Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • రజనీ ‘కూలీ’ వచ్చేది ఆ ఓటీటీలోనే!

    రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా నేడు థియేటర్లలో విడుదలైన మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ఈ మూవీ డిజటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్లకు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ‘కూలీ’ ఓటీటీలోకి రానుంది.

  • మిరాయ్’ హిందీ రిలీజ్ రైట్స్ వారికే!

    ‘తేజా సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమా హిందీ రిలీజ్ హక్కులను ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

  • బిగ్​‌బాస్-9.. ‘అగ్నిపరీక్ష’ ప్రోమో రిలీజ్‌

    తెలుగు బిగ్​‌బాస్-9 త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈసారి సీజన్‌-9 కన్నా ముందు బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ను ప్రత్యేకంగా ఓ షో ద్వారా ఎంపిక చేయనున్నారు. తాజాగా ఈ ‘అగ్నిపరీక్ష’ వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రోమో రిలీజ్‌ చేశారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ప్రతిరోజు హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు.

  • చిక్కుల్లో జాన్వీకపూర్ ‘పరమ్ సుందరి’!

    జాన్వీకపూర్‌-సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా నటిస్తున్న చిత్రం ‘పరమ్ సుందరి’. ఇటీవలే ట్రైలర్‌ రిలీజ్ చేయగా.. ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ ట్రైలర్‌లో చర్చిలో వచ్చే రొమాంటిక్ సీన్‌పై అభ్యంతరం వ్యక్తమవుతోంది. దీనిపై ‘వాచ్‌డాగ్ ఫౌండేషన్’ సంస్థ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని లేఖలో కోరింది. ఈనెల 29న మూవీ విడుదలకానుంది.

  • రేవంతన్నకు నా కృతజ్ఞతలు: రాహుల్ సిప్లిగంజ్

    సీఎం రేవంత్‌రెడ్డితో.. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నాలాంటి కళాకారులని గుర్తు పెట్టుకుని, అక్కున చేర్చుకుని, అందరికీ ప్రేరణగా నిలుస్తూ ఎంతో ఉత్సాహాన్ని అందిస్తున్న సీఎం రేవంతన్నని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపాను.  రేవంతన్నా మీరు ఇచ్చే ప్రోత్సాహం మరువలేనిదని’ రాహుల్ కొనియాడారు.

  • ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్‌లు!

    వరుస సెలవులు వేళ ఈ వారం ఓటీటీ వేదికగా పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.

    • ఈటీవీ విన్‌: ‘కానిస్టేబుల్‌ కనకం’
    • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో: ‘అంధేరా’
    • జీ5: ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’
    • సోనీలివ్‌: ‘కోర్ట్‌ కచేరీ’
    • నెట్‌ఫ్లిక్స్‌: ‘సారే జహాసే అచ్చా’
    • సన్‌నెక్ట్స్‌: ‘గ్యాంబ్లర్స్‌’ (ఆగస్టు 15)
    • జియోహాట్‌ స్టార్‌: ‘ఏలియన్‌ ఎర్త్‌’ (ఆగస్టు 15)

  • నటుడు దర్శన్ అరెస్ట్

    కన్నడ నటుడు దర్శన్ తూగుదీపని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక హైకోర్టు ఆయనకు జారీ చేసిన బెయిల్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. రద్దు చేసిన గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. దర్శన్‌తో పాటు పవిత్రగౌడ్‌‌ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తన అభిమాని అయిన రేణుకాస్వామిని సుపారీ గ్యాంగ్‌తో కలిసి చిత్రహింసలకు గురి చేసి మరీ దర్శన్‌ చంపాడనే ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

  • ఐమాక్స్ వెర్షన్‌లో ‘బాహుబలి:ది ఎపిక్’

    ‘బాహుబలి’ రెండు భాగాలు కలిసి ‘బాహుబలి:ది ఎపిక్’గా అక్టోబర్ 31న రీ-రిలీజ్‌కానుంది. కాగా ఈమూవీ ఐమాక్స్ వెర్షన్‌లో కూడా విడుదల కాబోతున్నట్లు వరల్డ్ ఐమాక్స్ సంస్థ ప్రకటించింది.

  • దూసుకుపోతున్న ‘జిగ్రీస్’ టీజర్

    కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘జిగ్రీస్’. హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా టీజ‌ర్‌ను ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా విడుద‌ల చేయగా.. యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో అద‌ర‌గొడుతోంది. తాజాగా ఈ టీజ‌ర్ అరుదైన రికార్డును అందుకుంది. రిలీజైన వారం రోజుల్లోనే 2.3 మిలియ‌న్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డు సాధించింది.

  • హీరోయిన్ మాస్ డ్యాన్స్‌ అదిరింది.. పోస్టర్ వైరల్!

    టాలీవుడ్ బ్యూటీ నభా నటేష్ తాజాగా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో బ్లాక్ అవుట్ ఫిట్‌లో మాస్ స్టెప్స్‌తో డ్యాన్స్ ఇరగదీసింది. ఇక ఈ వీడియో.. ‘మళ్లీ ఈ వీడియోను రీపోస్ట్ చేశాను.. ఎందుకంటే ఈరోజు కూలీ డే’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.