AP: తనకు కృతజ్ఞతలు చెబతూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘ప్రియమైన పెద్దన్న రజనీకాంత్.. మీ ఆప్యాయతతో కూడిన మాటలకు, ఆశీర్వాదాలకు నేను నిజంగా కృతజ్ఞుడను. మీ కీర్తి పెరగాలని, మరిన్ని విజయాలు సాధించాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
NTR-TDP MLA దగ్గుబాటి ఇష్యూ.. రోజా ఏమన్నారంటే
AP: జూనియర్ ఎన్టీఆర్ న్యూ మూవీ వార్-2 అనంతపురంలో అడ్డుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పినట్లు ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై వైసీపీ నాయకురాలు రోజా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండి సినిమాలు చేస్తున్నారని, ఆయన సినిమాలను అడ్డుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరని, దానికి అభిమానులే సాక్ష్యం అన్నారు. రాజకీయాలు, సినిమాలు కలపవద్దని హితవు పలికారు.
-
నందమూరి అభిమానులు లేకుంటే.. టీడీపీ లేదు: NTR ఫ్యాన్స్
AP: Jr.NTRపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దుర్భాషలాడుతున్నట్లు లీకైన ఆడియోపై తీవ్ర దుమారం రేగింది. సదరు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించారు. తమకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నందమూరి ఫ్యాన్స్ లేనిదే టీడీపీ లేదని స్పష్టం చేశారు. తాము కన్నెర్ర చేస్తే టీడీపీ ఉండదని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి తాము కూడా ఓట్లు వేశామని స్పష్టం చేశారు.
-
‘మాస్ జాతర’ విడుదల వాయిదా?
హీరో రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముంది. ఈ నెల 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం అక్టోబర్ 20కి వాయిదా పడుతుందని సమాచారం. సినీ కార్మికుల సమ్మె కారణంగా సినిమా పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు.
-
పని కోరుకునే కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు: సి.కల్యాణ్
HYD: పని కోరుకునే కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దని సినీ నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. ‘‘కార్మిక శాఖ పేర్కొన్న వేతనాల కంటే ఎక్కువ ఇస్తున్నాం. కార్మిక శాఖ నిబంధనల ప్రకారం భోజనాలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నో ఖర్చులు భరిస్తూ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. సినీ కార్మికుల ధర్నా సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం’’ అని సి.కల్యాణ్ తెలిపారు.
-
MLA దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి: NTR ఫ్యాన్స్
AP: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు Jr.NTR ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘NTRకు రాజకీయాలకు సంబంధం లేదు. ఫ్యాన్స్ మధ్యలోకి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం దగ్గుపాటి ఇంటికి ముట్టడిస్తాం’’ అని హెచ్చరించారు. కాగా ఎన్టీఆర్‌ను ఎమ్మెల్యే దుర్భాషలాడినట్లుగా ఉన్న ఆడియో లీకైన విషయం తెలిసిందే.
-
సినిమాల్లో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాలి: లోకేశ్
AP సినిమాలు, సీరియళ్లలో మహిళల పట్ల వివక్షను కట్టడి చేయాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను నియంత్రించాలన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మహిళల పట్ల గౌరవం నిజమైన నాగరిక సమాజానికి పునాది అని తెలిపారు. పిల్లలు చూసే విధంగా సినిమాలు, సీరియళ్లు రూపొందాలన్నారు. ఇంట్లో తెరపై చూసేదే వారు నేర్చుకునే అవకాశముందని వివరించారు.
-
ట్రైలర్ ప్రదర్శిస్తే ఓపెనింగ్స్ రావన్నారు: అనిల్ సుంకర
టీజర్, ట్రైలర్ల ద్వారా ప్రేక్షకుడికి కథ తెలిసినంత మాత్రాన ఏం కాదని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. ఈమేరకు మహేశ్‌బాబు ‘1 నేనొక్కడినే’ మూవీని ఉదాహరణగా చెప్పారు. ‘‘1 నేనొక్కడినే’ సినిమా ట్రైలర్‌ను మేం విడుదల చేయలేదు. ఈ ట్రైలర్ ప్రదర్శిస్తే ఓపెనింగ్స్ రావని ఒకరు చెప్పారు. దీంతో, మేం ప్రదర్శించలేదు. హీరోకు వ్యాధి ఉందన్న విషయం ప్రేక్షకులకు ముందే తెలిస్తే ఇబ్బంది ఉండేది కాదు’’ అని పేర్కొన్నారు.
-
టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్‌ను ముట్టడించిన Jr.NTR ఫ్యాన్స్!
AP: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని Jr.NTR అభిమానులు ముట్టడించారు. నగరంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఎన్టీఆర్‌ను దూషించినట్లుగా ఉన్న ఎమ్మెల్యే ఆడియో లీక్ అయ్యింది. ఈక్రమంలో దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దగ్గపాటి ఆఫీస్‌లో లేరని చెప్పడంతో అక్కడి బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
-
పవన్ ఒక పొలిటికల్ తుఫాన్: రజనీకాంత్
నటుడు రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై అభినందనలు తెలుపుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీనిపై తాజాగా రజనీకాంత్ స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా ప్రియమైన సోదరుడు, పొలిటికల్ తుఫాన్ పవన్ కల్యాణ్ అభినందనలకు నేను ఎంతగానో ఉప్పొందిపోయాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు దేవుడి ఆశీర్వాదం ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు.