Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • మంత్రి ఎస్‌.జై శంకర్‌కు నటుడు అమితాబ్‌ ప్రశంస

    ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో నటుడు అమితాబ్ బచ్చన్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను ప్రశంసించారు. “నేను అతని వీడియోలను చూస్తూ ఉంటాను. అతను చాలా దృఢమైన సమాధానాలు ఇస్తారు. కొన్నిసార్లు ఆయన సాయుధ దళాల్లో చేరేలా కనిపిస్తారు” అని అమితాబ్ అన్నారు. ఈ ఎపిసోడ్‌లో సాయుధ దళాల అధికారులు ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన అంశాలను వివరించారు.

  • డైరెక్టర్‌గా నాకు నాగార్జున జన్మనిచ్చారు: రామ్ గోపాల్ వర్మ

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక టీవీ షోలో నాగార్జున గురించి మాట్లాడుతూ, “తల్లిదండ్రులు నాకు వ్యక్తిగా జన్మనిస్తే, ‘శివ’ సినిమాతో నాగార్జున దర్శకుడిగా నాకు జన్మనిచ్చారు” అని అన్నారు. అనుభవం లేని తనను నూటికి నూరు శాతం నమ్మారని, ఎదురైన సమస్యల్లో అండగా నిలిచారని వర్మ చెప్పారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘శివ’ టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

  • ఓ లాయర్‌ నన్ను అసభ్యంగా తాకేవాడు: యాంకర్ సౌమ్యారావు

    యాంకర్ సౌమ్యారావు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో తాను ఒక లాయర్ దగ్గర టైపిస్ట్‌గా పనిచేసేటప్పుడు, అతను తనపై అసభ్యంగా చేతులు వేసేవాడని ఆమె చెప్పారు. అప్పుల బాధలు భరించలేక తన తల్లి తమను తిరుపతికి తీసుకువచ్చిందని, అప్పుడు బస్టాండ్‌లో పడుకున్నామని, చాలా రోజులు పస్తులు ఉన్నామని తెలిపారు.

  • ఎన్టీఆర్‌ను చూసి భయపడుతున్నారా: అంబటి

    AP: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, హీరో ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల ఆడియో వైరల్ కావడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. “చిన్న ఎన్టీఆర్‌ను చూసి పెద బాబు, చిన్న బాబు భయపడుతున్నారా?” అంటూ చంద్రబాబు, లోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చినా, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • ‘గీతాంజలి’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో చూశారా?

    నాగార్జున కెరీర్‌లో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘గీతాంజలి’ (1989) సినిమాలో హీరోయిన్‌గా నటించిన గిరిజ, చాలా కాలం తర్వాత ఒక టీవీ షోలో కనిపించారు. జగపతి బాబు హోస్ట్ చేసిన ఈ షోలో గిరిజ ఆ సినిమా అనుభవాలను పంచుకున్నారు. నాగార్జునను లెజెండ్‌గా అభివర్ణించిన ఆమె, ఆయన సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ, సౌమ్యుడు అని కొనియాడారు. ఆమె ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • మంచు సోదరుల మధ్య సయోధ్య కుదిరినట్టేనా?

    మంచు సోదరుల మధ్య నెలకొన్న విభేదాలు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ‘సంతోషం’ పురస్కారాల కార్యక్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు, ఆయన కుమారుడు అవార్డులు అందుకున్నారు. ఈ వీడియోను విష్ణు షేర్ చేయగా, దానిపై మనోజ్ స్పందిస్తూ.. విష్ణును ‘అన్న’ అని సంబోధిస్తూ, ఉత్తమ నటుడి అవార్డు పొందడం పట్ల అభినందనలు తెలిపారు. తండ్రి మోహన్ బాబు ఉత్తమ నిర్మాతగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.(వీడియో)

  • ఆ సినిమాలో నేనొక బొమ్మలా ఉన్నా: నాగార్జున

    ఓ టాక్ షోలో నాగార్జున తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించేందుకు నెల రోజులపాటు ఆయన వెంట పడ్డానని చెప్పారు. అలాగే, తాను నటించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలో దర్శకుడు రాఘవేంద్రరావు, శ్రీదేవి వల్లే విజయం సాధ్యమైందని, ఆ సినిమాలో తాను ఒక బొమ్మలా ఉన్నానని నాగార్జున పేర్కొన్నారు.

  • తమిళ దర్శకులు ఎడ్యుకేట్‌ చేస్తారు: AR మురుగదాస్

    తమిళ అగ్ర దర్శకుల కొత్త సినిమాల పరాజయంపై ఓ ఇంటర్వూలో దర్శకుడు AR మురుగదాస్‌‌ని ప్రశ్నించగా ఆయన స్పందించారు. శంకర్‌ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’, ‘గేమ్‌ ఛేంజర్‌’, మణిరత్నం.. ‘థగ్‌లైఫ్‌’ చిత్రాల ప్రస్తావన రాగా.. ఒకట్రెండు సినిమాలు ఫెయిల్‌ అయినంత మాత్రాన లెజెండ్స్‌పై ప్రభావం పడదన్నారు. రూ.100 కోట్ల సినిమా కలెక్షన్స్‌ దర్శకులు ప్రేక్షకులకు వినోదం మాత్రమే పంచుతారని, తమిళ డైరెక్టర్లు ఎడ్యుకేట్‌ చేస్తారని చెప్పారు.

  • ఓటీటీలోకి క్రేజీ రేసింగ్ సినిమా F1

    హలీవుడ్ నటుడు బ్రాడ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘F1’. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నట్లు మూవీ టీం ప్రకటించింది.

  • రజనీకాంత్‌ను పెద్దన్న అన్న పవన్ కల్యాణ్

    AP: తనకు కృతజ్ఞతలు చెబతూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘ప్రియమైన పెద్దన్న రజనీకాంత్.. మీ ఆప్యాయతతో కూడిన మాటలకు, ఆశీర్వాదాలకు నేను నిజంగా కృతజ్ఞుడను. మీ కీర్తి పెరగాలని, మరిన్ని విజయాలు సాధించాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.