Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • Video: ‘మహావతార్‌ నరసింహ’పై చాగంటి కీలక వ్యాఖ్యలు

    ఎవరూ ఊహించని రీతిలో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబడుతున్న యానిమేషన్‌ మూవీ ‘మహావతార్‌ నరసింహ’. ఆధ్యాత్మికత మార్గంలో యావత్‌ ప్రపంచాన్నే నడిపించే చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్‌తో పాటుగా చూశారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పురాణాలకు చాలా దగ్గరగానే ‘మహావతార్‌ నరసింహ’ చిత్రం ఉందని చాగంటి అన్నారు. (వీడియో)

  • ‘మెగా 157’పై ఇంట్రస్టింగ్ అప్‌డేట్!

    మెగాస్టార్ చిరంజీవి-అనీల్ రావిపూడి కాంబోలో ‘మెగా 157’ మూవీ రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘‘‘Mega157 షూటింగ్ దాదాపు 30 రోజులు పూర్తి చేశాము. మొదటి సగం పూర్తి కావడానికి ఒక సన్నివేశం మాత్రమే మిగిలి ఉంది. సమ్మె మా మొత్తం షెడ్యూల్‌ను ప్రభావితం చేసింది. లేకపోతే మేము రెండవ భాగంలో రెండు సన్నివేశాలను పూర్తి చేయగలిగేవాళ్ళం’’ అని తెలిపారు.

  • సూపర్‌స్టార్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విభిన్న పాత్రలతో తరాలను ఆకట్టుకున్నారని.. ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని మోదీ ఆకాంక్షించారు. ఈమేరకు ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక రజనీ నటించిన కూలీ మూవీ నిన్న విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

  • ఖరీదైన ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్.. ఎన్ని కోట్లంటే?

    బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని బాంద్రా వెస్ట్‌లోని పాలిహిల్ ప్రాంతంలో డ్యూప్లెక్స్ పెంట్‌హౌస్‌ను కొనేసిందట. ఈ లగ్జరీ ఫ్లాట్‌ కోసం రూ.84.16 కోట్లకు పైగా చెల్లించినట్లు సమాచారం. ఈ ఖరీదైన బాంద్రా వెస్ట్‌ ప్రాంతంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాసముంటున్నారు.

  • హాట్ లుక్‌లో బాలీవుడ్ బ్యూటీ.. పిక్ వైరల్!

    బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా పతేహి తన లేటెస్ట్ ఫోటోలో స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  • ఆ సంస్థకే ‘లోకా’ థియేట్రికల్ రైట్స్

    మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ‘లోకా:చాప్టర్ వన్ చంద్రా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నస్లెన్, సాండి కీలక పాత్రలో నటిస్తున్నారు. డొమినిక్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓనమ్ పండుగకు విడుదలకానుంది. ఈ మూవీకి సంబంధించిన తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ AGS Cinimas కొనుగోలు చేసినట్లు మేకర్స్ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

  • సినిమా ఇండస్ట్రీపై కంగనా సంచలన కామెంట్స్!

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘సినిమా పరిశ్రమ ఒక డర్టీ ప్లేస్. అందులో నుంచి వచ్చిన వాళ్లకు మాత్రమే అది ఉపయోగపడుతుంది కానీ, సాధారణ వ్యక్తుల పట్ల అది దయ లేకుండా ప్రవర్తిస్తుంది. అందుకే ఇండస్ట్రీ ఒక మురికి ప్రదేశంగా నేను భావిస్తాను’’ అంటూ తెలిపింది. (వీడియో)

  • ‘అప్పుడు నిజంగానే పోయాననుకున్నాను’

    నటుడు జగపతి బాబు తాజాగా సోషల్‌‌మీడియాలో వచ్చే కామెంట్లు, ప్రశ్నలపై స్పందిస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘నా పేరు జగపతి రావు ఇండస్ట్రీలో రావులెక్కువైపోయారని నా పేరును జగపతిబాబుగా మార్చేశారు. ‘అంతఃపురం’ సినిమా చివరి సీన్‌లో నేను దాదాపు చచ్చిపోయాననుకున్నాను. డైరెక్టర్‌ కృష్ణవంశీ సీన్‌లో లీనమైపోయి కట్‌ చెప్పలేకపోయాడు. నిజంగానే పోయాననుకున్నాను. నా కెరీర్‌‌లో ‘అంతఃపురం’ క్లైమాక్సే ఫేవరెట్‌ షాట్‌’’ అని చెప్పుకొచ్చారు.

  • ‘SSMB29’ సెట్స్ నుంచి మరో పిక్ లీక్.. వైరల్!

    రాజ‌మౌళి-మ‌హేశ్ బాబు కాంబోలో ‘SSMB29’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ మూవీ సెట్స్ నుంచి తాజాగా ఒక ఫొటో బ‌య‌ట‌కి వ‌చ్చింది. మహేశ్ బాబుతో పాటు ప్రియాంక‌చోప్రా క‌లిసి దిగిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

  • ‘డియర్ స్టూడెంట్స్’ టీజర్‌.. నయన్ యాక్షన్ షురూ!

    మలయాళ నటుడు నివిన్ పౌలీ హీరోగా చేస్తున్న చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’. ఈ మూవీలో హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను జార్జ్‌‌‌‌ పిలిప్ రాయ్‌‌‌‌, సందీప్‌‌‌‌ కుమార్‌ సంయుక్తంగా‌‌‌ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.