టాలీవుడ్ బ్యూటీ నభా నటేష్ తాజాగా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో బ్లాక్ అవుట్ ఫిట్‌లో మాస్ స్టెప్స్‌తో డ్యాన్స్ ఇరగదీసింది. ఇక ఈ వీడియో.. ‘మళ్లీ ఈ వీడియోను రీపోస్ట్ చేశాను.. ఎందుకంటే ఈరోజు కూలీ డే’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.
Category: ఎంటర్‌టైన్‌మెంట్
-
‘కిష్కింధపురి’ టీజర్ టైమ్ ఫిక్స్!
బెల్లంకొండ శ్రీనివాస్-అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కిష్కింధపురి’. ఈ మూవీ టీజర్ రేపు సా.4:05గంటలకు రాబోతుందని స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
-
‘మహావతార్: నరసింహ’పై యూపీ ప్రశంసలు
యానిమేటెడ్ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సినిమా ‘మహావతార్: నరసింహ’. తాజాగా ఈ మూవీపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ‘‘‘మహావతార్: నరసింహ’ సినిమా తెరకెక్కించి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను కాపాడటానికి చేస్తున్న కృషి అద్భుతం. ఈ సినిమా యువతలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలపై ఆసక్తి పెంచేందుకు ఒక మంచి ప్రయత్నం’’ అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.
-
బంఫర్ ఆఫర్ ప్రకటించిన హీరో ఆమిర్‌ఖాన్!
బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సితారే జమీన్ పర్’. ప్రస్తుతం ఆమిర్ యూట్యూబ్‌లో కేవలం రూ.100లకే చూడొచ్చు. అయితే తాజాగా ఈ సినిమాపై ఆమిర్ మరో బంఫర్ ఆఫర్‌ను ప్రకటించాడు. ఇండిపెండెన్స్ డే కానుకగా..కేవలం రూ.50లకే అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ ఆగష్టు 15 నుంచి 17 వరకు ఉంటుందని తెలిపింది.
-
కూలీ మూవీలో పవన్ కల్యాణ్.. హోరెత్తిన థియేటర్!
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ చిత్రం ఇవాళ గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కాగా ఈ సినిమాలో ఓ డైలాగ్ మాత్రం థియేటర్ దద్దరిల్లేలా చేసిందని అభిమానులు చెబుతున్నారు. సినిమాలో రజినీకాంత్.. చిరంజీవి, పవన్ కల్యాణ్ పేర్లను ప్రస్తావిస్తారని.. ఆ సమయంలో థియేటర్ మొత్తం హోరెత్తిందని అభిమానులు థియేటర్ బయటకి వచ్చి కామెంట్స్ చేస్తున్నారు.
-
అలా అడిగితే పొగరంటారు: అనుపమ
నటి అనుపమ పరమేశ్వరన్ షూటింగ్ అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సహనటులు ఆలస్యంగా వచ్చినప్పటికీ, తనను మాత్రం ముందే సెట్స్‌కి పిలుస్తారని ఆమె వాపోయారు. ఈ అలసత్వాన్ని ప్రశ్నిస్తే తనకు “పొగరు” అనే ముద్ర వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అనుపమ నటించిన ‘పరదా’ మూవీ ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది.
-
సీఎం రేవంత్‌ను కలిసిన రాహుల్ సిప్లిగంజ్
TG: జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. తనకు రూ.కోటి ప్రోత్సాహకం ప్రకటించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
-
‘వార్-2’ను దెబ్బతీసిన VFX
ఫాంటసీ ప్రపంచాలను సృష్టించాలన్నా, అసాధ్యమైన సన్నివేశాలను తెరపై చూపించాలన్నా VFX తప్పనిసరి. బాహుబలి చిత్రం విజయం సాధించడంలో నాణ్యమైన వీఎఫ్‌ఎక్స్ కీలక పాత్ర పోషించింది. అయితే, ‘ఆదిపురుష్’, ‘హరిహర వీరమల్లు’ లాంటి చిత్రాలలో VFX నాసిరకంగా ఉండటంతో విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన వార్-2 సినిమాకు పూర్ VFX మైనస్ అని టాక్ వస్తోంది.
-
‘వార్-2’ మూవీ రివ్యూ
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్-2 చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. శత్రువులుగా మారిని మిత్రులు విక్రమ్(NTR), కబీర్(హృతిక్) దేశం కోసం ఒక్కటై విదేశీ కుట్రను ఎలా తిప్పికొట్టారనేదే ‘వార్-2’ స్టోరీ. యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఎన్టీఆర్, హృతిక్ చాలా చక్కగా నటించారు. పూర్ VFX మైనస్ అని చెప్పాలి. మొత్తానికి స్పై యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికి నచ్చుతుంది. రేటింగ్ 2.25/5.
-
రజనీకాంత్ ‘కూలీ’ మూవీ రివ్యూ
రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. మిత్రుడి(సత్యరాజ్)ను ఎవరు, ఎందుకు చంపారో హీరో (రజనీకాంత్) తెలుసుకునే క్రమంలో జరిగే సంఘటనలే ‘కూలీ’ స్టోరీ. యాక్షన్ సీన్లు, కొన్నిచోట్ల ట్విస్టులు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ సాగదీతలా అనిపిస్తుంది. నాగార్జున పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ మూవీలో రజనీకాంత్ కంటే సౌబిన్ షాహీర్ ఎక్కువ సేపు కనిపించడం కొంత మైనస్ అని చెప్పాలి. రేటింగ్ 2.25/5