్లు చేశారు.

  • బోనాల పండుగకు ఆహ్వానం

    సంగారెడ్డి: గుమ్మడిదల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని మండలంలోని అన్నారం, దోమడుగు అనంతారం గ్రామాల యువకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయా గ్రామాల్లో ఆదివారం నిర్వహించనున్న పోచమ్మ తల్లి బోనాల పండుగకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానం అందజేశారు. కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు.

  • 50 కిలోల ఎండు గంజాయి పట్టివేత

    వరంగల్: పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి మైలపల్లి మోహిత్, మరో బాలుడు బైక్‌పై వరంగల్‌కు వస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నర్సంపేట రోడ్డులో తనిఖీలు చేశారు. తనిఖీలో వారి వద్ద 50 కిలోల ఎండు గంజాయి లభించగా, నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. నిందితుల వివరాలను డీఎస్పీ సైదులు వెల్లడించారు.

  • స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న ప్రభుత్వ విప్

    మహబూబాబాద్: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పాల్గొని శ్రమదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

  • తాత్కాలికంగా రాకపోకలు బంద్.. ఎక్కడంటే

    మహబూబాబాద్: గంగారం మండలం కోమట్లగూడెం, కాటినాగారం మధ్యగల వాగు వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతుంది. వరద ప్రవాహం తగ్గి రోడ్డు మరమ్మతులు చేపట్టే వరకు తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేసినట్లు గంగారం ఎస్సై తెలిపారు. సంబంధిత గ్రామాల ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుని ఇంటి వద్దే ఉండగాలని సూచించారు.

  • ఛోటా న్యూస్ కథనానికి స్పందన..

    సిద్దిపేట: హుస్నాబాద్ రిలయన్స్ మార్ట్‌లో ఈనెల 22న బూజు పట్టిన పన్నీరు అమ్మిన ఘటనపై ఛోటా న్యూస్‌లో వచ్చిన కథనానికి హుస్నాబాద్ పురపాలక అధికారులు స్పందించారు. ఇన్‌ఛార్జి మేనేజర్ సంపత్ రావు ఆధ్వర్యంలో రిలయన్స్ మార్ట్‌లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎక్స్‌ప్రైరీ డేట్ దాటిన వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్ట్ రూ.30 వేల జరిమానా విధించారు.

     

  • గౌలిగూడెంలో పేలుడు పదార్థాలు సీజ్..

    మెదక్: అనుమతి లేకుండా పేలుడు పదార్థాలతో బండరాళ్లను పగలగొడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శివానందం మాట్లాడుతూ.. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలోని గౌలిగూడెంలో శుక్రవారం మధ్యాహ్నం రామచంద్రా రెడ్డి పొలంలో అనుమతి లేకుండా పేలుడు పదార్థాలతో బండరాళ్లను పగలగొడుతున్న బిక్షపతి, బొల్లాబోయిన నర్సింలు, అంబాపురం రాజులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  • ‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’

    మెదక్: రామాయంపేట మండలం సుతార్‌పల్లిలో శుక్రవారం డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీ రామ్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ, అధికారులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

  • రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన నాయకులు

    మెదక్: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని రైల్వే స్టేషన్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్‌గౌడ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన స్టేషన్లో నెలకొన్న సమస్యలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అజంతా, తిరుపతి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేషన్‌లో ఆగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిని ఇక్కడ ఆపేలా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానని ఆయన అన్నారు.