Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘మీ మాటలు నా మనసును తాకాయి’

    నటుడిగా రజనీకాంత్‌ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు ట్విట్టర్(X) వేదికగా  శుభాకాంక్షలు తెలిపారు.  దీనిపై రజనీకాంత్ స్పందిస్తూ..‘‘మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. మీ అభినందనలు నాకు ఆనందాన్నిచ్చాయి. ఈ శుభాకాంక్షలు నాలో స్ఫూర్తి నింపాయి. మీ లాంటి వ్యక్తుల ప్రేమ, స్నేహంతో నేను సినిమా పరిశ్రమలో ఉత్తమంగా రాణించడానికి కృషిచేస్తాను’’ అంటూ చంద్రబాబుకు రజనీకాంత్‌ థాంక్స్ చెప్పారు.

     

     

  • నేడు ఫిల్మ్ ఛాంబర్లో మరో దఫా చర్చలు

    HYD : టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి శనివారంకి 13 రోజులైంది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరుపనున్నారు. నిర్మాతల కండీషన్స్‌పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్.. జనరల్ కౌన్సిల్‌లో చర్చించిన పిదప కార్మిక నేతలు చర్చల్లో పాల్గొంటున్నారు. అటు, ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు ఈ అంశం మీద వరుస భేటీలు జరుపుతున్నారు.

  • రూ.100 కోట్లు దాటిన ‘వార్-2’ కలెక్షన్లు

    ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్-2’ సినిమా ఆగస్టు 14న విడుదల కాగా, రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నిన్న మూవీకి రూ.56.35 కోట్లు రాగా తొలిరోజు రూ.52 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తంగా ఈ మూవీ రూ. 108.35 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు కూడా కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.

     

     

  • ‘కూలీ’పై పైచేయి సాధించిన ‘వార్ 2’

    బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’, ‘వార్ 2’ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండింటిలో ఏ చిత్రమూ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే, విడుదల ముందు వరకు కూలీ అదరగొడితే విడుదల తర్వాత మాత్రం వార్-2 డామినేట్ చేస్తోంది. ఇలా గత 24 గంటల్లో బుక్‌మై షోలో ‘కూలీ’ చిత్రానికి 6.89 లక్షలకుపైగా టికెట్స్ అమ్ముడు పోతే ‘వార్ 2’కు మాత్రం ఏకంగా 7.45 లక్షలకుపైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. దీంతో రెండో రోజు ‘వార్ 2’దే డామినేషన్ అని చెప్పాలి.

  • అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

    బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ వయసు 57  దాటినా 20 ఏళ్ల యువకుడిలా కనిపిస్తాడు. అయితే, తన ఫిట్‌నెస్‌‌కు  క్రమశిక్షణే కారణమని చెప్పాడు. ఉదయం ఐదు గంటలకే నిద్ర లేవడం, రాత్రి తొమ్మిది గంటల లోపు పడుకోవడం, వ్యాయామం, సహజసిద్ధమైన ఆహారం తీసుకోవడం, ప్రొటీన్ పౌడర్లు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటమే తన ఫిట్‌నెస్‌ రహస్యమని తెలిపాడు. ఈ నియమాలు 35 ఏళ్లుగా పాటిస్తున్నానని చెప్పారు.

     

  • పింక్ శారీలో అదిరిపోయిన జాన్వీకపూర్

    బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శారీ పిక్స్‌ను SMలో షేర్ చేసింది. పింక్ కలర్ శారీలో ఉన్న ఆమె లుక్స్ కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి.

  • కిడ్నీ దానం.. నటి భర్తపై ట్రోలింగ్

    ప్రేమానంద్ స్వామీజీకి కిడ్నీ దానం చేస్తానని ప్రముఖ బాలీవుడ్ నటి భర్త రాజ్‌ కుంద్రా ప్రకటించారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇది PR స్టంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ విమర్శలను రాజ్ కుంద్రా ఖండించారు. ‘మానవత్వాన్ని బతకనివ్వండి’ అంటూ పోస్ట్ చేశారు. శిల్పా శెట్టి భర్తగా రాజ్‌ కుంద్రా తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • ఉదయం 5గంటలకు పడుకుని 9కి నిద్రలేస్తా: షారుఖ్‌ ఖాన్‌

    నటుడు షారుఖ్‌ ఖాన్‌ ఇటీవలే తన ఫిట్‌నెస్‌ అలవాట్లు, తన దినచర్య గురించి మీడియాతో పంచుకున్నాడు. “రోజూ అర్దరాత్రి దాటాక 2 గంటలకు పని ముగించుకుని ఇంటికొస్తా. ఆ టైమ్‌లోనే వ్యాయామం చేస్తా. స్నానం చేసి నేను పడుకునేసరికి తెల్లవారుజామున 5 అవుతుంది. మళ్లీ ఉదయం 9 లేదా 10 గంటలకు మేల్కొంటా,” అని షారుఖ్‌ చెప్పారు. తందూరీ చికెన్‌ అంటే చాలా ఇష్టమని చెప్పారు.

  • Video: ‘మహావతార్‌ నరసింహ’పై చాగంటి కీలక వ్యాఖ్యలు

    ఎవరూ ఊహించని రీతిలో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబడుతున్న యానిమేషన్‌ మూవీ ‘మహావతార్‌ నరసింహ’. ఆధ్యాత్మికత మార్గంలో యావత్‌ ప్రపంచాన్నే నడిపించే చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్‌తో పాటుగా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పురాణాలకు చాలా దగ్గరగానే ‘మహావతార్‌ నరసింహ’ చిత్రం ఉందని చాగంటి అన్నారు. (వీడియో)

  • ‘మెగా 157’పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్!

    మెగాస్టార్ చిరంజీవి-అనీల్ రావిపూడి కాంబోలో ‘మెగా 157’ మూవీ రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘‘‘Mega157 షూటింగ్ దాదాపు 30 రోజులు పూర్తి చేశాము. మొదటి సగం పూర్తి కావడానికి ఒక సన్నివేశం మాత్రమే మిగిలి ఉంది. సమ్మె మా మొత్తం షెడ్యూల్‌ను ప్రభావితం చేసింది. లేకపోతే మేము రెండవ భాగంలో రెండు సన్నివేశాలను పూర్తి చేయగలిగేవాళ్ళం’’ అని తెలిపారు.