రష్మిక మందన్నా-అయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘థమా’. ఈ సినిమాకు ‘ముంజ్యా’ డైరెక్టర్ ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన టీజర్ ఆగస్టు 19న విడుదల కాబోతున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ దీపావళి 2025 సినిమా థియేటర్లలోకి దూసుకుపోతుంది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘అమ్మ’ అధ్యక్షురాలిగా నటి శ్వేతా మేనన్
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళా నటిగా శ్వేతా మేనన్ చరిత్ర సృష్టించారు. కొచ్చిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆమె నటుడు దేవన్ ప్యానల్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కుక్కు పరమేశ్వరన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. శ్వేతా మేనన్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదైనప్పటికీ, ఆమె ఈ పదవిని సాధించడం సంచలనంగా మారింది.
-
ఎన్టీఆర్ నటించిన సీరియల్ పేరేంటో తెలుసా?
హీరో ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తారక్ తన కెరీర్ ప్రారంభంలో ఓ టీవీ సీరియల్‌లో కూడా నటించాడట. ఈటీవీ ప్రారంభ దశలో ప్రసారమైన ‘భక్త మార్కండేయ’ అనే సీరియల్‌లో ఆయన మార్కండేయుడి పాత్ర పోషించాడు. ఈ పాత్రలో ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకట్టుకున్నాడు. ఈ సీరియల్ కొద్ది రోజులే ప్రసారమైనా, ఎన్టీఆర్ లుక్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ అప్పుడే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కించిన చిత్రం ‘విశ్వంభర’. ఎప్పుడు నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్‌కు రంగం సిద్ధమైంది. మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈనెల 22న టీజర్ విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ రోజున ‘విశ్వంభర’ టీజర్‌తో మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్ రానుంది. అలాగే టీజర్‌తోనే మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారేమో చూడాలి.
-
ప్రభాస్ నుంచి అది దొంగతనం చేస్తా: శృతిహాసన్
హీరోయిన్ శృతిహాసన్ ఇటీవల ఓ ఈవెంట్‌లో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ప్రభాస్ నుంచి ఏదైన దొంగతనం చేయగలిగే అవకాశం వస్తే ఏం చేస్తారని సుమ ప్రశ్నించగా.. ‘‘దొంగతనం చేయాల్సి వస్తే.. ప్రభాస్ వంట మనిషిని ఎత్తుకు వచ్చేస్తా’’ అని శృతి సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-
పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్ పెళ్లి పీటలెక్కాడు. బ్యాచిలర్ లైఫ్‌కు బై చెబుతూ భావన అనే అమ్మాయితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ శుభవార్తను అతనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన పెళ్లి ఫొటోలను పోస్ట్ చేయగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (ఫొటోలు)
-
Video: జాన్వీకపూర్‌పై మలయాళ నటి ఆగ్రహం
జాన్వీకపూర్-సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా రాబోతున్న మూవీ ‘పరమ్ సుందరి’. ఈ సినిమా ట్రైలర్‌పై మలయాళ నటి పవిత్రమీనన్ ఫైర్ అయింది. కేరళ నేపథ్యంలో తెరకెక్కించే సినిమాల్లో మలయాళ నటులను తీసుకోవాలని హెచ్చిరించింది. ‘‘నేను ‘పరమ్ సుందరి’ ట్రైలర్ చూశాను. జాన్వీ అంటే నాకు ద్వేషం లేదు. కానీ ఆమె అంత కష్టంగా మలయాళ భాషను ప్రయత్నించడం ఎందుకోనాకు అర్థం కావడంలేదు’’ అని చెప్పుకొచ్చింది.(వీడియో)
-
‘బోర్డర్-2’ రిలీజ్ డేట్ లాక్
బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘బోర్డర్-2’. ఈ సినిమా 2026 జనవరి 22న విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా ప్రకటించింది.
-
థ్రిల్ చేసే ‘కిష్కింధపురి’ టీజర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబరు 12న విడుదల కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ టీజర్‌ను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది.
-
చిత్ర పరిశ్రమలో తొలిసారి.. యుద్ధవీరుడిగా శ్రీ కృష్ణుడు!
అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ముకుంద్ పాండే దర్శకత్వంలో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇది.