Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి: పవన్‌

    సూపర్‌స్టార్ రజనీకాంత్‌ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజనీకాంత్ మరిన్ని విభిన్న పాత్రలతో సినీప్రియులను మెప్పించాలని ఆకాంక్షించారు. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని.. ప్రతినాయకుడి పాత్ర పోషించినా, కథానాయకుడిగా మెప్పించినా తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారని పవన్ పేర్కొన్నారు.

  • ‘వార్‌-2’పై హిట్ టాక్.. ఎన్టీఆర్ ఏమన్నారంటే?

    ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్‌ ముఖర్జి తెరకెక్కించిన ‘వార్‌-2’ ఇటీవలే విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఎన్టీఆర్‌ స్పందించారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘మేము చాలా ప్యాషన్‌తో తీసిన సినిమాకు ప్రజల నుంచి వస్తోన్న మద్దతు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’’ అని ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

  • ‘OG’ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది!

    పవన్‌కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘OG’. ప్రియాంక మోహన్ హీరోయిన్. ఈమూవీ నుంచి మరోసాంగ్ రాబోతున్నట్లు సమాచారం. ఈరోజు సా.4:05 గంటలకు ‘కన్మణి’ అంటూ మేకర్స్ హింట్ ఇచ్చారు. అయితే నెక్స్ట్ వచ్చే పాట హీరో హీరోయిన్ పైనే అని తెలుస్తోంది. ఇక ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  • రణ్‌బీర్ ‘రామాయణ’.. ఆసక్తిక విషయం చెప్పిన సన్నీ దేవోల్‌

    నితేశ్‌ తివారీ డైరెక్షన్‌లో ‘రామాయణ’ మూవీ రూపొందుతోంది. ఇందులో హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్‌ కనిపించనున్నారు. దీనిపై తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో అప్‌డేట్‌ను పంచుకున్నారు. ‘‘హనుమంతుడి పాత్ర పోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా పాత్ర చిత్రీకరణ ఇంకా ప్రారంభించలేదు. త్వరలోనే షూటింగ్‌ చేయనున్నారు. నాకు ఎంత ఆసక్తి ఉందో అంత భయం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి పాత్రలు సవాలుగా ఉంటాయి’’ అని చెప్పారు.

     

  • నాకు అవార్డులతో అవసరం లేదు: నటుడు మాధవన్‌

    నటుడు ఆర్‌.మాధవన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ‘‘40ఏళ్లుగా చిత్రీసీమలో రాణిస్తున్నా.. ఎలాంటి గుర్తింపు, అవార్డులు రాలేదని అందరూ అనుకుంటున్నారేమో. కానీ నాకు అవార్డులతో అవసరం లేదు. దిలీప్‌ కుమార్‌ లాంటి గొప్ప వ్యక్తికే జాతీయ అవార్డు రాలేదు. ఇక్కడ అవార్డులు కాదు.. ప్రేక్షకుల్ని అలరించడమే ముఖ్యం. ఇన్నేళ్లు గడిచినా మంచి పాత్రల్ని దక్కించుకుంటున్నాను. నాకు ఇదిచాలు’’ అని వెల్లడించారు.

  • ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’ ట్రైలర్‌ రిలీజ్

    దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’. మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, పల్లవి జోషి, దర్శన్‌ కుమార్‌ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. బెంగాల్‌లో ప్రజలు ఎదుర్కొన్న నాటి సమస్యలను దర్శకుడు ఉత్కంఠ కలిగేలా చూపించారు.  సెప్టెంబర్‌ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

     

  • ఎంపీలకూ నెలసరి బాధలు: కంగనా

    నెలసరి సమయంలో ఉండే బాధ, ఇబ్బందులు సామాన్య మహిళలకే కాదు.. సెలబ్రిటీలకు తప్పవన్నారు నటి, ఎంపీ కంగనా రనౌత్‌. వారు కూడా ఈ సమస్యలకు అతీతం కాదన్నారు. ‘‘నియోజకవర్గ పర్యటనలో భాగంగా రోజుకు 12 గంటలు ప్రయాణించాల్సి వస్తుంది. కనీసం టాయిలెట్‌కు వెళ్లడానికీ ఉండదు. ఇతర ఎంపీలకూ ఇదే సమస్య ఉంది. అందరూ అనుకునేంత చిన్న ఇబ్బందికాదిది. పెద్ద విపత్తుతో పోల్చొచ్చు’’ అని తెలిపారు.

  • అప్పుడే ఏడేళ్లు.. నమ్మలేకపోతున్నానంటూ రష్మిక పోస్ట్‌

    రష్మిక, విజయ్‌ దేవరకొండ కలిసి నటింటిన తొలి చిత్రం గీత గోవిందం. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018లో విడుదలై భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.  ఈ చిత్రం విడుదలైన నిన్నటికి(ఆగస్ట్‌ 15) ఏడేళ్లు పూర్తయ్యాయి.  తన కెరీర్‌లో ‘గీత గోవిందం’ చాలా స్పెషల్‌ మూవీ అంటూ విజయ్‌తో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. విజయ్‌, రష్మిక ప్రేమలో ఉన్నారని కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

  • రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన ‘కూలీ’

    సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆగస్టు 14న సినిమా విడుదల కాగా, కేవలం రెండు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.  రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.220 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపాయి. త్వరలోనే ఈ మూవీ కలెక్షన్లపై మేకర్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

     

  • చీర అందాలతో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

    తెలుగు నటి అనన్య నాగళ్ల హాట్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ వైట్ శారీ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.