Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • స్టార్ హీరో డైరెక్షన్‌లో కంగనా మూవీ.. ఆసక్తిగా టైటిల్!

    హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటడు ఆర్.మాధవన్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘లైట్’. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

  • ‘అది రజనీకాంత్‌ నుంచి నేర్చుకున్నా’

    నటుడు ఆర్‌.మాధవన్‌ ఇటీవలే ‘ఆప్‌ జైసా కోయి’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఈనేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘పాత్రకు అవసరమైతే తప్ప నేను ఎప్పుడూ జుట్టుకు రంగు వేయలేదు. ఆఫ్‌స్క్రీన్‌ ఇమేజ్‌ గురించి బాధపడను. దీన్ని నేను రజనీకాంత్‌ నుంచి నేర్చుకున్నా. నాలా నేను చాలా సౌకర్యంగా ఉన్నా. వేరే వాళ్ల కన్నా చిన్నవాడినని చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు.

  • రవితేజ ‘మాస్ జాతర’ వాయిదా?

    రవితేజ-శ్రీలీల జంటగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 27న రిలీజ్‌కానుండగా.. వాయిదా పడినట్లు ఓ బజ్ వినిపిస్తోంది. దీనికి కారణం గత కొన్నిరోజులుగా నాగవంశీకి వరుస నష్టాలు రావడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బయ్యర్లు కూడా అతని రాబోయే చిత్రాలను కొనడానికి ఇష్టపడటం లేదట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

     

  • ‘OG’ నుంచి ప్రియాంక మోహన్‌ లుక్‌ రిలీజ్

    పవన్‌కల్యాణ్-ప్రియాంక మోహన్‌ జంటగా సుజీత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘OG’. ఇందులో ‘కణ్మని’ పాత్రలో ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

  • వారిపై RGV ఆగ్రహం.. ఎందుకంటే?

    ఢిల్లీలో వీధి కుక్కల తొలగింపుపై డాగ్‌ లవర్స్‌ పెద్దఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘సుప్రీం ఆదేశాలతో కుక్కలకు జరిగిన అన్యాయంపై అరుస్తున్న ఈ నోళ్లు నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు పీక్కొని తిన్నప్పుడు ఎక్కడున్నాయి. ఏటా వేలాదిమంది దాడికి గురవుతుంటే తోకలు ఊపుతున్న వాటిపైనే మీరు కరుణ చూపుతారా?’’ అని పోస్ట్ చూశారు.

     

  • ఖరీదైన కారు కొన్న ‘కూలీ’ స్టార్.. ధర ఎంతంటే?

    మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ రీసెంట్‌గా ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా ఆయన ఖరీదైన బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు విలువ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.3.30 కోట్లు వరకు ఉంది. తన కుటుంబంతో కలిసి సౌబిన్.. కారులో షికారుకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • ‘కూలీ’ రెమ్యునరేషన్‌పై ఆమిర్‌ ఖాన్‌ క్లారిటీ!

    రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాలో ఆమిర్‌‌ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించారు. ఈమూవీ కోసం ఆమిర్‌ ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆమిర్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సినిమా కోసం తాను రూపాయి కూడా తీసుకోలేదని.. రజనీతో స్క్రీన్‌ పంచుకోవడమే తనకు కోట్ల రూపాయలతో సమానమన్నారు. దానికి మించిన విలువైనదేదీ ఉండదన్నారు.

  • ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి: పవన్‌

    సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజనీకాంత్ మరిన్ని విభిన్న పాత్రలతో సినీప్రియులను మెప్పించాలని ఆకాంక్షించారు. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని.. ప్రతినాయకుడి పాత్ర పోషించినా, కథానాయకుడిగా మెప్పించినా తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారని పవన్ పేర్కొన్నారు.

  • ‘వార్‌-2’పై హిట్ టాక్.. ఎన్టీఆర్ ఏమన్నారంటే?

    ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్‌ ముఖర్జి తెరకెక్కించిన ‘వార్‌-2’ ఇటీవలే విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఎన్టీఆర్‌ స్పందించారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘మేము చాలా ప్యాషన్‌తో తీసిన సినిమాకు ప్రజల నుంచి వస్తోన్న మద్దతు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’’ అని ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

  • ‘OG’ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది!

    పవన్‌కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘OG’. ప్రియాంక మోహన్ హీరోయిన్. ఈమూవీ నుంచి మరోసాంగ్ రాబోతున్నట్లు సమాచారం. ఈరోజు సా.4:05 గంటలకు ‘కన్మణి’ అంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. అయితే నెక్స్ట్ వచ్చే పాట హీరో హీరోయిన్ పైనే అని తెలుస్తోంది. ఇక ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.