Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • బిపాసా బసుకు మృణాల్‌ క్షమాపణలు

    బిపాసా బసు కంటే చాలా అందంగా ఉంటానని మృణాల్‌ ఠాకూర్‌ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. దీంతో మృణాల్‌ను చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో ఆమె స్పందించారు. ‘‘19 ఏళ్ల వయసులో తెలివి తక్కువగా మాట్లాడాను.  అలా మాట్లాడినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను. మనసుతో చూస్తే ప్రతి దానిలోనూ సౌందర్యం ఉంటుంది’’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

     

  • ఫొటోగ్రాఫర్లపై అలియా అసహనం

    ఫోటోగ్రాఫర్ల తీరుపై ప్రముఖ నటి ఆలియా భట్ మండిపడ్డారు. గురువారం పికిల్‌ బాల్‌ గేమ్‌ ఆడి ఇంటికి వచ్చిన అలియా.. అక్కడ ఫొటోగ్రాఫర్లను చూసి అసహనానికి గురయ్యారు. వారంతా ఆమె ఇంటి ఆవరణలోకి ప్రవేశించి ఫొటోలు తీయడాన్ని గమనించిన ఆలియా ‘లోపలికి రాకండి.. ఇదేం మీ ఇల్లు కాదు. దయచేసి బయటకు వెళ్లండి’ అని కోరారు. ఈ వీడియోపై నెటిజన్‌లు కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. (VIDEO)

  • 12వ రోజుకు చేరిన టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె

    HYD : టాలీవుడ్‌లో 12వ రోజు శుక్రవారం షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఫెడరేషన్ , ఫిల్మ్‌ఛాంబర్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. నిన్న నిర్మాతల కండీషన్స్‌పై ఫిల్మ్‌ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్‌లో కార్మిక సంఘాలు చర్చించాయి. మరోవైపు నిన్న ఫిలింఛాంబర్‌లో నిర్మాతలు సమావేశం అయ్యారు. శనివారం సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులను నిర్మాతలు మరోసారి చర్చలకు పిలిచే ఆలోచనలో ఉన్నారు.

  • ముసుగు వేసుకుని థియేటర్‌కు వెళ్లిన నాని!

    కూలీ, వార్2 సినిమాలను వీక్షేందుకు నేచురల్ స్టార్ నాని హైదరాబాద్‌లోని ఏఎంబి థియేటర్‌కు వెళ్లారు. అయితే త‌న‌ని ఎవ‌రూ గుర్తు ప‌ట్టకూడ‌ద‌ని ముఖాన్ని పూర్తిగా క‌వ‌ర్ చేసుకున్నారు. తన కొత్త లుక్‌ను రివీల్ కాకుండా చూసేందుకు ఇలా మాస్క్ ధరించాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. (VIDEO)

  • ప్రముఖ నటి అరెస్ట్

    సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 14 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన కేసులో మలయాళ సినీనటి మిను మునీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2014లో మిను బంధువు కుమార్తె అయిన సరదు బాలికపై అత్యాచారం జరగ్గా.. తాజాగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను సెక్స్ రాకెట్‌కు అమ్మేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించింది. దీంతో మినును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • “వార్‌ 2′ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే?

    వార్‌ 2 సినిమా తొలిరోజు బాగానే కలెక్షన్స్‌ వసూలు చేసింది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ ను భారీ ధరకు నెట్‌ ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అక్టోబర్‌ మొదటి వారం లేదా 2వ వారంలో ఓటీటీ రూపంలో ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

  • సినిమాను ‘వెండి తెర’గా ఎందుకు పిలుస్తారంటే?

    మూకీ సినిమాలు తీసే రోజుల్లో, ప్రొజెక్టర్‌ వెలుగులో దృశ్యాలు మెరుగ్గా కనిపించడం కోసం సినిమా తెరలకు వెండి పూత పూసేవారు. ఈ కారణంగానే ‘వెండితెర’ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఇది కేవలం ఒక తెరను సూచించే పదం మాత్రమే కాదు, కాలక్రమేణా సినిమా పరిశ్రమకు ఉపయోగించడం ప్రారంభమైంది. ఇది సినిమాను చూసే అనుభవంతో ముడిపడిన ఒక భావనగా స్థిరపడింది.

     

     

  • టాలీవుడ్‌లో ఎవరి కుంపటి వారిదే: అల్లు అరవింద్‌ వ్యాఖ్యలు

    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించకపోవడంపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘సైమా’ బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ..  ‘‘జాతీయ పురస్కారాల్లో తెలుగుసినిమాలకు ఏడు అవార్డులొచ్చాయి. ‘సైమా’ స్పందించి, జాతీయ అవార్డు విజేతలను సత్కరించడం అభినందనీయం. జాతీయ అవార్డులను ఒక పండుగగా జరుపుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.

  • పాలసీతోనే సినీ సమస్యలకు చెక్‌

    తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికుల సమ్మెతో షూటింగ్‌లు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ షూటింగ్ హబ్‌గా మార్చడానికి, స్థానిక కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విధానం సబ్సిడీలు, సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేసి పైరసీ, టికెట్ ధరల సమస్యలను కూడా పరిష్కరించనుంది.

  • ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిన ‘కూలీ’ సినిమా

    ఓవర్సీస్‌ వసూళ్లలో ‘కూలీ’ సినిమా ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించింది. నార్త్‌ అమెరికాలో ప్రీమియర్‌ షోల ద్వారా అత్యధిక గ్రాస్‌ వసూళ్లు ($3,042,756= ₹24.2607) సాధించిన తమిళ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ప్రత్యంగిరా సినిమాస్‌ ప్రకటించింది.  ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.