Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు ఫిల్మ్‌ ఛాంబర్‌ లేఖ

    కార్మికుల వేతనాల పెంపుపై నాలుగు షరతులతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు ఫిల్మ్‌ ఛాంబర్‌ లేఖరాసింది. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకు కాల్ షీట్‌ను 12రెగ్యులర్ పనిగంటలుగా పరిగణించాలి. రెండో ఆదివారం, కార్మికశాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం. ఫైటర్స్, డాన్సర్స్ కోసం రేషియోలను 2023 సెప్టెంబరు నుంచి అమలు చేయడంలేదు. అది తప్పనిసరిగా ఇవ్వాలి. నైపుణ్యం ఉన్నవారిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉంటుంది.

  • ఒకేసారి రెండు చిత్రాలతో

    నందమూరి బాలకృష్ణ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తానని ఇటీవల తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాల కోసం సిద్ధమవుతున్నారు. ‘అఖండ 2: తాండవం’ తర్వాత గోపీచంద్ మలినేని, క్రిష్ జాగర్లమూడితో కలిసి ఏకకాలంలో రెండు సినిమాలను చేయనున్నారు. గోపీచంద్ చిత్రం మాస్ యాక్షన్ డ్రామా కాగా, క్రిష్ సినిమా ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ఉంటుందని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు నవంబర్ నాటికి సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

  • టాలీవుడ్​లో కొత్త కాంబో ఫిక్స్?

    రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ఫాదర్ క్యారెక్టర్‌ను రవితేజ పోషించనున్నారని సమాచారం.ఈ మూవీని  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించే అవకాశముంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

  • నిర్మాత అనిల్ సుంకర కామెంట్స్ వైరల్

    సినీ నిర్మాత అనిల్ సుంకర చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ‘‘ఓ సినిమా విషయంలో నేను ఐటీ ఆఫీస్‌కు వెళ్లాను. అక్కడి క్లర్క్ నన్ను చూసి.. ‘కథలు విని సినిమాలు చేయొచ్చు కాదా’ అని అన్నారు. అప్పుడు నేను తీసింది రీమెక్ సినిమా అని, అది సరిగ్గా ఆడలేదని చెప్పా’’ అని పేర్కొన్నారు. అయితే చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాను ఉద్దేశించే అనిల్ మాట్లాడారని నెటిజన్లు అంటున్నారు.

  • నెటిజన్ ప్రశ్నకు షారుక్ అదిరిపోయే సమాధానం!

    ట్విట్టర్ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అదిరిపోయే సమాధానమిచ్చారు. ‘‘మీకు జిమ్‌లో జరిగిన గాయాలు ఎక్కవ బాధిస్తాయా? లేక సోషల్ మీడియాలో మీపై వచ్చే ట్రోల్స్ బాధిస్తాయా?’’ అని షారుక్‌ను అడగ్గా.. ‘‘జిమ్‌లోని డంబుల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు నా ఎముకలను విరగ్గొట్టవచ్చు. కానీ మాటలు నన్నెప్పుడూ బాధించవు’’ అని షారుక్ ట్వీట్ చేశారు.

  • ప్రముఖ నటి కన్నుమూత

    ప్రముఖ నటి జ్యోతి చందేకర్(68) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరాఠీ ఇండస్ట్రీ, టెలివిజన్ రంగం, రంగస్థలంలో ఆమె చేసిన సేవలకు ఎన్నో అవార్డులు అందుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.‘ధోల్కీ, ‘తిచా ఉంబర్తా’. ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలు.. ‘ఛత్రీవాలీ’, ‘తూ సౌభాగ్యవతి హో’ వంటి సీరియల్స్ ద్వారా ఆడియన్స్‌ను మెప్పించారు.

  • టాలీవుడ్‌ పంచాయితీ: చిరంజీవి ఫుల్‌ స్టాప్‌ పెట్టనున్నారా?

    సినీ కార్మికుల వేతన పెంపు పంచాయితీ మెగాస్టార్‌ చిరంజీవి ఇంటి వరకు చేరింది. సమస్యలపై చర్చించేందుకు నిర్మాతలు, ఫెడరేషన్‌ నాయకులు నేడు చిరు ఇంట్లో సమావేశం కానున్నారు. ఇరువర్లాల మధ్య చిరు సయోధ్య కుదుర్చుతారో లేదో అనేది ఆసక్తికరంగా మారింది. 30 శాతం వేతనాలు పెంచాలని కార్మికులు పట్టుబడుతుండగా
    షరతులతో కూడిన పెంపునకు నిర్మాతలు ప్రతిపాదనలు చేశారు.

     

  • Video: హీరోయిన్ శ్రుతిహాసన్‌కు ఘోర అవమానం!

    హీరోయిన్ శ్రుతిహాసన్‌ రీసెంట్ ‘కూలీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈనేపథ్యంలో ఆమెకు వింత అనుభవం ఎదురైంది. రిలీజ్ రోజే ‘కూలీ’ మూవీ చూద్దామని చెన్నైలో ఓ థియేటర్‪‪‌కు వెళ్లగా.. అక్కడి సెక్యూరిటీ ఆమె కారును ఆపేశాడు. దీంతో ‘‘నేను సినిమాలో ఉన్నాను. దయచేసి నన్ను లోపలికి అనుమతించండి అన్నా. నేనే హీరోయిన్’’ అంటూ శ్రుతిహాసన్ బతిమలాడుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

  • ‘రావు బహదూర్‌’ కోసం రంగంలోకి రాజమౌళి!

    సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రావు బహదూర్‌’. ఈమూవీ టీజర్‌ను ఈనెల 18న ఉ.11:07గంటలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  • ‘స్టాలిన్‌’ రీ-రిలీజ్‌.. మెగాస్టార్ ఏమన్నారంటే?

    ఈతరం ప్రేక్షకులకు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పిన చిత్రం ‘స్టాలిన్‌’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన హీరో నటించిన చిత్రమిది. నాగబాబు నిర్మించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని 8K వెర్షన్‌లో రీ-రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ‘స్టాలిన్‌’ చిత్రం గురించి మాట్లాడారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని.. ఇది మంచి సందేశాన్ని సమాజానికి అందించిందన్నారు.