నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కొత్త లుక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరైన ఈ నందమూరి వారసుడు మరింత సన్నగా కనిపించారు. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తారని చర్చ జరిగినా ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో బాలకృష్ణ స్వయంగా కొడుకు సినిమాకు దర్శకత్వం వహిస్తారని సినీవర్లాల్లో చర్చ జరుగుతోంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
ఈ వారం థియేటర్‌లో సందడి చేసే చిత్రాలివే..
ఈ వారం థియేటర్లలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి.
- ఆగస్టు 22: అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’
- ఆగస్టు 22: ఆర్.నారాయణమూర్తి ‘యూనివర్సిటీ పేపర్ లీక్’
- ఆగస్టు 22: మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్’ (రీరిలీజ్)
-
NTR అభిమాని హౌస్ అరెస్ట్!
AP: Jr.NTR అభిమానులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ఎన్టీఆర్ అభిమానులు చేయనున్న ధర్నాను నిలిపివేయాంటూ పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో మదనపల్లి ఎన్టీఆర్ అభిమాని టెంపర్ రాజేష్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
-
న్యూయార్క్‌లో బిగ్గెస్ట్ ‘ఇండియా డే’ పరేడ్
న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అతిపెద్ద ఇండియా డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు కాంగ్రెస్ సభ్యుడు థానేదార్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, పార్లమెంటు సభ్యుడు సత్నామ్ సింగ్స సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాదికి గ్రాండ్ మార్షల్స్‌గా రష్మిక , విజయ్ దేవరకొండనుగ్రాండ్ మార్షల్స్‌గా సత్కరించారు. మన దేశం వెలుపల అతిపెద్ద పరేడ్ ఇదే కావడం గమనార్హం.
-
సినిమా అవకాశాల కోసం ఆ డైరెక్టర్ వెంటపడ్డా: నాగార్జున
సినిమా అవకాశాల కోసం తాను కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం వెంటపడేవాడినని నటుడు నాగార్జున అన్నారు. మణిరత్నం కథలకు తాను సూట్ అవుతానని, అలా తమ కాంబోలో వచ్చిన సినిమానే ‘గీతాంజలి’ అని తెలిపారు. ‘‘నాగేశ్వరరావు కొడుకుగానే తొలి ఆరేడు సినిమాలు చేశా. అవి కొందరికి నచ్చలేదు. ‘మజ్ను’ సినిమా నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఆఖరి పోరాటం’తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నా’’ అని చెప్పుకొచ్చారు.
-
Jr.NTR ఫ్యాన్స్‌కు పోలీసుల వార్నింగ్!
AP: Jr.NTR, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇష్యూ ముదురుతోంది. ఇవాళ సాయంత్రంలోగా ఎన్టీఆర్‌కు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. హౌస్ అరెస్ట్‌లు చేస్తామంటూ తమకు పోలీసుల నుంచి బెదిరింపులు వచ్చాయంటూ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
-
ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి: NTR ఫ్యాన్స్
AP: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని Jr.NTR ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తారక్‌ను టార్గెట్ చేసుకుని బూతులు తిట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటున్నారు. అటు ‘Suspend MLADaggupati Prasad’ ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రసాద్ ఉన్న ఫ్లెక్సీలను చించివేస్తున్నారు. బ్యానర్లపై కోడిగుడ్లు విసురుతూ నిరసన తెలుపుతున్నారు.
-
అవ్రామ్‌కు అవార్డు.. మంచు విష్ణు అన్న అంటూ మనోజ్ పోస్ట్
ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ‘కన్నప్ప’ చిత్రంతో హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ నటించాడు. ఇటీవల జరిగిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో అవ్రామ్‌కు అవార్డు లభించగా, మంచు మనోజ్ స్పందిస్తూ “నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది అవ్రామ్. అన్నా, నాన్నతో కలిసి అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం” అని పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
‘బౌన్స్ అయిన చెక్కులతో ఇంటికి తోరణాలు కట్టొచ్చు’: యాంకర్ ఉదయభాను
యాంకర్‌గా ఉన్నప్పుడు చాలామంది నిర్మాతలు రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశారని యాంకర్ ఉదయభాను ఆరోపించారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “బౌన్స్ అయిన చెక్కులతో ఇంటికి తోరణాలు కట్టొచ్చు” అని చెప్పారు. రెమ్యునరేషన్ అడిగితే తనపై తప్పుడు ప్రచారం చేశారని కూడా ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘త్రిబాణధారి బార్చ్బరిక్’ అనే చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.