భద్రాద్రి కొత్తగూడెం: ఉరేసుకొని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం పాల్వంచ కేటీపీఎస్ కాలనీలో వెలుగుచూసింది. పాల్వంచ కేటీపీఎస్ కాలనీలో నివాసం ఉంటున్న ముళ్లపుడి రాల ప్రసాద్ (48) కేటీపీఎస్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శుక్రవారం ఆయన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై సుమన్ కేసు నమోదు చేశారు.
Author: Shivaganesh
-
దరఖాస్తులు చేశారా..
జయశంకర్ భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 31వ లోపు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లతో పాటు సీనియర్ రెసిడెంట్స్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదకన నియమించనున్నట్లు తెలిపారు.
-
మంథని మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా వెంకన్న
పెద్దపల్లి: మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుడుదుల వెంకన్న నియమితులయ్యారు. మాజీ ఎంపీటీసీగా పని చేసిన ఈయన, మంత్రి శ్రీధర్ బాబుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. వైస్ ఛైర్మన్‌గా ముసుకుల ప్రశాంత్ రెడ్డితో పాటు 12 మంది డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన కమిటీ సభ్యులకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
-
ఆర్.వెంకటాపూర్‌లో అవగాహన కార్యక్రమం
మెదక్: రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు స్వచ్ఛ సర్వేక్షన్, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై పాట రూపంలో అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
-
ఇద్దరిపై కేసు నమోదు.. ఎందుకంటే
ఖమ్మం: అనుమతి లేకుండా నాటు తుపాకులు వినియోగిస్తున్న ఇద్దరిపై కల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురానికి చెందిన ఘంటసాల లక్ష్మీనారాయణ, ఘంటసాల పెద్దిరాజు చెరువు వద్ద కాపలా ఉంటుండగా, ఆయుధ లైసెన్స్ లేకుండానే నాటు తుపాకులు, గన్ పౌడర్ ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీంతో వీరిద్దరిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిత తెలిపారు.
-
రేపు లైసెన్స్‌డ్ సర్వేయర్లకు రాత పరీక్ష
జగిత్యాల: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఆదివారం రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా సర్వే అండ్ ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఏడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎస్ కేఎస్ఆర్ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష హాలు రావాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే 99669 88002 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
-
తీగ సెల్ టవర్ ఎత్తుకు అల్లుకుంది..!
మహాబాబూబాద్: గార్ల మండలం మద్దివంచ గ్రామంలో సెల్ టవర్ ఎత్తు తీగ అల్లుకుందని గ్రామస్థులు వాపోయారు. ఈసందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ.. సెల్ టవర్ చుట్టుపక్కల పిచ్చి మొక్కల పెరగడంతో రాత్రి సమయంలో విష సర్పాలు బయటికి వస్తున్నాయని అన్నారు. వెంటనే యాజమాన్యం స్పందించి పిచ్చి మొక్కలని తొలగించాలని కోరారు.
-
ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్‌గా శశాంక
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్పెషలాఫీసర్ ఐఏఎస్ అధికారి కె.శశాంక నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌కు 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శశాంక పేరును ప్రకటించింది. ఈమేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ప్యూచర్ సిటీ డెవలపెమెంట్ అథారిటీకి కమిషనర్‌గా ఉన్నారు.
-
గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ఖమ్మం: సత్తుపల్లి పట్టణంలోని గ్రంథాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు గ్రంథాలయంలోని పుస్తకాలను, రికార్డులను పరిశీలించి, గ్రంథాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో సత్తుపల్లి AMC ఛైర్మన్ దోమ ఆనంద్ బాబు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
వారికి ఇదే లాస్ట్ ఛాన్స్..
సిద్దిపేట: డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు ఉన్నత విద్యామండలి దోస్త్ స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 31వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది. ఈసందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ.. డిగ్రీలో ప్రవేశాలకు ఇదే లాస్ట్‌ఛాన్స్ అన్నారు. కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 31వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చన్నారు.