Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • తిరుమల శ్రీవారి సేవలో జాన్వీ కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర

    తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు జాన్వీ కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. TTD అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  జాన్వీ, సిద్ధార్థ్‌ కలిసి నటించిన ‘పరమ్‌ సుందరి’ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది.

     

     

  • నటుడు దర్శన్‌కు చుక్కెదురు.. బెయిల్‌ రద్దు

    కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు భారీ షాక్‌ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఆయనకు జారీ చేసిన బెయిల్‌ను సుప్రీం కోర్టు గురువారం రద్దు చేసింది. పవిత్రగౌడ్‌ వేధింపుల వ్యవహారంలో తన అభిమాని అయిన రేణుకాస్వామిని సుపారీ గ్యాంగ్‌తో కలిసి చిత్రహింసలకు గురి చేసి మరీ దర్శన్‌ చంపాడనే ఆరోపణలపై  కేసు నమోదైన విషయం తెలిసిందే.

  • థియేటర్‌లో NTR ఫ్యాన్స్ గొడవ.. కారణమిదే!

    AP: నంద్యాల జిల్లా ఆత్మకూరులోని రంగమహాల్ థియేటర్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్2’ మూవీ ప్రదర్శనకు అంతరాయం ఏర్పడింది. సినిమా నడుస్తుండగా.. మధ్యలో సౌండ్ కట్ అయ్యింది. దీంతో థియేటర్ యాజమాన్యంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవకు దిగారు. దాదాపు 20 నిమిషాల పాటు సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో థియేటర్ యాజమానులపై ఫ్యాన్స్ మండిపడ్డారు.

  • ‘కూలీ’ బ్లాక్‌బస్టర్ హిట్: తరుణ్‌ ఆదర్శ్‌

    రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్(X) వేదికగా రివ్యూ ఇచ్చారు. ‘‘సినిమా ఫెంటాస్టిక్, మాస్ ఎంటర్టైనర్‌గా ఉంది. రజనీకాంత్ నటన, స్క్రీన్ ప్లే, సంగీతం బాగున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. మొత్తానికి రజనీకాంత్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ హిట్ చేరినట్టే’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

     

     

     

  • రజనీకాంత్ కంటే.. సాబిన్ స్క్రీన్ టైమే ఎక్కువ!

    రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ‘కూలీ’ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలామంది తమ అభిప్రాయాలను సోషల్‌మీడియాలో వేదికగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రజనీకాంత్ కంటే సౌబిన్‌షాహిర్ ఎక్కువగా కనిపిస్తారని చెబుతున్నారు. ఫస్టాప్ కొంచెం బాగున్నప్పటికీ, సెకండాఫ్ మాత్రం స్లోగా ఉందని అంటున్నారు. ఇక ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదని పేర్కొన్నారు.

     

  • NTRకు రక్తపు తిలకం దిద్దిన ఫ్యాన్

    ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్2 తాజాగా థియేటర్లలో విడుదలైంది. దీంతో తారక్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. తమ అభిమాన నటుడి ఫ్లెక్లీలతో ఉత్సహంగా థియేటర్ల ముందు డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీకి ఓ అభిమని తన రక్తంతో తిలకం దిద్దాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

  • మృణాల్‌కు బిపాసా బసు కౌంటర్‌!

     హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గతంలో.. బిపాసాబసు కంటే తాను అందంగా ఉంటానని, ఆమె కండలు తిరిగిన పురుషుడిలా కనిపిస్తారని చెప్పిన  వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో  బిపాసా  తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘‘బలమైన మహిళలు ఎప్పుడూ ఒకరి ఉన్నతి కోసం మరొకరు కృషి చేస్తారు. మహిళలంతా ఎంతో బలంగా, దృఢంగా ఉండాలి. అమ్మాయిలు బలంగా కనిపించకూడదు అనే పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రండి’’ అని పేర్కొన్నారు.

  • ప్రముఖ నటి కారుకు ప్రమాదం

    నటి శిల్పా శిరోద్కర్ కారును ముంబైలో బుధవారం సిటీఫ్లో బస్సు ఢీకొట్టింది. ఆమె కారు దెబ్బతిన్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. బస్సు కంపెనీ బాధ్యత వహించడానికి నిరాకరించడంపై ఆమె నిరాశ వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రమాదంలో తన కారులో ఉన్న ఎవరికీ గాయాలు కాలేదని శిల్పా స్పష్టం చేసింది.

  • థియేటర్ల వద్ద రజనీకాంత్ ఫ్యాన్స్ సందడి

    రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కూలీ’. ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి రానుంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా థియేటర్ల వద్ద రజనీ ఫ్యాన్స్ సందడి నెలకొంది. మధురైలోని ఓ థియేటర్ వద్ద రజనీకాంత్ అభిమానులు డ్రమ్స్ వాయించుకుంటూ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు

    ప్రముఖ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా వివాదంలో చిక్కుకున్నారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేశారంటూ వారిద్దరిపై కేసు నమోదైంది.