Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • చిత్ర పరిశ్రమలో తొలిసారి.. యుద్ధవీరుడిగా శ్రీ కృష్ణుడు!

    అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ముకుంద్ పాండే దర్శకత్వంలో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇది.

  • ‘ది బెంగాల్ ఫైల్స్’ బోల్డెస్ట్ ట్రైలర్.. ఆసక్తిగా పోస్టర్‌!

    వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’. 1940లలో అవిభక్త బెంగాల్‌లో జరిగిన మత హింసను ఆధారంగా చేసుకుని ఈ మూవీ తెరకెక్కనుంది. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, గోవింద్ నామ్‌దేవ్, పల్లవి జోషి కీలకపాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు. బొల్డెస్ట్ ట్రైలర్ రేపు మధ్యాహ్నం 12గంటలకు రాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్‌ వదిలారు.

  • ‘జీవితం చాలా చిన్నది’.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

    యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. అందులో వైట్ కలర్ డ్రెస్సులో కొన్ని క్యూట్ స్టిల్స్ పంచుకుంది. టేబుల్‌పై పడుకొని పొజులు ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్‌కు.. ‘పిజ్జా ఆర్డర్ చేయకుండా ఉండటానికి జీవితం చాలా చిన్నది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

  • ‘వార్2’.. డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

    హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ‘వార్2’. నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే.. వరల్డ్ వైడ్‌గా రూ.141 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.

  • AIతో నేతాజీ జీవిత చరిత్రపై మూవీ.. ట్రైలర్ రిలీజ్‌

    నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవిత చరిత్రపై భారత స్టార్టప్ కంపెనీ ఏఐ టెక్నాలజీతో ‘Bose-The Mystery Unsolved’ మూవీని తెరకెక్కిస్తోంది. తాజాగా ట్రైలర్‌ను విడుదలైంది. బ్రిటిష్‌ నుంచి స్వాతంత్ర్య సాధనలో రష్యా సాయంకోసం వెళ్తుండగా నేతాజీ విమాన ప్రమాదానికి గురైయ్యారు. అయితే ఆయన నిజంగానే చనిపోయారా? ఆ తర్వాత ఏం జరిగింది? వంటి అంతుచిక్కని అంశాలపై తెరకెక్కుతున్న ఈమూవీ 2026 జనవరి 26న రిలీజ్‌కానుంది.

  • ‘ఈ స్వేచ్ఛ వెనక ఎంతోమంది వీరుల త్యాగాలు ఉన్నాయి’

    దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా తన ఛారిటబుల్‌ ట్రస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి జాతీయజెండా ఎగురవేశారు. ఎక్స్‌ వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి భారతీయుడికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వేచ్ఛ వెనక ఎంతోమంది వీరుల త్యాగాలు ఉన్నాయి. మనమంతా దేశ పురోగతికి తోడ్పడదాం’’ అని చిరంజీవి పేర్కొన్నారు.(వీడియో)

  • స్వామీజీకి కిడ్నీ దానం చేస్తానన్న ప్రముఖ నటి భర్త!

    ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ మహారాజ్‌ స్వామీజీకి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా కిడ్నీ దానం చేస్తానని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ దంపతులు మథురలోని ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయనతో వీరి సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  • ‘కూలీ’ రికార్డు.. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?

    రజనీకాంత్‌   హీరోగా తెరకెక్కిన ‘కూలీ సినిమా రికార్డు నెలకొల్పింది. విడుదల రోజు  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తమిళ్‌ మూవీగా నిలిచింది. బాక్సాఫీసు ముందుకు  ఆగస్టు14న వచ్చిన ఈ సినిమా రూ.151+ కోట్లు (గ్రాస్‌)   కలెక్ట్‌ చేసింది. నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వివరాలు వెల్లడించింది.

     

  • వెంకటేశ్‌-త్రివిక్రమ్ సినిమా ప్రారంభం

    వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఈ రోజే చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

  • మరో వారంలో ఓటీటీలోకి ‘సార్‌ మేడమ్‌’.. ఎక్కడంటే..

    విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్ నటించిన ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. ఈ మూవీ ఆగస్టు 22 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.