Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘రావు బహదూర్‌’ కోసం రంగంలోకి రాజమౌళి!

    సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రావు బహదూర్‌’. ఈమూవీ టీజర్‌ను ఈనెల 18న ఉ.11:07గంటలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  • ‘స్టాలిన్‌’ రీ-రిలీజ్‌.. మెగాస్టార్ ఏమన్నారంటే?

    ఈతరం ప్రేక్షకులకు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పిన చిత్రం ‘స్టాలిన్‌’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన హీరో నటించిన చిత్రమిది. నాగబాబు నిర్మించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని 8K వెర్షన్‌లో రీ-రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ‘స్టాలిన్‌’ చిత్రం గురించి మాట్లాడారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని.. ఇది మంచి సందేశాన్ని సమాజానికి అందించిందన్నారు.

  • గుడ్ న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్!

    టాలీవుడ్ హీరో నితిన్ గుడ్ న్యూస్ చెప్పాడు. తన కొడుకుకు ‘అవ్యుక్త్’ అని పేరు పెట్టినట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కానీ బాబు ఫొటోలను మాత్రం షేర్ చేయలేదు. దాదాపు 11నెలల తర్వాత తన బాబుకు పేరు పెట్టడం విశేషం. దీంతో పేరు సూపర్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా నితిన్-షాలిని జంటకు 2020లో పెళ్లి కాగా.. సెప్టెంబర్ 6న తల్లిదండ్రులైయ్యారు.

  • సూర్య ‘కరుప్పు’ వచ్చేది అప్పుడే!

    ఆర్జే బాలాజీ దర్శకత్వంలో హీరో సూర్య నటిస్తున్న చిత్రం ‘కరుప్పు’ ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈమూవీ ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదల కాబోతున్నట్లు టాక్ విపిస్తోంది.

  • ‘కూలీ’, ‘వార్2’ థియేటర్లలో ‘రావు బహదూర్‌’ సర్‌ప్రైజ్!

    సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్‌ సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటైర్టెన్మెంట్స్‌ సమర్పణలో ‘రావు బహదూర్‌’ పేరుతో ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ రానుంది. సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్‌ మహా దర్శకుడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈమూవీ టీజర్‌ను ‘కూలీ’, ‘వార్2’ థియేటర్లలో ప్రదర్శిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు థియేటర్ల జాబితాను సోషల్ మీడియో వేదికగా పోస్ట్ చేశారు.

  • రెండో పెళ్లిపై మలైకా సంచలన కామెంట్స్!

    బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసింది. ‘‘నేను విడాకులు తీసుకోవాలని అనుకోలేదు. కలిసి ఉండాలనే అనుకున్నా.. కానీ అలా జరగలేదు. నేను ఆనందంగా ఉండాలని వివాహబంధం నుంచి బయటకు వచ్చాను. ప్రేమ గురించి అన్ని విషయాలను నేను నమ్ముతాను. కాబట్టి మంచి వ్యక్తి దొరికితే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది.

  • ‘‘బాహుబలి’.. ‘బార్బరిక్‌’కు ఒకే పారితోషికం కాదు’

    ప్రముఖ నటుడు సత్యరాజ్‌ తన రెమ్యునరేషన్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘తొలినాళ్లలో 100కు పైగా చిత్రాల్లో హీరోగా చేశా. చాలా సమయాల్లో పారితోషికాలను వదులుకున్నా. ఇప్పుడు నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తున్నా. రెమ్యునరేషన్‌ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాలి?.. సినిమా బడ్జెట్‌, నా పాత్ర నిడివిని బట్టి పారితోషికం ఉంటుంది. అప్పుడు ‘బాహుబలి’కి ఇప్పుడు ‘బార్బరిక్‌’కు ఒకే పారితోషికం తీసుకోలేను కదా’’ అని అన్నారు.

  • నాపై దుష్ప్రచారం చేశారు: నటి ఉదయభాను

    తాను యాంకర్‌గా ఉన్న సమయంలో ఎంతోమంది పారితోషికాలు ఇవ్వకుండా ఎగవేశారని, అడిగితే, తనపై దుష్ప్రచారం చేశారని నటి ఉదయభాను ఆరోపించింది. వివిధ షోలకు యాంకర్‌గా చేసిన చెక్‌లు బౌన్స్‌ అవ్వగా.. ఇప్పటికీ అవి తన దగ్గర ఉన్నట్లు వెల్లడించింది. వాటితో ఇంటికి తోరణాలు కట్టవచ్చని సరదాగా వ్యాఖ్యానించింది. కాస్త గట్టిగా డబ్బులు అడిగితే, ‘ఉద‌య‌భాను పీడించి గోల చేస్తుంది’ అంటూ ప్రచారం చేసేవారని ఉదయభాను తెలిపింది.

  • ‘దేవర-2’ ఇక లేనట్లే?

    కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘దేవర’కు సీక్వెల్ ఇక లేనట్లేనని తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌తో డ్రాగన్‌, త్రివిక్రమ్‌‌తో ఓ మూవీ తీసేందుకు తారక్ కమిట్‌ అయ్యారని, దీంతో ‘దేవర-2’ పట్టాలెక్కడం కష్టమేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మూవీ రద్దు విషయమై హీరో, దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరిగాయట. మరి దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సివుంది.

  • ‘ఇడ్లీ కడై’.. ధనుష్‌కు చెల్లిగా యంగ్ బ్యూటీ!

    ధనుష్-నిత్యామీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అరుణ్ విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో యంగ్ బ్యూటీ శాలిని పాండే ధనుష్ చెల్లి పాత్రలో.. అరున్ విజయ్‌ సరసన నటిస్తున్నట్లు పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.