Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘డియర్ స్టూడెంట్స్’ టీజర్ డేట్ ఫిక్స్

    నయనతార, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డియర్ స్టూడెంట్స్’. నూతన దర్శకుడు సందీప్ కుమార్‌తో కలిసి జార్జ్ ఫిలిప్ రాయ్ తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఓ నోట్ బుక్ పిక్ షేర్ చేస్తూ ‘డియర్ స్టూడెంట్స్’ అఫీషియల్ టీజర్ ఆగస్టు 15న సా.5గంటలకు రాబోతున్నట్లు ప్రకటించారు.

  • భయపెట్టేందుకు వస్తోన్న ‘ది కంజురింగ్’!

    దర్శకుడు మైఖేల్ చావెస్ తెరకెక్కించిన హాలీవుడ్ చిత్రం ‘ది కంజురింగ్’. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

  • ‘కూలీ’ థియేటర్‌లో ‘శివ’4K ట్రైలర్‌.. ఫ్యాన్స్ రచ్చ!

    నాగార్జున-రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో 1989లో విడుదలైన ట్రెండ్‌సెట్టర్ మూవీ ‘శివ’. ఈ సినిమాను 4K టెక్నాలజీ, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈరోజు విడుదలైన ‘కూలీ’ మూవీ థియేటర్‌లో.. శివ 4K ట్రైలర్ వేయగా అభిమానులు ఉత్సాహంతో సందడి చేశారు. డైరెక్టర్ ఆర్జీవీ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

     

  • దడపుట్టిస్తున్న హారర్ థ్రిల్లర్.. ‘జారన్’

    చేతబడి నేపథ్యంలో రూపొందిన మరాఠీ సినిమా ‘జారన్’. రిషికేశ్ గుప్తా దర్శకుడు. జూన్ 5న థియేటర్లలో ఈ సినిమా విడుదలైన ఈమూవీ ప్రస్తుతం జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. భర్త .. కూతురుతో కలిసి నివసించే రాధకు చేతబడి చేస్తారు. ఆమెకు చేతబడి ఎవరు చేస్తారు? అందుకు కారణం ఏమిటి? ఆ క్షుద్ర శక్తి బారినుంచి రాధ బయటపడుతుందా? అనేది కథ. ఈ కంటెంట్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

  • ఇండియన్‌ ఐకానిక్ మూవీ ‘షోలే’కు 50 ఏళ్లు

    ఇండియన్‌ సినిమాకు మైలురాయిగా నిలిచిన ‘షోలే’ ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 1975 ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ అప్పటినుంచి ఇప్పటివరకు సినీఅభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. రమేష్ సిప్పీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని, సంజీవ్ కుమార్, అమజద్ ఖాన్ వంటి నటుల అద్భుత నటనతో చరిత్రలో నిలిపింది.

  • ధ్రువ్‌ విక్రమ్‌తో ముగ్గురు బ్యూటీస్ రొమాన్స్!

    గతేడాది హిట్ అయిన ‘కిల్‌’ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్‌ దర్శకుడు రమేష్‌ వర్మ దీన్ని తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్‌ కోసం ధ్రువ్‌ విక్రమ్‌ హీరోగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులోనే ధ్రువ్‌కి జంటగా కాయదు లోహార్‌, అనుపమ పరమేశ్వరన్‌, కేతిక శర్మను తీసుకున్నట్లు తెలుస్తోంది.దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

  • జియో హాట్‌స్టార్ బంపర్ ఆఫర్.. అన్నీ ఫ్రీ!

    ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా రేపు తమ ఓటీటీలో ఉన్న మొత్తం కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులో తీసుకురానుంది. షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు మొత్తం కంటెంట్‌ను పబ్లిష్ చేయనుంది. ‘ఆపరేషన్ తిరంగ’ అనే పేరుతో ఆడియన్స్‌కు అందించనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం ఆగస్టు 15 ఒక్క రోజు మాత్రమే ఉండనున్నట్లు ప్రకటించింది.

  • సైమా ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

    సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు చలనచిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు ఏడు జాతీయ అవార్డులు వచ్చినప్పటికీ, పరిశ్రమ గుర్తించి సత్కరించకముందే సైమా ఆ పని చేసిందని ఆయన పేర్కొన్నారు. “ఎవరి కుంపటి వారిదే” అని, అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • లంగా ఓణీకే అందం తెచ్చిన జాన్వీ!

    పొట్టి దుస్తుల్లో క‌నిపించే హీరోయిన్ జాన్వీక‌పూర్ తాజాగా లంగా ఓణీలో ప‌ల్లెటూరి అమ్మాయిలా క‌నిపించింది. సంప్ర‌దాయ లుక్‌లో ఆమె షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది.

  • కమల్ కూతురు కాదన్నారు.. శృతిహాసన్ ఎమోషనల్!

    హీరోయిన్ శృతిహాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపింది. ‘‘నా మొదటి సినిమా తర్వాత నేను ఎన్నో అనుమానాలు ఎదుర్కొన్నాను. అందరూ అసలు నువ్వు కమల్‌హాసన్ కూతురు కాదని అన్నారు. నటన, హిట్ పరంగా చులకనగా మాట్లాడారు. ‘గబ్బర్ సింగ్’ కోసం నన్ను సంప్రదించినప్పుడు.. అందరూ శృతిహాసన్‌ను తీసుకోవద్దని అన్నారు. హరీష్‌శంకర్ నన్ను తీసుకోవడంతో నా జీవితం మారిపోయింది’’ అని చెప్పుకొచ్చింది.