ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్ర కోసం చిరంజీవిని రంగంలోకి దించాలని సందీప్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. చిరంజీవిని నటింపజేయాలనుకునే పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
హీరోయిన్‌పై కిడ్నాప్ కేసు.. ముగ్గురు అరెస్ట్
కేరళలోని కొచ్చిలో ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో నటి లక్ష్మీ మీనన్‌తో పాటు ముగ్గురిపై ఎర్నాకులం నార్త్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి రెస్టారెంట్‌లో జరిగిన వాగ్వాదం తర్వాత, లక్ష్మీ గ్యాంగ్ బాధితుడిని వెంబడించి, కారులో లాక్కొని దాడి చేసిందని ఫిర్యాదు. మిథున్, అనీష్, సోనామోల్ అరెస్ట్ కాగా, లక్ష్మీ పరారీలో ఉంది.
-
వినాయక చవితి స్పెషల్.. చిరు న్యూ మూవీ పోస్టర్ రిలీజ్
చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. వినాయక చవిత శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
-
నారా రోహిత్ ఖాతాలో హిట్ పడ్డట్లేనా?
నారా రోహిత్, శ్రీదేవి, వృతి వాఘాని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సుందరకాండ’. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఈ మూవీ ఆద్యంతం నవ్వులు పంచింది. దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి ఎక్కడా గీత దాటకుండా ఇంటిల్లిపాదీ మెచ్చే హాస్యంతో సినిమాని మలిచాడు. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు కథలో ఓ పెద్ద మలుపు. క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది.
-
మాలీవుడ్ ‘నాగమ్మ’గా మోనాలిసా
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘నాగమ్మ’ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవల కొచ్చిలో జరిగింది. ఈ మూవీని పి. బిను వర్గీస్ దర్శకత్వం వహిస్తుండగా.. జీలి జార్జ్ నిర్మిస్తున్నారు. మోనాలిసా గులాబీ రంగు లెహంగాలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
-
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
తమిళ హిట్ చిత్రం ‘మామన్’ ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కమెడియన్ సూరి హీరోగా నటించిన ఈ చిత్రం మేనమామల గొప్పదనం, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కింది. మే నెలలో థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రం, ఆగస్టు తొలి వారంలో తమిళ వెర్షన్‌లో మాత్రమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా తెలుగులోకి డబ్ అయింది.
-
‘పరమ్ సుందరి’ VS ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’.. జాన్వీ కపూర్ ఏమన్నారంటే!
జాన్వీ కపూర్ నటించిన ‘పరమ్ సుందరి’ చిత్రం సెప్టెంబర్ 29న విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ట్రైలర్, పోస్టర్‌లు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాను పోలి ఉన్నాయని నెటిజన్లు విమర్శించారు. ఈ విమర్శలపై జాన్వీ స్పందించారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో పోల్చడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
-
‘ఓజీ’ నుంచి సువ్వి.. సువ్వి సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వినాయక చవితి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి ‘సువ్వి.. సువ్వి’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఉండిపో ఇలాగా.. తోడుగా.. నా మూడు ముళ్లలాగా’అంటూ సాగే లిరిక్స్ కల్యాణ్ చక్రవర్తి రాయగా.. శ్రుతి రంజనీ ఆలపించారు.
-
ఘాటీ ప్రమోషన్స్‌కు అనుష్క దూరం!
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటించిన చిత్రం ‘ఘాటి’. సెప్టెంబర్ 5న విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌కు అనుష్క దూరంగా ఉండనుంది. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడే అనుష్క ప్రమోషన్స్‌కు అందుబాటులో ఉండరని చెప్పినట్లు నిర్మాత రాజీవ్‌రెడ్డి తెలిపారు. ‘‘ప్రీరిలీజ్ వేడుకకు హాజరుకాకపోవచ్చు. అది ఆమె వ్యక్తిగత విషయం. అనుష్కలాంటి నటి మాత్రమే ఇంత గొప్ప పాత్ర పోషించగలరు. షీలా పాత్రలో జీవించింది’’ అని చెప్పుకొచ్చారు.
-
నటుడు విజయ్‌పై కేసు
తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మధురైలో విజయ్ నిర్వహించిన ఈవెంట్‌లో విజయ్ బౌన్సర్స్ తనను కొట్టారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విజయ్, బౌన్సర్లు కేసు ఫైల్ చేశారు.