సినిమాలకు దీటుగా ఓటీటీ సంస్థలు వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నాయి. విభిన్న కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే పలు సిరీస్‌లను రిలీజ్ చేసి, మెప్పించిన ‘జియో హాట్‌స్టార్’ మరో సిరీస్‌ను తీసుకొస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ సిరీస్ ‘పోలీస్ పోలీస్’ను సెప్టెంబరు 19న విడుదల చేయనుంది. ఈ వివరాలు ప్రకటిస్తూ తమిళ్ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘త్రిబాణధారి బార్బరిక్’.. టికెట్స్ ఫ్రీ
సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలలో నటించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం నేడు విడుదలైంది. సెప్టెంబర్ 7 గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆగస్టు 30, 31 తేదీలలో సాయంత్రం షోకు కుటుంబంతో వచ్చేవారిలో ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్‌కు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ఈ సినిమా తాత, మవవరాలికి సంబంధించిన కథ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎక్కువగా కదిలిస్తుండటంతో ఈ ఆఫర్‌ను చిత్రయూనిట్ అందిస్తోంది.
-
మరోసారి తల్లి కాబోతున్న హీరోయిన్.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ నటి పూర్ణ మరోసారి తల్లి కాబోతుంది. తను రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది. ‘‘ఈ శుభవార్తతో మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి’’ అంటూ పూర్ణ పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తన మొదటి కుమారుడితో పలు ఫొటోలు పంచుకుని తెలిపింది. దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పూర్ణ పెళ్లి చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
-
విజయ్ ‘జన నాయగన్’.. ఫస్ట్ సాంగ్ అప్పుడే?
హెచ్.వినోద్ డైరెక్షన్‌లో హీరో దళపతి విజయ్ నటిస్తున్న చిత్రం ‘జన నాయగన్’. పూజాహెగ్డే, మమిత బైజు హీరోయిన్లు. ఈ సినిమా 2026 జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘జన నాయగన్’ ఫస్ట్ సింగిల్ దీపావళి కానుకగా రాబోతున్నట్లు టాక్. ఈపాటలో విజయ్‌తో పూజా, మమిత బైజు చిందులేయబోతున్నట్లు సమాచారం.
-
స్టేజీపైనే స్టెప్పులేసిన హీరో.. హీరోయిన్ రియాక్షన్ ఇది!
హీరో శివ కార్తికేయన్ నటిస్తోన్న చిత్రం ‘మదరాసి’. మురుగదాస్ దర్శకుడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ కనిపించనుంది. తాజాగా బెంగళూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ వేదికపైనే డ్యాన్స్‌తో అలరించాడు. ఈ సినిమాలోని ‘సలంబల’ అనే పాటకు తన స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(వీడియో)
-
‘మదరాసి’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
శివ కార్తికేయన్-రుక్మిణీ వసంత్ జంటగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న మూవీ ‘మదరాసి’. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ అందుకుంది. సినిమా రన్‌టైమ్ 2గంటల 47 నిమిషాలు ఉందని తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ నాలుగు చోట్ల కట్స్ సూచించింది. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
-
చీరకట్టులో అందాల మృణాల్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఈ బ్యూటీ చీరకట్టులో డబుల్ అందంగా కనిపిస్తోంది.
-
స్టార్ హీరో తల్లికి హీరోయిన్ దీపిక కౌంటర్
హీరోయిన్ దీపికా దాస్‌పై హీరో యష్ తల్లి పుష్ప చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సినిమాను ప్రమోషన్‌లో దీపికా గురించి ఎందుకు అడుగుతున్నారని ఆమె మండిపడారు. దీనిపై దీపికా ఘాటుగా స్పందించారు. ఇండస్ట్రీలో గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అన్నారు. తన కెరీర్ కోసం ఎవరి పేరు వాడుకోలేదని, తన గురించి చెడుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. మౌనంగా ఉన్నాను అంటే భయపడి కాదని ఆమె స్పష్టం చేశారు.
-
రూ.300 కోట్ల క్లబ్‌లో ‘మహావతార్ నరసింహ’
హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. భారతీయ పురాణ గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యానిమేషన్ చిత్రాల్లో ఇదొక అరుదైన ఘనతగా నిలిచింది.
-
Video: సరోగసీపై సన్నీ లియోన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సరోగసీపై సన్నీ లియోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను గర్భం దాల్చడం ఇష్టం లేకే సరోగసీని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. పిల్లలను దత్తత తీసుకోవాలని మొదట నిర్ణయించుకున్నామని.. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చామని చెప్పింది. తమ సరోగసీ మదర్‌కు ఆర్థికంగా సహాయపడగలిగామని.. తాము ఇచ్చిన డబ్బుతో వారు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారని సన్నీ వెల్లడించింది. (వీడియో)